India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

వినాయకచవితి అంటేనే పిల్లలకు ఎంతో ప్రత్యేకం. ఒకప్పుడు పిల్లలు తెల్లవారుమున లేచి తలస్నానం చేసి ఇంట్లో వినాయకుడి మండపం అలంకరించేందుకు నాన్నకు సహాయం చేస్తాం. పుస్తకాలకు పసుపుతో ఓం రాసి మంచి మార్కులు రావాలని కోరుకునేవాళ్లం. మనలో కొంతమంది అయితే క్రికెట్ బ్యాట్లు, వీడియో గేమ్‌లు, బొమ్మలు, సైకిళ్లు, నాన్న వాడే పనిముట్లపై కూడా పసుపు రాసేవాళ్లం. మీకు కూడా ఆ రోజులు గుర్తొస్తున్నాయా అయితే COMMENT చేయండి.

అమరావతి ప్రాంతంలో జరుగుతున్న పనులను పర్యవేక్షించడానికి CRDA తన కొత్త రాయపూడి కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను నిర్మిస్తోంది. ఇది 360° పర్యవేక్షణ, రోడ్లు, భవనాలు, డ్రైనేజీ, పచ్చదనం ట్రాక్ చేయడం వంటి నెలవారీ పురోగతి నివేదికలను రోజువారీగా అందించడం కోసం CCTV కెమెరాలు, డ్రోన్లను ఉపయోగిస్తుంది. దీంతో ఎప్పటికప్పుడు పనుల పురోగతి తెలుసుకునేందుకు మరింత వీలుకానుంది.

పండగ వచ్చిందంటే చాలు, ఇంటిల్లిపాది పచ్చని మామిడి తోరణాలతో ఇళ్లను అలంకరించేవారు. ఆ పచ్చని తోరణాలు తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలుగా నిలిచేవి. ఒకప్పుడు ఇరుగుపొరుగు ఇళ్లలో మామిడి ఆకులను పంచుకునేవారు. కానీ ఇప్పుడు తోరణాలను కూడా మార్కెట్లో కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. పండుగల హడావుడిలో తోరణాలు కట్టడం, వాటిని పంచుకోవడం వంటి సంప్రదాయాలు కనుమరుగవుతున్నాయి. మీ బాల్యంలో తోరణాల కోసం ఏం చేశారో కామెంట్

భూగర్భ జలవనరులను పెంపొందించేందుకు అధికారులు కృషి చేయాలని కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. ఇందుకోసం జలవనరులు, గ్రామీణ నీటిపారుదల, పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ శాఖల సమన్వయంతో ప్రణాళికలు రూపొందించాలని ఆమె ఆదేశించారు. సోమవారం భూగర్భ జలవనరుల పరిరక్షణ, ఈపీటీఎస్, స్వామిత్వా, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కార్యక్రమాలపై మున్సిపల్ కమిషనర్లు, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

తెనాలిలోని మల్లెపాడుకు చెందిన శతాధిక వృద్ధుడు భూషయ్య దీనావస్థలో కాలం వెళ్లదీస్తున్నాడు. వ్యవసాయం చేస్తూ ముగ్గురు పిల్లలను పెంచి ప్రయోజకులను చేసిన ఈయన, ప్రస్తుతం వారి ఆదరణకు నోచుకోక జీవచ్ఛవంలా బతుకుతున్నారు. ఆలపాటి ధర్మారావు హయాంలో యడ్లపల్లి పంచాయతీ మెంబరుగా పనిచేశారు. భూషయ్యకు వేలిముద్రలు పడకపోవడం వల్ల పింఛను కూడా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

గుంటూరు జిల్లాలోని 5,85,615 కుటుంబాలకు ఈ నెల 30 నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేయనున్నారు. ఏటీఎమ్ కార్డు మాదిరిగా, క్యూఆర్ కోడ్‌తో రూపొందించిన ఈ కార్డులను గ్రామ సచివాలయాల ద్వారా పంపిణీ చేస్తారు. కార్యక్రమంలో పలుచోట్ల మంత్రులు, ఎమ్మెల్యేలు స్వయంగా పాల్గొని లబ్ధిదారులకు కార్డులు అందజేస్తారు. ఈ కొత్త సాంకేతిక కార్డులతో ప్రజలకు మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి.

ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోని పర్యావరణ శాస్త్ర విభాగం & సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అండ్ ఇకలాజికల్ డెవలప్మెంట్ (సీడ్) ఇండియా ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రేపు 26వ తేదీ(మంగళవారం) యూనివర్సిటీ ప్రధాన ద్వారం మధ్యాహ్నం 2 గంటల నుంచి పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. వివరాలకు 9441812543, 9491991918 నంబర్లను సంప్రదించాలని కోరారు.

తుళ్లూరులోని CRDA కార్యాలయంలో ఈనెల 29న 300కు పైగా ఉద్యోగాల భర్తీకై జాబ్ మేళా నిర్వహిస్తున్నామని కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు. ఈ మేరకు విజయవాడలోని తన కార్యాలయం నుంచి సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ జాబ్ మేళాలో SSC, ITI, ఇంటర్, డిగ్రీ, BSC నర్సింగ్, డిప్లొమా, PG, బీటెక్ చదివినవారు హాజరుకావొచ్చని చెప్పారు. వివరాలకు ఫెసిలిటేటర్స్ లేదా 9848424207, 9963425999 సంప్రదించాలన్నారు.

లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని నల్లచెరువులో నీళ్ల బకెట్లో పడి 16 నెలల బాలుడు మృతి చెందాడు. బీహార్‌కు చెందిన పఠాన్ యూసఫ్ ఖాన్ కుమారుడు అతీష్ ఖాన్ (16 నెలలు) మధ్యాహ్నం ఆడుకుంటూ నీళ్ల బకెట్లో పడి మరణించినట్లు పోలీసులు తెలిపారు. యూసఫ్ ఖాన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

గుంటూరు జిల్లా వ్యాప్తంగా మండల, డివిజనల్, మున్సిపల్ స్థాయిలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS) కార్యక్రమాలు జరుగుతాయని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. అర్జీదారులు తమ ఫిర్యాదులను meekosam.ap.gov.in వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చని అన్నారు. అలాగే, 1100 నెంబర్‌కు నేరుగా ఫోన్ చేసి కూడా ఫిర్యాదులు, వాటి స్థితిగతులను తెలుసుకోవచ్చని తెలిపారు.
Sorry, no posts matched your criteria.