Chittoor

News April 24, 2025

వైసీపీ సర్పంచ్‌పై హత్యాయత్నం:రోజా

image

విజయపురం(మ) ఎం.అగరంలో వైసీపీ సర్పంచ్ సుధాకర్‌పై హత్యాయత్నం జరిగిందని మాజీ మంత్రి రోజా ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు ఇప్పటికీ నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె ‘X’ వేదికగా మండిపడ్డారు. వెంటనే అసలు నిందితులను అరెస్ట్ చేయకపోతే ప్రైవేట్ కేసు వేసి న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. ప్రజా ప్రతినిధులపైనే దాడులు జరుగుతుంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ఆమె ప్రశ్నించారు.

News April 24, 2025

చిత్తూరు: DIEOగా శ్రీనివాస్ బాధ్యతలు

image

చిత్తూరు జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారిగా ఆదూరి శ్రీనివాస్ గురువారం బాధ్యతలను స్వీకరించారు. గతంలో ఈయన నెల్లూరు బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్‌గా పనిచేస్తూ రెగ్యులర్ పదోన్నతిపై DIEOగా చిత్తూరుకు వచ్చారు. అందరి సహకారంతో జూనియర్ కళాశాల విద్యాభివృద్ధికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. 

News April 24, 2025

చిత్తూరు: ఒకేసారి తండ్రి, కుమార్తె పాస్

image

చిత్తూరు జిల్లా రొంపిచర్ల పంచాయతీ పాలెం వీధికి చెందిన తండ్రి, కుమార్తె ఒకేసారి పదో తరగతి పరీక్షలు రాసి పాసయ్యారు. 1995-96లో 10వ తరగతి పరీక్షలు రాసిన బి.షబ్బీర్ ఫెయిలయ్యారు. అప్పట్లో ప్రమాదవశాత్తు గాయపడి దివ్యాంగుడిగా మారారు. ఏదైనా ఉద్యోగం సాధించాలనే తపనతో తన కుమార్తె బి.సమీనాతో కలిసి పదో తరగతి పరీక్షలు రాశారు. షబ్బీర్‌కు 319, కుమార్తె సమీనాకు 309 మార్కులు రావడం విశేషం.

News April 23, 2025

రొంపిచర్ల: పదో తరగతి ఒకేసారి పాసైన తండ్రి, కూతురు

image

రొంపిచర్ల గ్రామపంచాయతీ పాలెం వీధికి చెందిన తండ్రి, కూతురు పదో తరగతి పరీక్షలు రాసి ఒకే సారి పాసైన సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. 1995-96 సంవత్సరంలో 10 పరీక్షలు రాసిన బి.షబ్బీర్ ఫెయిల్ అయ్యారు. అప్పట్లో ప్రమాదవశాత్తు గాయపడి దివ్యాంగుడిగా మారాడు. ఏదైనా ఉద్యోగం సాధించాలని కుమార్తెతో పాటు పదో తరగతి పరీక్షలు రాశాడు. తండ్రి బి.షబ్బీర్‌కు 319 మార్కులు, కుమార్తె బి.సమీనాకు 309 మార్కులు వచ్చాయి.

News April 23, 2025

టెన్త్ ఫలితాలు: 6 నుంచి 24వ స్థానానికి చిత్తూరు జిల్లా

image

ఈ ఏడాది 10వ తరగతి ఫలితాల్లో చిత్తూరు జిల్లాలో ఉత్తీర్ణత శాతం తీవ్ర నిరాశకు గురి చేసింది. గతేడాది టెన్త్ ఫలితాల్లో చిత్తూరు జిల్లా 91.28% ఉత్తీర్ణతతో 6వ స్థానంలో నిలవగా, ఈ ఏడాది 67.06 శాతంతో 24వ స్థానంలో నిలిచింది. ఏడాది వ్యవధిలో దాదాపు 18 స్థానాలు దిగజారడంపై పలువురు అసహనం వ్యక్తం చేశారు.

News April 23, 2025

టెన్త్ ఫలితాల్లో 24వ స్థానంలో చిత్తూరు జిల్లా

image

తాజా టెన్త్ ఫలితాల్లో చిత్తూరు జిల్లా 24వ స్థానంలో నిలించింది. మొత్తం 20,796 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 13,946 మంది పాస్ అయ్యారు. 10,723 మంది అబ్బాయిలకుగాను 6,573 మంది, అమ్మాయిలు 10,073 మందికిగాను 7,373 మంది పాస్ అయ్యారు. కాగా 67.06 శాతం ఉత్తీర్ణత నమోదైంది.

News April 23, 2025

సివిల్స్‌లో మెరిసిన పలమనేరు వాసి

image

UPSC తుది ఫలితాలలో చిత్తూరు జిల్లా వాసి సత్తా చాటాడు. పలమనేరుకు చెందిన రంపం శ్రీకాంత్ మంగళవారం వెలువడిన సివిల్స్ ఫలితాల్లో 904వ ర్యాంకు సాధించాడు. శ్రీకాంత్ ఎలాంటి కోచింగ్ లేకుండా ఈ ఘనత సాధించడంతో జిల్లా వాసులు అతనికి అభినందనలు తెలిపారు.

News April 23, 2025

చిత్తూరు: నేడే 10 ఫలితాల విడుదల

image

రాష్ట్ర వ్యాప్తంగా నేడు టెన్త్ ఫలితాలు విడుదల కానున్నాయి. దీంతో చిత్తూరు జిల్లాలో ఈ ఏడాది పరీక్షలు రాసిన 21,245 మంది విద్యార్థుల భవిష్యత్తు నేడు తేలనుంది. ఫలితాల విడుదలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. జిల్లాలో 21,245 మంది పరీక్ష రాయగా వారిలో 294 మంది ప్రైవేట్‌గా, 20,951 మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్ష రాశారు.

News April 23, 2025

ఇంటర్ ఎగ్జామ్ ఫీజు గడువు పొడిగింపు: ప్రిన్సిపల్

image

ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు చెల్లించడానికి ఈ నెల 25వ తేదీ వరకు ఇంటర్ బోర్డు గడువు పొడిగించినట్లు చిత్తూరు ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ జ్యోతిస్వరన్ తెలిపారు. మంగళవారం ఫీజు కట్టడానికి చివరి రోజు కాగా ఇంటర్ బోర్డు శుక్రవారం వరకు ఫీజు గడువు తేదీని పొడిగించిందన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

News April 22, 2025

చిత్తూరు: 24 నుంచి వేసవి సెలవులు

image

ఈనెల 24వ తేదీ నుంచి జూన్ 11వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటిస్తూ రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు ఉత్తర్వులు జారీ చేశారు. జూన్ 12వ తేదీ పాఠశాలలు పునః ప్రారంభం అవుతాయని, కానీ ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయులు జూన్ 5 వ తేదీన రీడీనెస్ యాక్టివిటీస్ కోసం రిపోర్ట్ చేయాలని ఆ ఉత్తర్వులలో పేర్కొన్నారు.