EastGodavari

News July 22, 2024

జగన్‌కు RRR రిక్వస్ట్

image

ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు వైసీపీ అధినేత జగన్‌ను <<13680466>>అసెంబ్లీ<<>>లో పలకరించిన విషయం తెలిసిందే. అసెంబ్లీకి రోజూ రావాలని జగన్‌ను కోరానని రఘురామ తెలిపారు. ప్రతిపక్షం సభలో లేకపోతే బాగుండదని చెప్పానన్నారు. దీనికి జగన్ సానుకూలంగా స్పందించారన్నారు.

News July 22, 2024

ధవళేశ్వరం UPDATE.. 2వ ప్రమాదహెచ్చరికకు ఛాన్స్

image

ధవలేశ్వరం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయిందని డా.బీఆర్.అంబేడ్కర్ కోనసీమ కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. మంగళవారం నాటికి రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందన్నారు. సోమవారం జిల్లా, మండల స్థాయి ప్రత్యేకాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి వరదలపై సమీక్షించారు. భద్రాచలం నుంచి ధవలేశ్వరం బ్యారేజీకి భారీగా వరద వస్తుందన్నారు. పునరావాస కేంద్రాల్లో ఆహారం, తాగునీరు సిద్ధంగా ఉంచాలన్నారు.

News July 22, 2024

తూ.గో.: వాగు దాటలేని పరిస్థితి.. వ్యక్తి మృతి

image

రాజవొమ్మంగి మండలం గింజర్తి గ్రామానికి చెందిన కుంజం రాజులమ్మ(65)కు ఆదివారం రాత్రి 11 గంటలకు గుండెనొప్పితో బాధపడింది. కుటుంబీకులు రాజవొమ్మంగి PHCకి తీసుకెళ్దామంటే మార్గమధ్యలో వట్టిగడ్డ వాగు పొంగి ప్రవహిస్తుండటంతో ఆసుపత్రికి వెళ్లలేకపోయారు. కాసేపటికే రాజులమ్మ మృతి చెందింది. గత ఏడాది గ్రామానికి చెందిన కొంగర అప్పారావు కూడా ఈ విధంగానే మరణించారు. తక్షణమే బ్రిడ్జి నిర్మించాలని సర్పంచ్ శుభలక్ష్మి కోరారు.

News July 22, 2024

కాకినాడ: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

image

భార్యను బెదిరించాలన్న ఉద్దేశంతో గడ్డి మందు తాగిన వ్యక్తి మృతిచెందిన ఘటన కరప మండలంలో జరిగింది. SI రామకృష్ణ తెలిపిన వివరాలు.. మండలంలోని గొర్రిపూడి పీటీపుంతకు చెందిన శ్రీనివాస్ (50) వ్యవసాయ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ నెల 15న మద్యం తాగి ఇంటికెళ్లగా భార్య పార్వతితో గొడవ అయింది. భార్యను బెదిరించేందుకు గడ్డిమందు తాగాడు. కాకినాడలోని ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్సపొందుతూ చనిపోయాడు.

News July 22, 2024

పవన్‌కళ్యాణ్‌కు సెక్యూరిటీ పెంచాలి: వర్మ

image

రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు సెక్యూరిటీ పెంచాలని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే SVSN వర్మ కోరారు. పిఠాపురంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్ర నిఘా సంస్థలు సైతం పవన్ కళ్యాణ్‌కు ప్రాణహాని ఉందని సమాచారం ఇచ్చాయన్నారు. ఈ మేరకు ఆయన భద్రతపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.

News July 22, 2024

కాకినాడ: రొయ్యల కూర వండలేదని సూసైడ్

image

భార్యపై అలిగి భర్త సూసైడ్ చేసుకున్న ఘటన గొల్లప్రోలులో జరిగింది. SI జాన్ బాషా తెలిపిన వివరాలు.. మండలకేంద్రంలోని ఎస్సీపేటకు చెందిన బుచ్చిరాజు(23) శనివారం ఉదయం భార్యతో పచ్చిరొయ్యల కూర వండమని చెప్పాడు. బయటకెళ్లి తిరిగొచ్చాక కోడిగుడ్ల కూర వండటంతో భార్యతో గొడవపడి వెళ్లిపోయాడు. రాత్రి 11 గంటలకు తిరిగొచ్చి పురుగుమందు తాగాడు. కాకినాడ GGHకు తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదైంది.

News July 22, 2024

అధికారులు సంసిద్ధంగా ఉండాలి: కోనసీమ కలెక్టర్

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో గోదావరి ఉద్ధృతి పెరగడం, 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయనే సమాచారం నేపథ్యంలో ప్రజలకు సమర్థవంతంగా సహాయక చర్యలు అందించేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ మహేష్ కుమార్ సూచించారు. అమలాపురంలోని కలెక్టరేట్ నుంచి మండల స్థాయి అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సహాయక చర్యలపై సూచనలు చేశారు. నేడు యధావిధిగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ప్రోగ్రాం ఉంటుందన్నారు.

News July 21, 2024

తూ.గో: మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువలో గోదావరి

image

తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి వరద నీటిమట్టం మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువైంది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు బ్యారేజీ వద్ద నీటిమట్టం 10.10 అడుగులకు చేరినట్లు అధికారులు తెలిపారు. బ్యారేజ్ నుంచి 7.72 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం వద్ద 42.50 అడుగులకు గోదావరి నీటిమట్టం చేరిందని అధికారులు పేర్కొన్నారు.

News July 21, 2024

వరదలు.. గోదావరిపై పడవల్లో రాకపోకలు నిషేధం

image

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరికి వరదలు పెరగడంతో సఖినేటిపల్లి – నరసాపురం మధ్య గోదావరి నదిపై పంటు, నాటుపడవలపై రాకపోకలు నిలిపివేసినట్లు‌ అధికారులు ఆదివారం ఓ‌ ప్రకటనలో తెలిపారు. ధవళేశ్వరం బ్యారేజి నుంచి లక్షలాది క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయడంతో ముందస్తు జాగ్రత్తగా గోదావరిపై రాకపోకలు నిలిపివేసినట్లు పేర్కొన్నారు. SHARE IT..

News July 21, 2024

తూ.గో.: వరదలు.. మొదటి ప్రమాద హెచ్చరికకు అవకాశం

image

భద్రాచలం వద్ద గోదావరి వరద ఆదివారం 38.02 అడుగులుగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఎడతెరిపి లేని వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీరు గోదావరిలో కలుస్తుండటంతో నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఈ రాత్రికి భద్రాచలం వద్ద వరద 43 అడుగులు దాటవచ్చని CWC అధికారులు అంచనా వేశారు. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయ్యే అవకాశం ఉందన్నారు.