Guntur

News March 29, 2026

ఏపీ అభివృద్ధికి జర్నలిస్టులు సహకరించాలి: CBN

image

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి జర్నలిస్టులు సహకరించాలని సీఎం చంద్రబాబు కోరారు. విజయవాడ ఐజేయూ 11వ ప్లీనరీ సమావేశంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. రాజకీయ పార్టీలకు మీడియా సంస్థలు ఉండడం సమాజానికి చేటన్నారు. గత ప్రభుత్వంలో జర్నలిస్టులకు కనీసం మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదని, 2024లో కూటమి ప్రభుత్వం వచ్చాక మీడియాకు స్వేచ్ఛ వచ్చిందన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని సీఎం స్పష్టం చేశారు.

News March 28, 2026

GNT: దరఖాస్తులు ఆహ్వానించిన కలెక్టర్

image

నైబర్ హుడ్ వర్క్ స్పేస్‌లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నైబర్ హుడ్ వర్క్ స్పేస్ పాలసీ 2025-30లో భాగంగా జిల్లాలో పారిశ్రామికవేత్తలు, ఫ్రీలాన్సర్లు, మైక్రో ఎంటర్‌ ప్రైజర్స్‌కు సమీపంలో కార్యాలయ వసతులు కల్పించేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఈ పథకం క్రింద భవనాలను లీజుకు ఇవ్వదలచిన డెవలపర్లు https://investandhra.ap.gov.inలో నమోదు చేసుకోవాలన్నారు.

News March 28, 2026

GNT: నియామకపత్రాలు అందజేసిన కలెక్టర్

image

గ్రూప్-2 ద్వారా నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఎంపికైన 10 మంది అభ్యర్థులకు కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా శనివారం కలెక్టర్ కార్యాలయంలో వివిధ మండలాలకు నియామక పత్రాలు అందజేశారు. నియామక పత్రాలు అందుకున్న వారిలో హరికృష్ణ, ఎం. మహేశ్వరరావు, ఎన్. హర్షవర్ధన్ రెడ్డి, రామ సుబ్బా రెడ్డి, జి. ఉమాకాంత్, పి. రెడ్డి రాజా, టి. సుధాకర్, పి. వినయ్ కుమార్, వై. అనిల్ కుమార్, ఎస్. లక్ష్మీ నారాయణ ఉన్నారు.

News March 28, 2026

అమరావతిలో అత్యవసర సేవల లోపం బహిర్గతం

image

అమరావతిలో అత్యవసర సేవల లోపం బయటపడింది. ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదాల్లో రూ.19 కోట్ల ఆస్తి నష్టం జరిగింది. ఉద్దండరాయునిపాలెంలో మధ్యాహ్నం జరిగిన ఘటనకు ఫైర్ ఇంజన్ 50 నిమిషాల తర్వాత చేరింది. మరో ఘటనలో కూడా స్పందన ఆలస్యం కనిపించింది. సమయానికి సహాయం అందక నష్టం పెరిగిందని విమర్శలు వస్తున్నాయి. రాజధాని అభివృద్ధి జరుగుతున్నా, భద్రతా సదుపాయాలు మెరుగుపర్చాలని ప్రజలు కోరుతున్నారు.

News March 28, 2026

GNT: ధాన్యం సేకరణ.. రికార్డు దిశగా..!

image

ఖరీఫ్ సీజన్‌లో మూడు జిల్లాల్లో ధాన్యం సేకరణకు భారీ లక్ష్యాలు నిర్ణయించారు. బాపట్లలో 2 లక్షల టన్నుల లక్ష్యానికి 1.88 లక్షల టన్నులు చేరగా, గుంటూరులో లక్ష టన్నులలో 82 వేల టన్నులు సేకరించారు. మార్కెట్ ధరలు మద్దతు ధర కంటే ఎక్కువగా ఉండటంతో రైతులు లాభపడ్డారు. కొనుగోలు కేంద్రాలు ఎక్కువకాలం తెరిచి ఉంచినా లక్ష్యాలకు స్వల్పంగా తగ్గాయి. శనివారంతో సేకరణ కేంద్రాలు మూతపడనున్నాయి.

News March 28, 2026

గుంటూరు: AI బయోమెట్రిక్ స్కామ్‌లపై ఎస్పీ హెచ్చరిక

image

AI బయోమెట్రిక్ స్కామ్‌లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ సూచించారు. అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే వీడియో కాల్స్‌కు స్పందించవద్దని, సోషల్ మీడియా ఖాతాలను ప్రైవేట్ సెట్టింగ్స్‌లో ఉంచుకోవాలని కోరారు. సైబర్ మోసానికి గురైతే తక్షణమే 1930 నంబర్‌కు ఫోన్ చేయాలని లేదా ఆన్‌లైన్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు. సాంకేతికతతో పొంచి ఉన్న ముప్పును పసిగట్టాలని ఆయన హెచ్చరించారు.