India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కార్వేటి నగరంలో వేణుగోపాలస్వామి వారి తెప్పోత్సవం మూడవ రోజు టీటీడీ ఆధ్వర్యంలో శుక్రవారం వైభవంగా నిర్వహించారు. సాయంత్రం స్వామి వారి ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించి తిరుచ్చి వాహనంపై కొలువు దీర్చి పురవీధుల్లో భక్తులకు దర్శనం కల్పించారు. చివరి రోజు వేణుగోపాలస్వామి తెప్పోత్సవం వీక్షించడానికి కోనేరు వద్దకు భక్తులు భారీ ఎత్తున విచ్చేశారు.
చౌడేపల్లి మండలంలోని ప్రసిద్ధ బోయకొండ గంగమ్మ దేవస్థానం ధర్మకర్తలి మండలి నియామకానికి దేవాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారని ఆలయ ఉప కమిషనర్ ఏకాంబరం శుక్రవారం తెలిపారు. ఆసక్తి ఉన్నవారు ఈనెల 27 లోపు దేవస్థాన కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని సూచించారు. ఈనెల 7న నోటిఫికేషన్ జారీ చేశారని దరఖాస్తుకు 20 రోజుల గడువు విధించారని ఆయన చెప్పారు.
సచివాలయ ఉద్యోగి సంజీవ్‌పై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు పుంగనూరు SI వెంకటరమణ తెలిపారు. కొండందొడ్డి గ్రామానికి చెందిన ఓ రైతుకు రామకుప్పం సచివాలయ అగ్రికల్చర్ అసిస్టెంట్ సంజీవ్ ట్రాక్టర్ ఇప్పిస్తానంటూ రూ.4.60 లక్షలు తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ట్రాక్టర్ ఇప్పించమని అడగగా ఆయన ముఖం చాటేయడంతో మోసిపోయానని గ్రహించిన రైతు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI పేర్కొన్నారు.
వెదురుకుప్పానికి చెందిన లోకేశ్‌కు పోక్సో కోర్ట్ 20 ఏళ్ల కారాగార శిక్ష, రూ.9,500 జరిమానా విధించింది. నిందితుడు 2022లో 14 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకుని మోసం చేశాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు 2022 ఫిబ్రవరి 4న తిరుపతి DSP మిస్సింగ్ కేసు నమోదు చేశారు. చిత్తూరు పోక్సో కోర్టులో గురువారం వాదనల అనంతరం జడ్జ్ నిందితుడికి శిక్ష విధించారు.
కుప్పంలోని చిత్తూరు కన్నన్ లే అవుట్ లో మంగళవారం రామదాసు అనే వ్యక్తిని రాయితో కొట్టి చంపిన ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు సీఐ శంకరయ్య తెలిపారు. తన భార్యను కాపురానికి పంపలేదన్న కోపంతో అల్లుడు రాజ్ కుమార్, అతని స్నేహితుడు గొవిందరాజులుతో కలిసి మామ రాముదాసును హత్య చేశాడు. ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించామని సీఐ స్పష్టం చేశారు.
ఆగస్టు 15న జరగనున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో వేడుకల నిర్వహణపై గురువారం వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్షించారు. అధికారులకు కేటాయించిన విధులను సమన్వయం చేసుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. డీఆర్ఓ మోహన్ కుమార్, డీఎఫ్ఓ ధరణి తదితరులు పాల్గొన్నారు.
చిత్తూరులో ఈనెల 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు అతిథిగా మంత్రి సత్య కుమార్ యాదవ్ హాజరు కానున్నారు. జాతీయ జెండాను ఎగరవేసి సందేశం ఇచ్చేందుకు మంత్రిని నియమిస్తూ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీచేశారు.
చిత్తూరు SP మణికంఠ చందోలు నేటి నుంచి వారం రోజులపాటు సెలవులోకి వెళ్లారు. వ్యక్తిగత కారణాలతో ఆయన సెలవు తీసుకున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. అప్పటి వరకు ఇన్‌ఛార్జ్ తిరుపతి SP హర్షవర్ధన్ రాజుకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందే ప్రతి వినతిని సంతృప్తికరంగా పరిష్కరించేలా అధికారులు చొరవ చూపాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. సమస్యల పరిష్కారంపై అధికారులతో కలెక్టరేట్‌లో బుధవారం సమీక్షించారు. ప్రతి వినతిని గడువులోగా లబ్ధిదారులకు నాణ్యమైన పరిష్కారం అందేలా చూడాలని సూచించారు. నిర్లక్ష్యం చేస్తే శాఖా పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయ ప్రాంగణంలో ఈ నెల 12వ తేదీన సంకటహర గణపతి వ్రతం వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో పెంచల కిశోర్ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి 11 వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 6 వరకు గణపతి వ్రతం వేడుకలు నిర్వహిస్తారన్నారు. అనంతరం పురవీధుల్లో స్వర్ణ రథోత్సవం వేడుకలు ఉంటాయని, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొనాలని కోరారు.
Sorry, no posts matched your criteria.