Guntur

News March 4, 2025

ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఎవరికి ఎన్ని ఓట్లంటే(పార్ట్-1)

image

◆ఆలపాటి రాజా(1,45,057)గెలుపు
◆ఉమర్ బాషా షేక్-564
◆కనకం శ్రీనివాసరావు-348
◆అన్నవరపు ఆనంద కిషోర్-860
◆ అరిగల. శివరామ ప్రసాద్ రాజా-579 ◆అహమ్మద్ షేక్-335
◆యమ్మీల వినయ్ కుమార్ తంబి-120
◆కండుల వెంకట రావ్-299
◆గునుకుల వెంకటేశ్వర్లు-34
◆ గుమ్మా శ్రీనివాస్ యాదవ్-522
◆ గౌతుకట్ల అంకమ్మరావు-26
◆గంగోలు శామ్యూల్-321
◆గంట మమత-718

News March 4, 2025

ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఎవరికి ఎన్నిఓట్లంటే(పార్ట్-2)

image

◆కె.ఎస్. లక్ష్మణరావు-62,737
◆జూపూడి సామ్ ప్రసాద్-642
◆దారా విక్రమ్-400
◆దీపక్ పులుగు-49
◆దుక్కిపాటి రాధాకృష్ణ-41
◆మురకొండ చంద్రశేఖర్-53
◆యార్లగడ్డ శోభారాణి-95
◆ఎండ్రెడ్డి శివారెడ్డి-108
◆డాక్టర్ రామకోటయ్య మద్దుమల-129
◆లగడపాటి వేణుగోపాల్-210
◆శారదా తిరువీధుల-291
◆సత్య బాల సుందర రామ శర్మ చుండూరు-327
చెల్లని ఓట్లు-26,909
మొత్తం ఓట్లు-2,41,774

News March 4, 2025

ఆలపాటి రాజా తండ్రి నేపథ్యం ఇదే

image

ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ టీడీపీ స్థాపకులు ఎన్టీఆర్‌కు అత్యంత సన్నిహితులు. ఆయన తండ్రి శివరామకృష్ణ ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు. ఆయనకు ఎన్టీఆర్ అంటే ఇష్టంతో పార్టీ కోసం తన సొంత ఇంటిని, ఆయన పింఛన్లు కూడా పార్టీకి విరాళంగా ఇచ్చారని చెబుతారు. ఆయన కూడా తన తండ్రి బాటలో నడిచి టీడీపీలో అనేక హోదాలలో పనిచేశారు. ఆయన రాజకీయాలకు ముందు హైదరాబాదులో ఎన్టీఆర్, టీడీపీ కేసులన్నీ వాదించే టీంలో లాయర్‌గా పనిచేశారు.

News March 3, 2025

గుంటూరు: పరీక్ష ఫలితాలు విడుదల 

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నిర్వహించిన డిగ్రీ 1వ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను తాత్కాలిక ఉపకులపతి ఆచార్య కె.గంగాధర్ అధికారికంగా సోమవారం ప్రకటించారు. మొత్తం 10,699 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 6,942 మంది ఉత్తీర్ణులయ్యారు. ఫలితాలను విశ్వవిద్యాలయ అధికారిక వెబ్ సైట్ www.anu.ac.inలో చూడవచ్చు.

News March 3, 2025

GNT: అమ్మవారి అనుగ్రహం పేరిట మోసం

image

పూజల పేరిట డబ్బులు వసూలు చేసిన ఘటన GNTలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. రాజేశ్వరరావు కాలనీకి చెందిన నాగేశ్వరరావుకు ఇంట్లో అమ్మవారి అనుగ్రహం ఉందని, పూజలు చేస్తే పైసలు వస్తాయని వెంకాయమ్మ అనే మహిళ నమ్మించింది. సిద్ధాంతితో ప్రాణగండం ఉందని చెప్పి భయపెట్టింది. పూజల కోసం విడతల వారీగా రూ. 15 లక్షలు తీసుకుంది. ఫలితం లేకపోవడంతో మోసపోయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.

