India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తవణంపల్లి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. చిత్తూరు నుంచి మాధవరం వెళుతున్న ఆటోను గుర్తుతెలియని ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో పూర్తిగా నుజ్జునుజ్జు అయిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే 108 అంబులెన్స్‌లో అరగొండలోని ఓ హాస్పిటల్‌కు తరలించారు. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్‌తో డ్రైవర్ పరారయ్యాడు. మరెన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
పంచాయతీ కార్యదర్శి ప్రకాశ్‌ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ సుమిత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేసినట్లు డీపీవో సుధాకరరావు తెలిపారు. యాదమరి మండలంలోని 14 కండ్రిగ ముస్లింవాడలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. పనులు జరగకుండానే రూ.4,47,325 నిధులను డ్రా చేసి దుర్వినియోగానికి పాల్పడినట్లు డీపీవో తనిఖీల్లో నిర్ధారించారు. ఆ నివేదిక ప్రకారం కలెక్టర్ చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.
పలమనేరు కోర్టు ఆవరణలో శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్‌లో 203 కేసులు పరిష్కారమైనట్లు సీనియర్ సివిల్ జడ్జి ఆదినారాయణ తెలిపారు. సివిల్, క్రిమినల్, బ్యాంకు తదితర కేసులను పరిష్కరించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి లిఖిత, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎల్.భాస్కర్, న్యాయవాదులు, పోలీసులు పాల్గొన్నారు.
2020 జులై 20వ తేదీన మైనర్ బాలికపై రామకృష్ణ(47) అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసులో నిందితుడికి 2025 జులై 4వ తేదీ శుక్రవారం చిత్తూరు జిల్లా ప్రత్యేక పోక్సో కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.5 వేలు జరిమానా విధించింది. ముద్దాయికి శిక్ష పడేలా కృషి చేసిన దిశ డీఎస్పీ బాబు ప్రసాద్, పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్, చౌడేపల్లి సీఐ భూపాల్, ఎస్సై శివశంకర్లను జడ్జ్ అభినందించారు.
పోలీసు శాఖలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు ఎస్పీ మణికంఠ శుక్రవారం ఆర్థిక సాయం అందజేశారు. ఎస్ ఆర్ పురం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ మృతి చెందిన కానిస్టేబుల్ ఆనంద్ బాబు సతీమణి మాధవి, గుడిపల్లి స్టేషన్లో మృతి చెందిన లక్ష్మీ భర్త ఆనంద్‌కు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున చెక్కులను ఆయన అందజేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హమీ ఇచ్చారు.
తిరుపతి జిల్లా పర్యటన నిమిత్తం శ్రీ సిటీకి చేరుకున్న మంత్రి లోకేశ్‌ను GDనెల్లూరు ఎమ్మెల్యే థామస్ మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని థామస్, మంత్రిని కోరారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఆయన పేర్కొన్నారు.
చిత్తూరు జిల్లా ఉపాధి కల్పన అధికారి కార్యాలయంలో ఈనెల 28న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ పద్మజ తెలిపారు. వివిధ ప్రముఖ కంపెనీల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు. 19 నుంచి 35 ఏళ్ల లోపు వయసు ఉన్నవారు అర్హులు. ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఉదయం 10 గంటలకు ఉపాధి కార్యాలయంలో జరిగే ఇంటర్వ్యూలకు హాజరు కావాలని కోరారు.
ఇటీవల జరిగిన రామకుప్పం ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా గెలుపొందిన సులోచన గుర్రప్ప, వెంకట్రామయ్య గౌడు శనివారం సీఎం చంద్రబాబును కలిశారు. అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో సీఎంను కలిశారు. తమకు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రామకుప్పం మండలాభివృద్ధికి సంబంధించి పలు విషయాలను వారు సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
చిత్తూరు జిల్లాలో ఎండల ప్రభావం అధికమవుతోంది. శుక్రవారం 4 మండలాలలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. నగరి, తవణంపల్లెలో 41.2, శ్రీరంగరాజపురం-41, సదుం-40.7, చిత్తూరులో 39.4, బంగారుపాలెం-38.7, యాదమరి-38.6, పులిచెర్ల, పూతలపట్టు, సోమల, వెదురుకుప్పం-38.4, రొంపిచెర్ల-38.1, గంగవరం, పెద్దపంజాణి-38, చౌడేపల్లె, గంగాధర నెల్లూరు, ఐరాల, నిండ్ర, పాలసముద్రం, పెనుమూరు, విజయపురంలో 37.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
కుప్పంలో 163 సెక్షన్ విధిస్తూ తహశీల్దార్, ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ వై.చిట్టిబాబు ఉత్తర్వులు విడుదల చేశారు. సోమవారం కుప్పం మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. ఈ మేరకు మండల సచివాలయానికి వంద మీటర్ల వరకు ప్రజలు ఎవ్వరూ గుంపులు గుంపులుగా ఉండొద్దని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
Sorry, no posts matched your criteria.