India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అవును నిజమే.. ఓ యువకుడిని తన గర్ల్ ఫ్రెండే కిడ్నాప్ చేసింది. తిరుపతిలో ఓ లాడ్జి నిర్వహిస్తున్న నానికి అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందిన భాను పరిచయమైంది. వారి మధ్య ప్రేమ మొదలై సన్నిహితంగా ఉంటున్నారు. ఇటీవల భానును నాని పట్టించుకోలేదు. కోపం పెంచుకున్న భాను.. కారులో వచ్చి తిరుపతిలో ఉన్న నానిని కిడ్నాప్ చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు వాయల్పాడు వద్ద కారు ఆపి నానిని కాపాడారు.
శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో M.A ఎకనామిక్స్ రెండవ సెమిస్టర్, LLM 4వ సెమిస్టర్, ఎంఎస్సీ ఇంటిగ్రేటెడ్ ఫుడ్ టెక్నాలజీ 7వ సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలు గురువారం విడుదలైనట్లు మహిళా యూనివర్సిటీ కార్యాలయం పేర్కొంది. ఫలితాలను https://www.spmvv.ac.in/ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.
తిరుపతి జిల్లాకు వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మరో 24 గంటల్లో జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 45 నుంచి 65 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వారు స్పష్టం చేశారు. కాగా మత్స్యకారులు ఎవ్వరూ వేటకు వెళ్లరాదని ఇప్పటికే అధికారులు హెచ్చరించిన విషయం తెలిసిందే.
మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని మాజీ మంత్రి రోజా మర్యాదపూర్వకంగా కలిశారు. కోలారులో జరిగిన పెద్దిరెడ్డి సోదరి కుమారుడు వివాహ వేడుకల్లో వారు కలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించారు.
చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘ఎర్రావారిపాలెంలో చిన్నారి పరువు తీసింది పోలీసులే. మా తిరుపతి ఎస్పీ చాలా కష్టపడి నాపై పోక్సో కేసు పెట్టారు. నేను న్యాయశాస్త్రం చదివా. నాకు చట్టాలు తెలుసు. నాపై తప్పుడు కేసులు పెట్టిన పోలీసులను వదలను. ముందుగా వాళ్లపై పరువునష్టం దావా వేస్తా. తర్వాత ప్రైవేట్ కేసు నమోదు చేస్తా’ అని చెవిరెడ్డి ప్రకటించారు.
చిత్తూరు పట్టణం దుర్గానగర్ కాలనీలోని రోసి నగర్‌కు చెందిన శంకర్ అనే వ్యక్తి పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేస్తూ సస్పెండ్ అయ్యాడు. తాగుడుకు బానిసై తన తల్లి వసంతమ్మును తాగడానికి డబ్బులు అడిగాడు. లేవు అనడంతో కాలితో బలంగా తన్నాడు. తలకు తీవ్రగాయాలు కావడంతో ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో స్విమ్స్‌కు తరలించారు. కేసు నమోదు చేసినట్టు టూ టౌన్ సీఐ నెట్టికంటయ్య తెలిపారు.
రైతు సహకార పరిపతి సంఘంతో రైతులకు లాభాలు అధికమని గుంటూరుకు చెందిన ఉద్యానవన శాఖ డిప్యూటీ డైరెక్టర్ అండల్ అన్నారు. పీటీఎం మండలం మద్దయ్యగారిపల్లెలో నిర్మించిన రైతు సహకార పరిపతి సంఘం కార్యాలయాన్ని ఆయన జిల్లా ఉద్యానవన శాఖాధికారి రవీంద్రబాబుతో కలిసి పరిశీలించారు. రైతుల భాగస్వామ్యంపై నడుస్తున్న ఈ సంఘంతో రైతులు అనేక లాభాలు పొందవచ్చని వారు స్పష్టం చేశారు.
సీఎం చంద్రబాబు కొద్దిసేపటి క్రితం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. నారావారిపల్లెలో ఆయన సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు కర్మక్రియల్లో పాల్గొనడానికి వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు, టీటీడీ ఈవో శ్యామల రావు ఆయనకు స్వాగతం పలికారు. బొకేలు అందజేసి శాలువాతో సత్కరించారు.
ప్రస్తుతం అల్పపీడన ప్రభావంతో తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు పోలీసు వారి సూచనలను పాటించాలని SP సుబ్బరాయుడు తెలిపారు. సురక్షితంగా ఉండాలని అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం డయల్ 112/80999 99977నంబర్‌కు సమాచారం ఇవ్వాలని చెప్పారు. పోలీసులు తక్షణ సహాయక చర్యలు అందిస్తారని జిల్లా ఎస్పీ ప్రజలకు సూచించారు.
<<14718200>>ప్రేమ జంటకు<<>> గ్రామస్థులు పెళ్లి చేసిన ఘటన బుధవారం రొంపిచర్లలో జరిగింది. భాకరాపేటకు చెందిన ప్రసన్న, గానుగచింతకు చెందిన రెడ్డప్ప డిగ్రీ చదువుకుంటూ ప్రేమించుకున్నారు. ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. ఇష్టంలేని పెళ్లి చేసుకున్నందుకు పెళ్లి కుమార్తె తల్లి ఆమె మెడలోని తాళి తెంచేసింది. అయితే ప్రియుడే కావాలని ఆమె అతని దగ్గరకు వెళ్లడంతో గ్రామస్థులు ఆలయంలో ప్రేమజంటకు మళ్లీ తాళి కట్టించారు.
Sorry, no posts matched your criteria.