Guntur

News July 27, 2024

యువతకు ఉపాధి కల్పనపై దృష్టి పెట్టాలి: కలెక్టర్ నాగలక్ష్మి

image

నిరుద్యోగ యువతకు శిక్షణ, ఉపాధి కల్పించడంపై ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేయాలని కలెక్టర్ నాగలక్ష్మీ అధికారులను ఆదేశించారు. శనివారం ఆమె తన కార్యాలయంలో మాట్లాడుతూ.. స్కిల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులందరూ సంబంధిత శాఖలను సమన్వయం చేసుకొని ముందుకు సాగాలన్నారు. అమరావతిలో నిర్మాణ, సర్వే రంగాలకు ఎక్కువ డిమాండ్ ఉందన్నారు. నిర్మాణ రంగానికి ఎలాంటి నైపుణ్యం గల వారు కావాలో తెలుసుకుని సిద్ధం చేయాలన్నారు.

News July 27, 2024

గుంటూరు: సుబ్రహ్మణ్యేశ్వరస్వామి మహోత్సవాలకు కలెక్టర్‌కు ఆహ్వానం

image

గుంటూరు ఏ.టీ అగ్రహారం 7వ లైన్‌లో రేపు సుబ్రహ్మణ్యేశ్వరస్వామి మహోత్సవాలు జరగనున్నాయని సేవా సమితి అధ్యక్షుడు రామ్మోహన్ రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన శనిరం కలెక్టర్ నాగలక్ష్మిని కలిసి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి మహోత్సవాలకు ఆహ్వానించారు. 28న ఆదివారం కల్యాణ మహోత్సవం, 29వ తేదీన ఊరేగింపు ఉంటుందన్నారు. కార్యక్రమంలో శ్రీహరి, లెనిన్, తదితరులు పాల్గొన్నారు.

News July 27, 2024

రషీద్ హత్య కేసులో 20మందికి పైగా నిందితులు

image

వినుకొండలో రషీద్ హత్య కేసులో 20మందికి పైగా నిందితులు ఉన్నట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. మృతుడు, నిందితుడి మధ్య తరచూ గొడవలు జరిగేవని సమాచారం. హత్యకు ముందు నిందితులు ఓ ప్రైవేట్ పాఠశాల మైదానంలో కలిసి మద్యం తాగి, హత్యకు సిద్ధమైనట్లు రిపోర్టులో వివరించారు. హత్య జరుగుతున్న సమయంలో నిందితులు కర్రలతో కాపు కాసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

News July 27, 2024

జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యాలయంలో అబ్దుల్ కలాం వర్ధంతి

image

గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యాలయంలో అబ్దుల్ కలాం వర్ధంతి ఘనంగా నిర్వహించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి సుబ్బరత్నమ్మ అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆయన భారతరత్నతో సహా అనేక అవార్డులు అందుకున్నారన్నారు. అబ్దుల్ కలాంను మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారన్నారు.

News July 27, 2024

రాజధాని పనులపై డ్రోన్ వీడియో చిత్రీకరణ!

image

రాజధాని నిర్మాణ ప్రాంతాన్ని డ్రోన్ ఫొటో కమ్ వీడియో చిత్రీకరణ చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన టెక్నికల్ కమిటీ నిర్ణయించింది. గత, ప్రస్తుత ఫుటేజీ ఆధారంగా అధ్యయనం చేయాలని కమిటీ భావిస్తున్నట్లు సమాచారం. రాజధాని పనులను ఈ కమిటీ శుక్రవారం పరిశీలించింది. ప్రాథమిక అవగాహన కోసం.. పబ్లిక్ హెల్త్ ఈఎన్‌సీ ఆనందరావు నేతృత్వంలోని ఇంజినీరింగ్ టెక్నికల్ కమిటీ రాజధాని ప్రాంతాన్ని జల్లెడ పట్టింది.

