India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఎన్నికల సంసిద్ధత, తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా సమీక్ష నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి జిల్లా ఎన్నికల అధికారి శివ శంకర్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల కోసం అన్ని విధాలా సంసిద్ధత ఎంతో కీలకమైనదన్నారు. జిల్లాలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలుపై అందరు ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో జిల్లాలో ప్రతి సోమవారం జరిగే స్పందన కార్యక్రమాన్ని రద్దు చేయడం జరిగిందని కలెక్టర్ రంజిత్ భాషా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినందున స్పందన కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఆయన తెలియజేశారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి స్పందనలో అర్జీలు ఇవ్వడానికి రావద్దని ఆయన చెప్పారు.

సాధారణ ఎన్నికల షెడ్యుల్ జారీ అయిన నేపధ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలని రాష్ట్ర చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ ముఖేశ్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. ఎటువంటి పరిస్థితుల్లోను ఎన్నికల విధులకు వాలంటీర్లను వినియోగించరాదన్నారు. ఎఫ్ఎస్‌టీ టీ్లు క్రియాశీలకంగా పని చేసే విధంగా పర్యవేక్షించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఈసీ సమీక్ష నిర్వహించారు.

ప్రతి సోమవారం పల్నాడు జిల్లా కలెక్టరేట్లో జరిగే స్పందన కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ శివ శంకర్ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున స్పందన కార్యక్రమాన్ని రద్దు చేశామన్నారు. మండల స్థాయిలో, డివిజన్ స్థాయిలో నిర్వహించే స్పందన కార్యక్రమాలు కూడా రద్దు చేసినట్లు తెలిపారు. ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

ఎన్నికల విధుల్లో నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని నగర కమిషనర్ కీర్తి చేకూరి స్పష్టం చేశారు. ఆదివారం నగరపాలక సంస్థ ఎన్నికల విభాగాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో విధుల్లో లేని సూపరింటెండెంట్ పద్మకు షోకాజ్ నోటీసు జారీ చేయాలని మేనేజర్‌ని ఆదేశించారు. ఎన్నికల కోడ్ వచ్చినందున ఎన్నికల విధుల్లో ఎంతో అప్రమత్తంగా ఉండాలని, విధులు సక్రమంగా నిర్వహించాలని ఆమె చెప్పారు.

చిలకలూరిపేట బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పల్నాడులోని ప్రముఖ క్షేత్రం కోటప్పకొండను ప్రస్తావించారు. అక్కడ ఉన్న బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ఆశీర్వాదం ఎన్డీఏ కూటమికి ఉందని ఆయన తెలియజేశారు. మోదీ హిందీలో ప్రసంగించగా, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందీశ్వరి తెలుగులోకి అనువాదం చేశారు.

చిలకలూరిపేట సభకు ప్రధాని మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఒకే వేదికపై మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పక్కపక్కనే కూర్చున్నారు. తొలుత పవన్ కళ్యాణ్ ప్రసంగించగా.. ఆ సమయంలో మోదీ, చంద్రబాబు ముచ్చటించారు. వారిరువురి మధ్య నవ్వులు విరియడంతో సభకు వచ్చిన వారిలో జోష్ కనిపించింది.

పదో తరగతి పరీక్షలను పగడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టినట్టు DEO వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. పదవ తరగతి పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. సమీపంలో జిరాక్స్ సెంటర్లు నిర్వహించకూడనని అన్నారు. జిల్లాలో ఈ పరీక్షలకు 29,243మంది విద్యార్థులు హాజరుకానున్నారని, 127 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 9 గంటలకల్లా విద్యార్థులు చేరుకోవాలన్నారు.

మరికొద్దిసేపట్లో గన్నవరం ఎయిర్‌పోర్టుకు ప్రధానమంత్రి మోదీ చేరుకోనున్నారు. అనంతరం అక్కడి నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో ఆయన చిలకలూరిపేట మండలం బొప్పూడి సభకు చేరుకుంటారు. సభా ప్రాంగణానికి 200 మీటర్ల దూరంలోనే హెలీ ప్యాడ్ ఉంది. మోదీ సభ వద్దకు సులభతరంగా వచ్చే విధంగా ఏర్పాటు చేశారు.

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైనందున ఎన్నికల ప్రవర్తన నియమావళిని కఠినతరం చేయాలని కలెక్టర్ లోతేటి శివశంకర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆదివారం స్థానిక కలెక్టరేట్లో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు ఎన్నికల నివేదికల సమర్పణ సి.విజిల్, సువిదయాప్, తదితర అంశాలపై ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల సిబ్బందితో జాయింట్ కలెక్టర్‌తో కలిసి కలెక్టర్ సమీక్ష చేశారు.
Sorry, no posts matched your criteria.