India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

చిత్తూరు జిల్లాలో గత 24 గంటల్లో కురిసిన వర్షపాత వివరాలను అధికారులు తెలిపారు. అత్యధికంగా పెనుమూరు మండలంలో 31 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. జీడి నెల్లూరులో 7.2, చిత్తూరు రూరల్ లో 5.4, కుప్పం 8.4, బంగారుపాలెం 1.6 యాదమరి 1, చిత్తూరు అర్బన్ 10.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయినట్టు చెప్పారు. మొత్తం 7 మండలాలలో వర్షపాతం నమోదుకాగా 25 మండలాలలో వర్షం పడలేదన్నారు.

చిత్తూరు జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.117నుంచి రూ.138, మాంసం రూ.170 నుంచి 205 వరకు పలుకుతోంది. స్కిన్ లెస్ రూ.193 నుంచి రూ.230 వరకు విక్రయిస్తున్నారు. లేయర్ మాంసం కిలో రూ.195 చొప్పున అమ్ముతున్నారు. మరోవైపు కేజీ మటన్ రూ.800 నుంచి రూ. 900 మధ్య ఉంది. మీ ఏరియాలో మాంసం ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

చిత్తూరు SP తుషార్ డూడీ శనివారం జిల్లాకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి, చిత్తూరు జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జ్ బి.కృష్ణ మోహన్‌ను కలిశారు. ఈ సందర్భంగా కోర్టు కార్యాలయంలో న్యాయమూర్తికి పూలమొక్కను అందజేసి స్వాగతం పలికారు. అనంతరం జిల్లా న్యాయవిధాన పరిపాలనపై వారు చర్చించారు.

చిత్తూరు జిల్లాలో అభివృద్ధి పనులకు నిధుల కొరత లేదని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. 15వ ఆర్థిక సంఘం, జడ్పీ నిధులు మంజూరు చేస్తామన్నారు. పంచాయతీ రాజ్, RWS శాఖల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై కలెక్టరేట్ నుంచి వీడియో కాన్పరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు. నవంబరులోగా ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో తాగునీటి సమస్య లేకుండా పనులు చేపట్టాలని ఆదేశించారు.

చిత్తూరులో పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌ను ఎస్పీ తుషార్ డూడీ శుక్రవారం పరిశీలించారు. త్వరలోనే రిక్రూట్ కానిస్టేబుల్‌లకు శిక్షణ ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు. శిక్షణ ప్రమాణాలు అత్యుత్తమంగా ఉండేలా అన్ని విభాగాలను ఆయన పరిశీలించారు. సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. వసతి గదులు పరిశుభ్రంగా గాలి, వెలుతురు ఉండేలా చూడాలని ఆదేశించారు.

వెదురుకుప్పం మండలం దేవళంపేటలో అంబేడ్కర్ విగ్రహాన్ని హోం మంత్రి అనిత శనివారం పరిశీలించనున్నట్లు జీడీనెల్లూరు నియోజకవర్గ టీడీపీ నాయకులుతెలిపారు. ఉదయం 10 గంటలకు ఆమెతోపాటు ఎమ్మెల్యే డాక్టర్ థామస్, చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు హాజరవుతారని పేర్కొన్నారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కూటమి నాయకులు పాల్గొనాలని కోరారు.

మెగా డీఎస్సీలో ఎంపికైన టీచర్లకు చిత్తూరులోని ఓ స్కూల్లో శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీనిని కలెక్టర్ సుమిత్ కుమార్ పరిశీలించారు. నూతనంగా ఎంపికైన టీచర్లు బాధ్యతాయుతంగా పనిచేసి భావి భారత పౌరులను తయారు చేసేలా కృషి చేయాలని సూచించారు. విధుల్లో చేరిన నాటి నుంచి చివరి దశ వరకు ఉత్సాహంగా పనిచేయాలన్నారు. సమగ్ర శిక్ష ఏపీడీ వెంకటరమణ, ఇందిరా, నాగేశ్వరరావు పాల్గొన్నారు.

పాలీహౌస్ వ్యవసాయంపై రైతులు దృష్టి పెట్టాలని ఈ పద్ధతి ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. కుప్పంలో ఉద్యానవన శాఖ సీడ్ ఏపీ ఆధ్వర్యంలో పాలీహౌస్ సాగుపై రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్, ఎమ్మెల్సీ శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ ఛైర్మన్ మునిరత్నం రైతులతో సమావేశం అయి వారికి పలు సూచనలు ఇచ్చారు.

స్త్రీనిధి ద్వారా రూ.346 కోట్ల రుణాలు పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు డీఆర్డీఏ పీడీ శ్రీదేవి తెలిపారు. డీఆర్డీఏ సమావేశ మందిరంలో ఏపీఎంలు, సీసీలతో జిల్లా ప్రగతిపై ఆమె సమీక్షించారు. ‘ఉన్నతి’ ద్వారా రూ.20 కోట్లు, సామాజిక పెట్టుబడి నిధి ద్వారా రూ.6 కోట్లు మంజూరు చేయాలని నిర్ణయించామని, ఈ అంశాలను ప్రజల్లో తీసుకెళ్లి వారి ఆదాయ అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించాలన్నారు.

అరటి ధరలు భారీగా పడిపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో SRపురం, పలమనేరు, వీకోట, బైరెడ్డిపల్లి మండలాల్లో రైతులు విరివిగా అరటి పంటను సాగు చేశారు. ధరలు లేకపోవడంతో పలువురు రైతులు పంటను తోటలోని వదిలేస్తున్నారు. రూ.లక్షల్లో పంట నష్టం వాటిల్లుతోందని, ప్రభుత్వం ఆదుకోవాలని రైతుల కోరుతున్నారు.
Sorry, no posts matched your criteria.