News July 27, 2024

జగన్‌పై ఎమ్మెల్యే జీవీ ఆగ్రహం

image

వినుకొండలో హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటని స్థానిక MLA జీవీ ఆంజనేయులు అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ.. రషీద్ హత్యను తన కుటుంబానికి అంటగట్టడం దారుణమన్నారు. అలాగైతే, వివేకా హత్య కేసు నిందితుడు YS భారతితో సెల్ఫీ దిగాడని, జగన్ దానికేం చెబుతారని ప్రశ్నించారు. అసత్యాలు ప్రచారం చేస్తే పరువునష్టం దావా వేస్తామని జీవీ చెప్పారు. రషీద్, నిందితుడు జిలానీ.. బొల్లా అనుచరులే అని వివరించారు.

News July 27, 2024

జాయింట్ కలెక్టర్‌ను కలిసిన జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులు

image

జాయింట్ కలెక్టరుగా గుంటూరు విచ్చేసిన భార్గవ తేజ IASను జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులు శుక్రవారం కలిశారు. జిల్లా వినియోగదారుల ప్రొటెక్షన్ కౌన్సిల్ ఏర్పాటు చేసి, మీటింగులు నిర్వహించలేదని గర్తపురి వినియోగదారుల సమితి అధ్యక్షుడు హరిబాబు జేసీ దృష్టికి తీసుకెళ్లారు. గుంటూరు జిల్లాలో సంబంధిత అధికారులు అమలు జరిపే విధంగా చూడాలని కోరారు. ఆయన వెంట నాగేశ్వరరావు, మల్లికార్జునరావు, కవిత తదితరులు ఉన్నారు.

News July 26, 2024

గుంటూరు జిల్లా TODAY TOP NEWS

image

* సత్తెనపల్లిలో వైసీపీ కౌన్సిలర్ బైక్‌ దహనం
* తాడేపల్లిలో వైఎస్ జగన్ ప్రెస్‌మీట్
* వినుకొండ: రషీద్ హత్య.. నిందితులకు 30 ఏళ్ల లోపే!
* పల్నాడులో ఆగని టీడీపీ దాష్టీకాలు: వైసీపీ
* గుంటూరు: అమరులైన వీర జవానులకు నివాళి
* వినుకొండ హత్యపై మరోసారి స్పందించిన జగన్
* అమరావతి అభివృద్ధికి రూ.15వేల కోట్లు గ్రాంట్‌గా ఇవ్వాలి: సీపీఐ
* అమెరికాలో మృతి.. తెనాలి చేరుకున్న రవితేజ మృతదేహం

News July 26, 2024

తెనాలి చేరుకున్న రవితేజ భౌతికకాయం

image

ఈ నెల 18న అమెరికాలోని టెక్సాస్‌లో స్విమ్మింగ్ పూల్‌లో పడి తెనాలికి చెందిన యువకుడు మృతిచెందిన విషయం తెలిసిందే. శుక్రవారం రవితేజ భౌతికకాయం స్వగ్రామమైన తెనాలి చేరుకుంది. అమెరికాలో MS చేసేందుకు వెళ్లిన రవితేజ, 18న ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పూల్‌లో పడి మృతిచెందాడు. తెనాలిలో ఐతానగర్‌లోని నివాసానికి రవితేజ మృతదేహం చేరుకోవడంతో కుటుంబసభ్యులు, స్నేహితులు కన్నీటి పర్యంతమయ్యారు. 

News July 26, 2024

అటవీశాఖ అధికారులతో పవన్ సమావేశం

image

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శుక్రవారం అటవీ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. మంగళగిరి నగర పరిధిలోని అరణ్య భవన్‌లో సాయంత్రం నాలుగు గంటలకు సమీక్ష జరగనుంది. ఈ సందర్భంగా సంబంధిత అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. పోలీసు అధికారులు బందోబస్తు పనుల్లో ఉన్నారు.