India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తూర్పుగోదావరి జిల్లాలో ఈగల్ టీం శుక్రవారం మెరుపు దాడులు చేసింది. పలు మెడికల్ షాపుల్లో తనిఖీలు చేసింది. రాష్ట్రంలోని యువత మత్తు పదార్థాలను ఇంజెక్షన్ రూపంలో తీసుకుంటున్నట్లు సమాచారం ఉండటంతో దాడులు నిర్వహించామని విజిలెన్స్ అధికారి ఎం.స్నేహిత, డ్రగ్స్ ఏడీ నాగమణి తెలిపారు. రాజమండ్రి గణేశ్ చౌక్ వద్ద ఉన్న ఓ మెడికల్ ఏజెన్సీలో ట్రెమడల్ మెడిసిన్ స్వాధీనం చేసుకున్నారు.
తూ.గో జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు అంతకంతకూ పెరుగుతుండటంతో ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. మధ్యాహ్నం సమయంలో పల్లెల్లోని వీధులన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. కాగా రాజమండ్రిలో 36 డిగ్రీలు, గోపాలపురం 32 డిగ్రీలు, కొవ్వూరు 36 డిగ్రీలు నమోదైంది. వడదెబ్బ తగలకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
భీమడోలు రైల్వే స్టేషన్ సమీపంలో కదులుతున్న రైలు నుంచి ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి గురువారం జారిపడి మృతి చెందాడని రైల్వే ఎస్ఐ సైమన్ తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. తూ.గో జిల్లా బిక్కవోలుకు చెందిన అంబటి సుబ్బా రెడ్డి (69) సింహాద్రి రైల్లో రాజమండ్రి వైపు వెళుతున్న సమయంలో జారిపడి మృతి చెందాడన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు.
జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గృహ నిర్మాణం కోసం అదనపు ఆర్థిక సహాయం కింద 4,240 మంది లబ్ధిదారులకు రూ.6.19 కోట్ల నిధులను విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి గురువారం తెలిపారు. క్షేత్ర స్థాయి అధికారులు, సిబ్బందికి ఎఫ్‌టీఓ విడుదల చేసిన లబ్ధిదారులు గృహ నిర్మాణాల పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఆదేశాలు జారీ చేశారు.
గ్రామీణ ప్రాంత ప్రజలు వేసవిలో తాగునీటి కొరత సమస్యలను తెలుసుకొని పరిష్కరించుటకు రాజమహేంద్రవరం జిల్లా గ్రామీణ నీటి సరఫరా ఇంజినీరింగ్ అధికారి కార్యాలయంలో పర్యవేక్షక సెల్ ఏర్పాటు చేశారు. ఈమేరకు జిల్లా గ్రామీణ నీటి సరఫరా ఇంజినీరింగ్ అధికారి బి.వెంకటగిరి ప్రకటనలో తెలిపారు. తాగునీటి సమస్యలను ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 వరకు 91001 21190 నంబరుకు తెలియజేయాలన్నారు.
తూ.గో జిల్లాలో నేడు ఎండలు విపరీతంగా ఉండనున్నాయని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. జిల్లాలోని గోకవరం, కొవ్వూరు, పెరవలి, రాజమండ్రి, రాజానగరం మండలాల్లో 39 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. ఆ జిల్లాలో ఎండలతో పాటు వడగాల్పులు కూడా వీస్తాయని బయటకు వెళ్లే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జయకేతనం సభ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. తన ‘x’ ఖాతా వేదికగా ..జనసేన పార్టీ సిద్ధాంతాలు ఇవే అంటూ ప్రకటన చేశారు. రాజకీయ కార్యక్రమాలు, ఇతర కార్యక్రమాల అనంతరం సభా ప్రాంగణాన్ని శుభ్రపరిచి అందజేశామని అదే జనసేన సిద్ధాంతమని ఆయన పేర్కొన్నారు .
కొవ్వూరు పట్టణంలోని మహిళ మెడలో నుంచి గొలుసు లాక్కెళ్లిన ఘటన కలకలం రేపింది. కొవ్వూరుకు చెందిన కందుల పద్మ కుమారి (55) అనే మహిళ ఏసి ఆర్ లాడ్జ్ సమీపంలో వాకింగ్ చేస్తుండగా వెనుక నుంచి మోటార్ సైకిల్ పై వచ్చి ఆగంతకుడు మెడలో నుంచి చైన్‌ను లాక్కెళ్లాడు. స్థానికుల సమాచారంతో పట్టణ సీఐ విశ్వం డీఎస్పీ దేవకుమార్ ఘటన స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రూరల్‌లోని 2019లో ధవలేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసులో కోర్టు ముద్దాయికి జీవిత ఖైదు, 5 వేల జరిమానా విధించింది. బుధవారం రాజమండ్రి కోర్టులో వాద ప్రతి వాదనలు విన్న తర్వాత జడ్జి విజయ్ గౌతమ్ ముద్దాయి దాడి గణేష్‌కు జీవిత ఖైదు విధించారు. భార్యపై అనుమానంతో దాడిచేసి చంపినట్లు రుజువైందని పీపీ లక్ష్మణ్ నాయక్ తెలిపారు. ధవలేశ్వరం సీఐ గణేష్, హెచ్సీ జయ రామరాజు ముద్దాయిని కోర్టులో హాజరు పరిచారు.
రాజమండ్రిలోని దివాన్ చెరువు సమీపంలో రాష్ట్ర ఫారెస్ట్ అకాడమీని నెలకొల్పాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అటవీ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ సూచనల మేరకు అకాడమీ ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలో కేంద్రం నుంచి అనుమతి రావడంతో.. దివాన్ చెరువు వద్ద దాని ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇక్కడ అకాడమీ ఏర్పాటు నిర్ణయం పట్ల స్థానిక ఎమ్మెల్యే బత్తుల హర్షం వ్యక్తం చేశారు.
Sorry, no posts matched your criteria.