Chittoor

News April 22, 2025

చిత్తూరు : ఇంటర్ డీఐఈఓగా శ్రీనివాసులు

image

చిత్తూరుజిల్లా ఇంటర్మీడియట్ డీఐఈఓగా ఏ. శ్రీనివాసులు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేశారు. నెల్లూరు జిల్లా కేంద్రంలో డీకే ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసులును చిత్తూరు డీఐఈఓగా నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. గతంలో చిత్తూరు డీఐఈఓగా పనిచేస్తున్న మౌలా తన పూర్వపు స్థానం కణ్ణన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్‌గా కొనసాగనున్నారు.

News April 22, 2025

చిత్తూరు జిల్లాలో అలా చేస్తే జైలుశిక్ష

image

మామిడి కాయలను మగ్గించడానికి కాల్షియం కార్బైడ్ అమ్మడం, నిల్వ చేయడం, రవాణా చేయడం చట్టరీత్యా నేరమని చిత్తూరు జేసీ విధ్యాధరి హెచ్చరించారు. ఎక్కడైనా తనిఖీల్లో కాల్షియం కార్బైడ్ పట్టుబడితే సెక్షన్ 44(ఏ) ప్రకారం 3 ఏళ్ల జైలుశిక్షతో పాటు రూ.1000 జరిమానా విధిస్తామని చెప్పారు.  ఎథిలీన్ గ్యాస్, ఎత్రెల్ ద్రావణాన్ని ఉపయోగించుకోవచ్చన్నారు.

News April 22, 2025

మాట నిలబెట్టుకున్న సీఎం: చిత్తూరు ఎంపీ

image

సీఎం చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీచేసి మాట నిలబెట్టుకున్నారని చిత్తూరు ఎంపీ దుగ్గుమళ్ల ప్రసాదరావు పేర్కొన్నారు. నిరుద్యోగ యువతకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ డీఎస్సీ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పరిష్కరించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

News April 21, 2025

CTR: హజ్ యాత్రికులకు ఉచిత వ్యాక్సినేషన్

image

ముస్లిం సోదరులకు చిత్తూరు జాయింట్ కలెక్టర్ విద్యాధరి శుభవార్త చెప్పారు. హజ్ యాత్రికులకు ఉచితంగా వ్యాక్సిన్ వేస్తామని ప్రకటించారు. చిత్తూరులోని టెలిఫోన్ కాలనీ అర్బన్ హెల్త్ సెంటర్‌లో మంగళవారం ఉదయం 8 గంటల నుంచి వ్యాక్సినేషన్ మొదలవుతుందని చెప్పారు. యాత్రకు వెళ్లే ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 

News April 21, 2025

తిరుపతి SVU పరీక్షలు వాయిదా

image

తిరుపతి SVUలో ఈనెల 22, 23వ తేదీల్లో ప్రారంభం కావాల్సిన డిగ్రీ రెండో, నాల్గో సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేసినట్లు పరీక్షల విభాగం అధికారి దామ్లా నాయక్ వెల్లడించారు. మొదటి రెండు రోజులకు సంబంధించిన పరీక్షలను మే 12, 14 తేదీల్లో నిర్వహిస్తామని తెలిపారు. 24 నుంచి జరగాల్సిన పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు.

News April 21, 2025

చిత్తూరు జిల్లాలో టీచర్ పోస్టులు ఇలా..!

image

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో డీఎస్సీ ద్వారా 1,478 పోస్టులు భర్తీ చేయనున్న విషయం తెలిసిందే. రోస్టర్ వారీగా పోస్టులు ఇలా కేటాయిస్తారు.
➤ OC-578 ➤ BC-A:111 ➤ BC-B:139
➤ BC-C:19 ➤ BC-D:102 ➤ BC-E:53
➤ SC- గ్రేడ్1:21 ➤ SC-గ్రేడ్2:94 ➤ SC-గ్రేడ్3:112
➤ ST:95 ➤ EWS:138
➤ PH-విజువల్:1 ➤ PH- హియర్:10
➤ ట్రైబల్ వెల్ఫేర్ :5

News April 21, 2025

మే 6 నుంచి తిరుపతి గంగమ్మ జాతర

image

తిరుపతి గ్రామదేవత తాతయ్యగుంట గంగమ్మ జాతర మే 6 నుంచి ప్రారంభం కానుంది. 6న చాటింపు వేస్తామని నిర్వాహకులు వెల్లడించారు. 7న బైరాగి వేషం, 8న బండ వేషం, 9న తోటి వేషం, 10న దొర వేషం, 11న మాతంగి వేషం, 12న సున్నపు కుండలు, 13న అమ్మవారి జాతర జరగనుంది. 14న ఉదయం చంప నరకడంతో అమ్మవారి జాతర ముగుస్తుంది. పుష్ప-2లోనూ ఈ జాతర ప్రస్తావన వచ్చిన విషయం తెలిసిందే

News April 21, 2025

కుప్పంలో నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్

image

కుప్పం నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కరించడం లక్ష్యంగా కుప్పంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కడ పిడి వికాస్ మర్మత్ తెలిపారు. ఎంపీడీవో కార్యాలయంలో ఉదయం 10.గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఏమైనా సమస్యలు ఉంటే అధికారులు దృష్టికి తీసుకురావాలని ఆయన ప్రజలకు సూచించారు. అర్జీదారులు సద్వినియోగం చేసుకొవాలి

News April 20, 2025

కుప్పం: వేలిముద్రలతో సీఎం చంద్రబాబు చిత్రం

image

సీఎం చంద్రబాబు 75వ పుట్టినరోజును పురస్కరించుకొని కుప్పం పూరి ఆర్ట్స్ పురుషోత్తం వినూత్నంగా వేసిన థంబ్ ఆర్ట్ చిత్రాన్ని కుప్పం టీడీపీ కార్యాలయానికి అందజేశారు. కాగా చంద్రబాబు థంబ్ ఆర్ట్ చిత్రంలో మేము సైతం అంటూ టీడీపీ కుప్పం ఇన్‌ఛార్జ్ మునిగత్నం, చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్ తో పాటు టీడీపీ ముఖ్య నేతలు తమ వేలిముద్రలను వేశారు. ఈ చిత్రం కాస్త పార్టీ కార్యాలయంలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.

News April 20, 2025

చిత్తూరు జిల్లాలో వేసవి తాపం

image

చిత్తూరు జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. శనివారం 41 డిగ్రీలకు పెరిగాయి. నగరిలో 41.4, శ్రీరంగ రాజపురం, తవణంపల్లె మండలాల్లో 41.2, గుడిపాల, చిత్తూరు మండలాల్లో 40.8, యాదమరిలో 40.3, గంగాధరనెల్లూరులో 40.1 ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బంగారుపాళ్యంలో 38.6, పులిచెర్ల, పూతలపట్టు, రొంపిచెర్ల, వెదురుకుప్పం మండలాల్లో 38.1, చౌడేపల్లె, ఐరాల, కార్వేటినగరం, నిండ్ర, పాలసముద్రంలో 37.7 డిగ్రీలు నమోదైంది.