India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
చిత్తూరు జిల్లాలో ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఉపాధి హామీ పథకం కింద 19 లక్షల పని దినాలు కల్పించడమే లక్ష్యమని డ్వామా పీడీ రవికుమార్ తెలిపారు. ఇప్పటివరకు 2.62 లక్షల మందికి జాబ్ కార్డులు జారీ చేయగా, 4.80 లక్షల వేతనదారులు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తెలిపారు. కూలీలు వలస వెళ్లకుండా ఉన్న గ్రామంలో ఉపాధి కల్పించడమే లక్ష్యమన్నారు. కూలీల సంఖ్య మరో లక్షకు పెరిగే అవకాశం ఉందని చెప్పారు.
కుప్పం మున్సిపల్ ఛైర్మన్ గిరి కోసం అధికార పార్టీలో పోటీ అధికంగా ఉన్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఛైర్మన్ అభ్యర్థి పేరును షీల్డ్ కవర్లో పంపిస్తారని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఛైర్మన్ గిరి కోసం 20వ వార్డు కౌన్సిలర్ సోము, 19వ వార్డు కౌన్సిలర్ దాముతో పాటు 5వ వార్డు కౌన్సిలర్ సెల్వరాజ్ పోటీపడుతుండగా సీఎం నిర్ణయమే ఫైనల్ కావడంతో ఆ పదవి ఎవరిని వరిస్తుందో అన్న అంశం సస్పెన్స్‌గా మారింది.
కుప్పం మున్సిపల్ ఛైర్ పర్సన్ ఎన్నిక ఈనెల 28న జరగనున్న నేపథ్యంలో క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన కౌన్సిలర్లను ఆ పార్టీ నేతలు క్యాంపులకు తరలిస్తున్నారు. ఈ ఎన్నికను టీడీపీ తరఫున ఎమ్మెల్సీ శ్రీకాంత్ పర్యవేక్షిస్తుండగా.. వైసీపీ తరఫున ఎంపీ మిథున్ రెడ్డి రంగంలోకి దిగారు. ఛైర్మన్ సీటు కోసం ఇరు పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి.
రోడ్ల మరమ్మతులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని ఆర్అండ్ బీ ఈఈ శ్రీనివాసులు తెలిపారు. చిత్తూరులో ఎంఎస్ఆర్ సర్కిల్ నుంచి పలమనేరు రోడ్డు, ఇరువారం మీదుగా బైపాస్ వరకు 5 కిలోమీటర్ల లేయర్‌కు రూ.2.50 కోట్లు, పలమనేరు-గుడియాత్తం రోడ్డు(3 కిలోమీటర్లు)కు రూ.1.80 కోట్లు, బైరెడ్డిపల్లె-పుంగనూరు రోడ్డు(6 కిలోమీటర్లు)కు రూ.4.50 కోట్లు విడుదల అయ్యాయి. త్వరలో టెండర్లు పిలవనున్నట్లు ఆయన తెలిపారు.
పన్నుల వసూళ్లలో గతేడాది చిత్తూరు జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. మిగిలిపోయిన పన్నులు, పన్నేతర వసూళ్లను ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.24 కోట్లకు రూ.22 కోట్లు వసూలు చేసి 88%తో ప్రథమ స్థానంలో నిలిచింది. దీంతో గురువారం జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా మంగళగిరిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా DPO సుధాకర్ రావు ఉత్తమ ప్రతిభ పురస్కారాన్ని అందుకున్నారు.
మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఫైళ్ల దగ్ధం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. YCP నేత మాధవరెడ్డిని గురువారం తిరుపతి CID పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటికే సబ్ కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ గౌతం తేజ్ అరెస్టు కాగా.. మాధవరెడ్డిని అరెస్టు చేసినట్లు CID DSP కొండయ్య నాయుడు తెలిపారు.
లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన సదుం ఇన్‌ఛార్జ్ MRO మారూఫ్ హుస్సేన్‌ను కలెక్టర్ సుమిత్ కుమార్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనతో పాటు వీఆర్వో మహబూబ్ బాషాను కూడా సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు. కొత్త MROను నియమించే వరకు ప్రస్తుతం డీటీగా ఉన్న కుమార్‌కు అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో కాణిపాకంలో సెక్యూరిటీ కట్టుదిట్ట చేశారు. భక్తుల బ్యాగులను సిబ్బంది క్షుణంగా తనిఖీ చేశారు. అనుమానం వచ్చిన భక్తుల గురించి వివరాలు ఆరా తీశారు. కాణిపాకంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
2025-26 అకాడమిక్ ఇయర్ నుంచి ఇంటర్మీడియట్ ఫస్టియర్‌కు నూతన సిలబస్‌ను ప్రవేశపెడుతున్నట్లు DIEO శ్రీనివాస్ గురువారం తెలిపారు. కన్నన్ కళాశాలలో అధ్యాపకులకు దీనిపై ఓరియంటేషన్ తరగతులు ప్రారంభించామన్నారు. ప్రతి ఒక్క అధ్యాపకుడు ఈ తరగతులకు హాజరై నూతన సిలబస్‌పైన అవగాహన పెంచుకోవాలన్నారు. కళాశాల పునఃప్రారంభం నాటికి నూతన పుస్తకాలు అందుబాటులోకి తెస్తామన్నారు.
విజయపురం(మ) ఎం.అగరంలో వైసీపీ సర్పంచ్ సుధాకర్‌పై హత్యాయత్నం జరిగిందని మాజీ మంత్రి రోజా ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు ఇప్పటికీ నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె ‘X’ వేదికగా మండిపడ్డారు. వెంటనే అసలు నిందితులను అరెస్ట్ చేయకపోతే ప్రైవేట్ కేసు వేసి న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. ప్రజా ప్రతినిధులపైనే దాడులు జరుగుతుంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ఆమె ప్రశ్నించారు.
Sorry, no posts matched your criteria.