India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గుంటూరు, పల్నాడు జిల్లాల్లో పలువురు డీఎస్పీలు బదిలీ అయ్యారు. ఈ మేరకు డీజీపీ ద్వారకాతిరుమల రావు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. విఆర్ లో ఉన్న ఎం.రమేశ్‌ను గుంటూరు ట్రాఫిక్‌కు, గుంతకల్‌లో ఉన్న షేక్ అబ్దుల్ అజీజ్‌ను గుంటూరు తూర్పునకు, పీసీఎస్‌లో ఉన్న ఎం. హనుమంతరావును సత్తెనపల్లికి, ఎమ్మిగనూర్‌లో ఉన్న బి.సీతారామయ్యను గుంటూరు జిల్లా స్పెషల్ బ్రాంచ్‌కు బదిలీ చేశారు.
టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న నందిగం సురేశ్‌ను మంగళగిరి రూరల్ పోలీసులు కస్టడీకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆదివారం జరిగిన విచారణకు మాజీ ఎంపీ నందిగం సురేష్ సహకరించలేదని తెలుస్తోంది. పోలీసులు అడిగిన ఏ ప్రశ్నకు కూడా తనకేమీ తెలియదు అన్నట్లు సురేశ్ వ్యవహరించారని విశ్వసనీయ సమాచారం. కాగా సురేశ్‌ను పోలీసులు రేపు మధ్యాహ్నం 12 గంటల వరకు విచారించనున్నారు.
జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం జరగవలసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు తెలిపారు. ఈరోజు మిలాద్-ఉన్-నబీ పండగ సందర్భంగా ప్రభుత్వం సెలవు ప్రకటించిందన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించవలసిన “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమం రద్దు చేయడం జరిగిందని పేర్కొన్నారు.
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ విధానంలో రైతులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని మంత్రి నారాయణ అన్నారు. ఆదివారం సాయంత్రం ఎర్రబాలెంలో ఆయన మాట్లాడుతూ.. పదిమంది రైతులు ముందుకు వచ్చారన్నారు. భారీ వర్షాల కారణంగా రాజధానిలో నిలిచిపోయిన ముళ్లు కంప తొలగింపు 2 రోజుల్లో ప్రారంభిస్తామని, ఐఐటీ రిపోర్టు రాజధాని నిర్మాణం సంబంధించి పాజిటివ్ గా వచ్చిందన్నారు. ఆ రిపోర్టు అధారంగా చేసుకుని నిర్మాణ పనులు చేపడతామన్నారు.
జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 18న నరసరావుపేటలోని కృష్ణవేణి డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా అభివృద్ధి సంస్థ అధికారి సంజీవరావు తెలిపారు. జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ఆదేశాల మేరకు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించే దిశగా జాబ్ మేళా ఏర్పాటు చేశామని 1500 ఉద్యోగాలు ఉన్నాయన్నారు. అభ్యర్థులు తమ విద్యార్హత సర్టిఫికెట్లతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావాలని తెలిపారు.
యడ్లపాడు వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్ఐ బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరు జిల్లా నిడమర్రుకి చెందిన కృష్ణ (31), రవి కిషోర్ (25) అనే ఇద్దరు కారు టైరు పంక్చర్ అవ్వడంతో రోడ్డు మార్జిన్‌లో టైరు మారుస్తున్న సమయంలో గుర్తు తెలియని వాహనం వీరిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, మరొక వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు.
మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఇటీవల అరెస్ట్ అయిన బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను ఆదివారం మంగళగిరి రూరల్ పోలీసులు కస్టడీకి తీసుకోనున్నారు. మంగళగిరి కోర్టు 2 రోజులు పోలీసుల కస్టడీకి అనుమతించడంతో ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు నందిగం సురేశ్‌ను మంగళగిరి రూరల్ పోలీసులు ప్రశ్నించనున్నారు.
విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడి గర్భిణిని చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పాత గుంటూరు పోలీసుల వివరాల ప్రకారం.. గుంటూరుకు చెందిన 10వ తరగతి విద్యార్థినిని అదే ప్రాంతంలో నివాసం ఉండే కార్ల పెయింటర్ షేక్. కాలేషా అనే వ్యక్తి భయపెట్టి తన ఇంటిలో పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని విద్యార్థిని తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గుంటూరు జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టమ్) కార్యక్రమం సోమవారం మీలాద్ ఉన్ నబీ పండుగ సందర్భంగా తాత్కాలికంగా రద్దు చేసినట్లు శనివారం ఎస్పీ సతీశ్ కుమార్ తెలిపారు. కనుక గుంటూరు జిల్లా నుంచి, పరిసర ప్రాంతాల నుంచి వచ్చేవారు, నగర పరిదిలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవారు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
మంగళగిరిలో ఓ బాలికపై శనివారం మరో అత్యాచారయత్నం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళగిరి బాలాజీ నగర్లో ఆడుకుంటున్న ఐదు సంవత్సరాల బాలికపై వెంకటేశ్వరరావు(61) అనే వ్యక్తి అత్యాచారానికి యత్నించాడు. బాలిక ఒక్కసారిగా కేకలు వేయడంతో నిందితుడు పరారయ్యాడు. దీంతో మంగళగిరి టౌన్ పోలీసులు కేసు నమోదు చేయగా దిశా డీఎస్పీ కోటేశ్వరరావు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఒకే రోజు రెండు ఘటనలు జరిగాయి.
Sorry, no posts matched your criteria.