News March 3, 2025

గుంటూరు: ప్రయాణికుల రద్దీ మేరకు ప్రత్యేక రైళ్లు

image

ప్రయాణికుల రద్దీ మేరకు గుంటూరు మీదుగా చర్లపల్లి(CHZ), కాకినాడ టౌన్(CCT) మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు ఈనెల 7,14, 21, 28న CHZ-CCT(నం.07031), ఈ నెల 2,9,16, 23న CCT- CHZ(నం.07032) రైళ్లు నడుపుతామన్నారు. కాగా ఈ రైళ్లు ఏపీలోని గుంటూరుతో పాటు సత్తెనపల్లి, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం,రాజమండ్రి, సామర్లకోటలో ఆగుతాయని వారు తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు. 

News March 3, 2025

తెనాలి: అలర్ట్..ఆ రైళ్ల నంబర్లు మారాయి 

image

తెనాలి, నిడుబ్రోలు మీదుగా ప్రయాణించే 2 రైళ్లకు మార్చి 1 నుంచి నూతన నంబర్లు కేటాయించామని రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు విశాఖపట్నం-కడప మధ్య ప్రయాణించే తిరుమల(డైలీ) ఎక్స్‌ప్రెస్‌లకు పాత నంబర్లు 17487/17488 స్థానంలో 18522/18521 నంబర్లు కేటాయించామన్నారు. ప్రయాణికులు రైలు నంబర్లలో మార్పును గమనించాలని కోరుతూ తాజాగా ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. 

News March 3, 2025

ఉమ్మడి కృష్ణా-గుంటూరు MLC ఎన్నికల్లో గెలుపెవరిది.!

image

కృష్ణా, గుంటూరు గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ప్రధాన అభ్యర్థులు ఆలపాటి, KS లక్ష్మణరావు ఎవరికి వారే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎన్నికలో 69.57% మేర పోలింగ్ జరగడంతో కౌంటింగ్ ప్రక్రియ సుదీర్ఘంగా సాగే అవకాశం ఉంది. రాజధాని ప్రాంతంలో ఉన్న 2 ఉమ్మడి జిల్లాలలో జరిగిన ఎలక్షన్ కావడంతో నేటి ఫలితంపై ఆసక్తి నెలకొంది. ఎవరు గెలుస్తారని మీరునుకుంటున్నారో కామెంట్ చేయండి.

News March 3, 2025

పట్టభద్రుల కౌంటింగ్ ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్ 

image

ఉమ్మడి కృష్ణా ,గుంటూరు జిల్లా పట్టభద్రుల కౌంటింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మి ఆదివారం చెప్పారు. గుంటూరులోని ఆంధ్ర క్రిస్టియన్ కళాశాలలో ఈ కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుందన్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం 700 మంది స్టాఫ్ మూడు షిఫ్టులుగా కౌంటింగ్‌లో పాల్గొంటారని, వారికి ట్రైనింగ్ పూర్తయిందన్నారు. రెండు నుంచి మూడు రోజుల పాటు కౌంటింగ్ జరుగుతుందన్నారు. 

News March 2, 2025

గుంటూరులో పెరిగిన చికెన్ ధరలు

image

బర్డ్ ఫ్లూ వదంతుల నేపథ్యంలో రెండు వారాలు గుంటూరులో రూ.100 కి అమ్ముడైన చికెన్ ధర పుంజుకుంది. స్కిన్ రూ.130, స్కిన్ లెస్ రూ.150, కాల్చింది రూ.140గా విక్రయిస్తున్నారు. ఇప్పుడిప్పుడే ప్రజలు మాంసంపై ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో ధరలు పెరుగుతున్నాయి. ఇక మటన్ విషయానికి వస్తే రూ.950 నుంచి రూ.1,000 వరకు విక్రయాలు జరుగుతున్నాయి.