India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ అధికారులకు కీలక సూచన చేశారు. అధికారులు ఎప్పటికప్పుడు ఆయా ప్రాంతాల్లోని సమచారాన్ని RDO కార్యాలయాల్లోని కంట్రోల్ రూంకు లేదా కలెక్టరేట్‌కు తెలియజేయాలన్నారు. కంట్రోల్ రూం నంబర్లు తిరుపతి కలెక్టరేట్ 0877-2236007 గూడూరు RDO ఆఫీసు 08624-252807, సూళ్లూరుపేట RDO ఆఫీసు 08623-295345 శ్రీకాళహస్తి RDO ఆఫీసు 8555003504ను సంప్రదించాలన్నారు.
తిరుమల శ్రీవారి దర్శనానికి ప్రస్తుతం నేరుగా లైన్ వెళ్తుంది. అన్ని కంపార్టుమెంట్లు ఖాళీగా ఉన్నాయి. ఉదయం 7:30 నుంచి 8 గంటల తరువాత నిండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. స్వామివారిని మంగళవారం 64,525 మంది దర్శించుకున్నారు. 19,880 మంది తలనీలాలు సమర్పించారు. సోమవారం హుండీ ద్వారా సమర్పించిన కానుకలను మంగళవారం లెక్కించగా రూ.3.53 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు బుధవారం ప్రకటించారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులకు డ్రీమ్ ఫౌండేషన్ 28వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. న్యూ బాలాజీ కాలనీలోని రాస్ (RASS) కార్యాలయంలో జాబ్ మేళా జరుగుతుందన్నారు. 4 కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని తెలియజేశారు. 18-35 సంవత్సరాల్లోపు 10వ తరగతి, ఇంటర్, ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన విభిన్న ప్రతిభావంతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
తిరుపతి జిల్లాలో ఈనెల 26 నుంచి 28 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. వాతావరణ శాఖ సూచనల మేరకు జిల్లాలోని మత్స్యకారులు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లరాదని సూచించారు. జిల్లాలో ఏ సమస్య వచ్చినా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సైక్లోన్ కంట్రోల్ రూమ్ 0877-2236007కు సమాచారం అందించాలని కోరారు.
తల్లిని కాదని ప్రియుడి వెంటే ప్రియురాలు వెళ్లిన ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. రొంపిచెర్లకు చెందిన రెడ్డప్ప, చిట్టిప్రసన్న ప్రేమించుకున్నారు. అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూస్తుండటంతో అబ్బాయి దగ్గరకు వచ్చేసింది. ఓ గుడిలో పెళ్లి చేసుకున్నారు. విషయం తెలుసుకున్న చిట్టిప్రసన్న తల్లి కూతురు మెడలో కట్టిన పసుపు తాడు తెంచేసింది. తాను అబ్బాయితోనే ఉంటానని అమ్మాయి పోలీసులకు చెప్పడంతో కథ సుఖాంతమైంది.
కన్న కొడుకు చేతిలో తల్లి హతమైనట్లు మంగళవారం పెద్దమండెం ఎస్ఐ పీవీ రమణ తెలిపారు. సీ.గొల్లపల్లిలో ఉండే ఓబులమ్మ (72)పై 24న కుమారుడు ఓబులేసు పెన్షన్ డబ్బుకోసం కర్రతో దాడి చేసిన సంగతి తెలిసిందే. బాధితురాలిని రాయచోటికి తరలించగా.. పరిస్థితి విషమించడంతో సోమవారం అర్ధరాత్రి ఓబులమ్మ మృతి చెందారు. పోలీసులకు సమాచారం అందడంతో ఓబులేసుపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
మొట్టమొదటి సారిగా IPL వేలం పాటలోకి ఉ.చిత్తూరు జిల్లాకు చెందిన క్రీడాకారుడు గిరీశ్ కుమార్ రెడ్డి ఎంట్రీ ఇచ్చాడు. రామచంద్రాపురం మండలం నూతిగుంటపల్లెకి చెందిన ఈయన SVUలో బీటెక్ పూర్తిచేశాడు. క్రికెట్లో రాణిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. దీంతో ఆయన IPL వేలంపాటలోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఈ సారి గిరీశ్ కుమార్ రెడ్డిని ఏ జట్టు కొనుగోలు చేయలేదు.
తిరుమలలో వైకుంఠ ఏకాదశికి సంబంధించి టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి సమీక్ష నిర్వహించారు. వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 19వ తేది వరకు 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలను టీటీడీ కల్పించనుంది. ఇందుకు సన్నద్ధం కావాలని ఆయా శాఖల అధికారులను ఆయన ఆదేశించారు.
తిరుపతి శ్రీ వేంకటేశ్వర జంతు ప్రదర్శనశాలలో ‘మధు’ అనే బెంగాల్ టైగర్ మృతి చెందినట్లు జూ అధికారులు తెలిపారు. మధును 11 ఏళ్ల వయస్సులో 2018లో బెంగళూరులోని బన్నెరగట్ట బయోలాజికల్ పార్క్ నుంచి తీసుకొచ్చారు. వృద్ధాప్యంతో మధు చనిపోయినట్లు సోమవారం అధికారులు తెలిపారు.
ఎవరెస్టు శిఖరంలోని బేస్ క్యాంపులో 5364 మీటర్ల ఎత్తులో తిరుపతి వైసీపీ నేత భూమన అభినయ రెడ్డి ఆ పార్టీ జెండాను ఆదివారం ఎగురువేశారు. అత్యున్నత శిఖరం పైకి ఎక్కి పార్టీ జెండా ఎగరవేయడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన వెల్లడించారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో వైసీపీ జెండా రెపరెపలాడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Sorry, no posts matched your criteria.