Chittoor

News September 10, 2025

చిత్తూరు DFO భరణి బదిలీ

image

చిత్తూరు జిల్లా ఫారెస్టు అధికారి (DFO)గా సుబ్బరాజును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన ప్రస్తుతం కోడూరు సబ్ డీఎఫ్వోగా పని చేస్తున్నారు. ఇప్పటి వరకు చిత్తూరు డీఎఫ్ఓగా ఉన్న భరణిని స్టేట్ యాన్యువల్ యాక్షన్ ప్లానింగ్ విభాగం మేనేజింగ్ డైరెక్టర్‌గా బదిలీ చేశారు.

News September 9, 2025

చిత్తూరు జిల్లాలో తగ్గుతున్న అమ్మాయి సంఖ్య

image

చిత్తూరు జిల్లాలో లింగ నిష్పత్తిలో భారీ వ్యత్యాసాలు ఆందోళన కలిగిస్తోంది. వెయ్యి మంది మగవారికి నగరిలో అత్యల్పంగా 873 అమ్మాయిలు ఉండగా, పలమనేరులో 894, కుప్పంలో 904, చిత్తూరులో 912 మంది అమ్మాయిలు ఉన్నారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ వ్యత్యాసాలకు బాల్య వివాహాలు, గర్భంలో లింగ నిర్ధారణ, అబార్షన్లు ప్రధాన కారణమని భావించి వీటిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

News September 9, 2025

ద్రావిడ వర్సిటీలో బి.టెక్ ప్రవేశాలకు దరఖాస్తులు

image

ద్రావిడ వర్సిటీలో 2025-26 ఏడాదికి బి.టెక్ (Bachelor of Technology) కోర్సులలో మూడో విడత ప్రవేశాలకు అడ్మిషన్స్ జరుగుతున్నట్లు రిజిస్ట్రార్ కిరణ్ కుమార్ తెలిపారు. AP EAPCET-2025లో ఉత్తీర్ణత పొందిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తులకు చివరి తేదీ ఈ నెల 11 అన్నారు. పీజీ కోర్సులలో ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోవచన్నారు.

News September 8, 2025

కాణిపాకం అభివృద్ధిపై TTDకి ప్రతిపాదనలు

image

కాణిపాకం అభివృద్ధిపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుకు పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ సోమవారం ప్రతిపాదనలు అందజేశారు. కాణిపాకంలో కళ్యాణ మండపం, విశ్రాంతిభవన నిర్మాణానికి సమగ్ర ప్రతిపాదనలు అందజేసినట్టు ఎమ్మెల్యే, ఈవో పెంచల కిశోర్ తెలిపారు. అభివృద్ధికి తన పూర్తి సహకారం అందిస్తామని ఆయన హామీ ఇచ్చినట్లు వారు వెల్లడించారు.

News September 8, 2025

ఒంటరి ఏనుగు వెంట పడితే ఇలా చేయండి.!

image

పుంగనూరు నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో ఒంటరి ఏనుగుల దాడులు పెరిగిపోయాయి. పొలాల ధ్వంసం, మనుషులను సైతం చంపుతున్నాయి. దీంతో ప్రజలు బిక్కు బిక్కుమంటూ జీవిస్తున్నారు. ఒంటరి ఏనుగు నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ప్రజలు నేరుగా కాకుండా ఎస్ ఆకారంలో పరుగెత్తాలని DFO భరణి పేర్కొన్నారు. పరిగెట్టేటప్పుడు ఒంటిపై ఉన్న బట్టలను ఏనుగు ముందు వేస్తే అది వాసన చూసి నెమ్మదించే అవకాశం ఉందని ఆమె వివరించారు.

News September 8, 2025

పుంగనూరు: 601 టన్నుల యూరియా పంపిణీ

image

పుంగనూరు వ్యవ సాయశాఖ డివిజన్ పరిధి అన్ని మండలాల్లోని రైతు సేవా కేంద్రాల్లో యూరియా పంపిణీ చేస్తున్నట్లు ఏడీ శివకుమార్ తెలిపారు. పుంగనూరు, చౌడేపల్లె, సోమల, సదుం, రొంపిచెర్ల, పులిచెర్లతో పాటు పెద్ద పంజాణి, గంగవరం మండలాల రైతులకు బయో మెట్రిక్ ద్వారా 601 టన్నుల యూరియాను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. రైతులు తమ పాసుపుస్తకాలు, ఆధార్ జిరాక్స్ తో యూరియా పొందాలని సూచించారు.

News September 7, 2025

క్వారీని వెంటనే సీజ్ చేయండి: MLA థామస్

image

వెదురుకుప్పం(M) బందార్లపల్లి <<17639393>>క్వారీ గొడవపై<<>> MLA థామస్ స్పందించారు. ఈ ఘటన తనను కలిచివేసిందని, క్వారీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను ఆదేశించారు. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి క్వారీని వెంటనే మూయించేలా చర్యలు తీసుకుంటామని MLA వివరించారు.

News September 7, 2025

చిత్తూరు జిల్లాలో చికెన్ ధరలు

image

చిత్తూరు జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.117, మాంసం రూ.170 వరకు పలుకుతోంది. స్కిన్ లెస్ రూ.193 వరకు విక్రయిస్తున్నారు. లేయర్ మాంసం కిలో రూ.210 చొప్పున అమ్ముతున్నారు. మరోవైపు కేజీ మటన్ రూ.800 నుంచి రూ. 900 మధ్య ఉంది. మీ ఏరియాలో మాంసం ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News September 7, 2025

కుప్పంలో 30 పోలీస్ యాక్ట్ : DSP

image

కుప్పం నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల్లో ఈ నెల 30వ తేదీ వరకు 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని కుప్పం DSP పార్థసారథి తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా 30 పోలీస్ యాక్ట్‌ను అమలు చేయడం జరుగుతుందని, పోలీసుల అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు వంటివి నిర్వహించకూడదని స్పష్టం చేశారు. పోలీసుల అనుమతి లేకుండా ఎవరైనా ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

News September 6, 2025

జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌ను పరిశీలించిన ఎస్పీ

image

రిక్రూట్ కానిస్టేబుళ్ల శిక్షణ త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ వీఎన్. మణికంఠ చందోలు శనివారం చిత్తూరు పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌‌ను సందర్శించారు. ఎస్పీ బ్యారక్స్, డైనింగ్ హాల్, కిచెన్, వైద్య సదుపాయాలు, సీసీ కెమెరా పర్యవేక్షణ వంటి విభాగాలను సమగ్రంగా పరిశీలించారు. రిక్రూటర్లుకు పరిశుభ్ర వాతావరణం, తాగునీరు, ఆరోగ్య సదుపాయాలు, భద్రతా చర్యలు అత్యుత్తమంగా ఉండాలని తెలిపారు.