India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మాతృ మరణాలు నివారించడంలో స్త్రీ వైద్య నిపుణులు ముందడుగు వేయాలని గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా పిలుపునిచ్చారు. ఆదివారం GNTలో గుంటూరు ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫెర్టిలిటీ, ఎంబ్రియాలజీ సదస్సులో కలెక్టర్ మాట్లాడారు. ఆధునిక వైద్య సాంకేతికతలను సమర్థవంతంగా వినియోగించి సంతానోత్పత్తి సమస్యలకు పరిష్కారాలు అందించాల్సిన అవసరం ఉందన్నారు.

విజ్ఞాన్స్ యూనివర్సిటీలో ఈఏడాది 1100మందికి పైగా విద్యార్థులు ఉద్యోగాలు సాధించారని ఆ సంస్థ ఛైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య ప్రకటించారు. శ్రీరామనవమి సందర్భంగా ఉద్యోగాలు సాధించిన విద్యార్థుల తల్లిదండ్రులను సన్మానించారు. తర్వాత రీసెర్స్ నెక్సస్ జర్నల్ ఆవిష్కరించారు. ఏఐ రాకతో MNCలో ఉద్యోగాలు రావడం చాలా కష్టమని.. విద్యార్థులు స్కిల్స్ పెంచుకోవాలని ఆ సంస్థ వైస్ ఛైర్మన్ లావు శ్రీకృష్ణదేవరాయలు సూచించారు.

గుంటూరు కలెక్టర్ తమీమ్ అన్సారియా బదిలీపై గత 10 రోజులుగా సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. ఆమెకు విద్యాశాఖ డైరెక్టర్ పదవి దక్కనున్నట్లు ముందుగానే ప్రచారం జరగడం గమనార్హం. బదిలీ నిలిపివేయాలని కోరుతూ ప్రజాసంఘాలు పీజీఆర్‌ఎస్‌లో జేసీ అశుతోష్ మిశ్రాకు వినతిపత్రం సైతం సమర్పించారు. అధికారిక ఉత్తర్వులు రాకముందే వివరాలు వెలుగులోకి రావడం, బదిలీ సైతం ఆపాలని వినతి పత్రం ఇవ్వటం చర్చనీయాంశమైంది.

గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక (PGRS), రెవెన్యూక్లీనిక్ కార్యక్రమాలు జరుగుతాయని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. https://Meekosam.ap.gov.inలో
కూడా అర్జీలు సమర్పించవచ్చని చెప్పారు. 1100 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా అర్జీలను తెలుసుకోవచ్చని అన్నారు. ప్రజలు ఈ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

గుంటూరు జిల్లా నూతన కలెక్టర్‌గా 2015 బ్యాచ్ ఐఏఎస్ అధికారి సి.ఎం. సాయికాంత్ వర్మ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన ఏపీ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు (ఈడీబీ) సీఈవోగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గతంలో ఆయన విశాఖ మున్సిపల్ కమిషనర్‌గా, వైఎస్సార్ జిల్లా జేసీగా సమర్థవంతంగా పనిచేశారు. పరిపాలనలో ఆయనకు విశేష అనుభవం ఉంది. ఆ అపార అనుభవంతో గుంటూరు జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తారని ప్రభుత్వం ఆశిస్తోంది.

గుంటూరు జిల్లా నూతన కలెక్టర్‌గా సీ.ఎం. సాయికాంత్ వర్మ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు గుంటూరు కలెక్టర్‌గా సేవలు అందించిన ఏ. తమీమ్ అన్సారియా బదిలీ అయ్యారు. ఆమెను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌గా ప్రభుత్వం నియమించింది. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పలువురు ఐఏఎస్‌ల బదిలీల్లో భాగంగా సీఎస్ సాయిప్రసాద్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు.

గుంటూరులో ఆదివారం మాంసం మార్కెట్ సందడిగా ఉంది. చికెన్ స్కిన్ లెస్ కిలో రూ. 280, విత్ స్కిన్ రూ. 260గా విక్రయిస్తున్నారు. మటన్ ధర రూ. 980 పలుకుతుండగా, చేపలు రకాలను బట్టి రూ. 180 నుంచి రూ. 200 పైగా ఉన్నాయి. ముఖ్యంగా కోడిగుడ్ల ధరలు తగ్గడం వినియోగదారులకు ఊరటనిస్తోంది. 30 గుడ్ల ట్రే ధర రూ.125కు చేరింది. మరి మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియజేయండి.

Sorry, no posts matched your criteria.