Guntur

News August 24, 2025

గుంటూరు జిల్లాలో TODAY TOP NEWS

image

☞ గుంటూరులో భారీ అగ్నిప్రమాదం.. కార్లు దగ్ధం
☞ పల్నాడు యువకుడికి డీఎస్సీలో 3 ఉద్యోగాలు 
☞ GNT: గంజాయి కేసులో నిందితులకు DSP కౌన్సెలింగ్
☞ గుంటూరులో కొనసాగుతున్న బ్రిడ్జి నిర్మాణ పనులు  
☞ రైతులకు న్యాయం చేయకుంటే ఉద్యమిస్తాం: అంబటి
☞ అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్డులో మాక్ డ్రిల్

News August 24, 2025

గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్ష పదవికి తీవ్ర పోటీ

image

గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్ష పదవికి తీవ్ర పోటీ నెలకొంది. పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు సీనియర్ నాయకులు కూడా ఈ పదవి కోసం పోటీ పడుతుండటంతో రాష్ట్ర నాయకత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. జిల్లాలో బీసీ వర్గానికి చెందిన మహిళా ఎమ్మెల్యే, మాజీ కార్పొరేటర్ ఈ రేసులో ముందున్నట్లు సమాచారం. మరికొన్ని రోజుల్లో పార్టీ అధిష్ఠానం ఈ అంశంపై ఒక నిర్ణయం తీసుకుంటుందని నాయకులు భావిస్తున్నారు.

News August 24, 2025

గుంటూరులో పర్యాటక రంగ అభివృద్ధికి కేంద్రం నిధులు

image

గుంటూరు జిల్లాలో పర్యాటక రంగాన్ని ప్రోత్సాహించడానికి నిధులు మంజూరు చేయిస్తామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో సమీక్షలో ఆయన మాట్లాడారు. ఎన్టీఆర్ మానస సరోవరం, ఉండవల్లి గుహలు వంటి వాటి అభివృద్ధికి నిధులు కేటాయిస్తామన్నారు. సూర్యఘర్ పథకం కింద నమోదైన లక్ష మందిలో కేవలం 3,600 మందికే పరికరాలు అమర్చారని, ఈ సమస్యలను పరిష్కరించి అందరికీ పథకాన్ని వర్తింపజేస్తామన్నారు.

News August 24, 2025

గుంటూరులో కేజీ చికెన్ ధర ఎంతంటే?

image

గుంటూరులో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. చికెన్ స్కిన్ లెస్ కేజీ రూ.180, చికెన్ విత్ స్కిన్ కేజీ రూ.160గా విక్రయాలు జరుగుతున్నాయి. అయితే ఈ ధరలు కొన్ని ప్రాంతాలు, ఆ ప్రాంతాల్లో చికెన్‌కి ఉన్న డిమాండ్‌ని బట్టి రూ. 20 నుంచి రూ. 30 వ్యత్యాసం ఉంది. మరి మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News August 24, 2025

మట్టి గణపతిని పూజించండి: కలెక్టర్ నాగలక్ష్మీ

image

పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా ప్రతి ఒక్కరూ వినాయక చవితి వేడుకలను జరుపుకోవాలని కలెక్టర్ నాగలక్ష్మీ పిలుపునిచ్చారు. దీని కోసం ప్రతి ఒక్కరూ మట్టితో తయారు చేసిన గణపతి విగ్రహాలను మాత్రమే పూజించాలని ఆమె సూచించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో రూపొందించిన పోస్టర్లను శనివారం కలెక్టర్ కార్యాలయంలో ఆమె విడుదల చేశారు. కార్యక్రమంలో డీఆర్ఓ ఖాజావలి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

News August 23, 2025

గుంటూరు జిల్లా TODAY TOP NEWS

image

☞ గుంటూరులో అబ్బురపరుస్తున్న 99 అడుగుల మట్టి గణపతి.
☞ వినాయక ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి: SP.
☞ హత్యకు గురైన ఈ తీర్పు మా బిడ్డకు ఘనమైన నివాళి.
☞ మొదటి ఐదు ర్యాంకుల్లో జిల్లా మంత్రులు.
☞ తెనాలి: నిందితుడిని పట్టించిన సీసీ కెమెరా.
☞ రాష్ట్ర స్థాయి పోటీలకు మందడం విద్యార్థి.
☞ మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించిన పెమ్మసాని.

News August 23, 2025

దివ్యాంగులకు కేంద్ర స్కాలర్‌షిప్‌లు: కలెక్టర్

image

దివ్యాంగులైన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం స్కాలర్‌షిప్‌లు అందిస్తుందని గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. 9, 10వ తరగతి విద్యార్థులు ఈ నెల 31 లోపు, ఇంటర్ ఆ పైన చదువుతున్న విద్యార్థులు అక్టోబర్ 31 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆసక్తి గల వారు www.depwd.gov.inలో దరఖాస్తు చేసుకోవచ్చని ఆమె వెల్లడించారు.

News August 23, 2025

GNT: జి.వి. కృష్ణారావు గొప్ప ఆల్రౌండర్

image

గవిని వెంకట కృష్ణరావు గుంటూరు జిల్లా కూచిపూడిలో 1914లో జన్మించారు. హేతువాది, ప్రముఖ రచయిత, దార్శనికులుగా, నవలా రచయితగా, కథా రచయితగా, వ్యాసకర్తగా, ప్రసార ప్రముఖునిగా, సంస్కృతాధ్యాపకుడుగా, తత్వవేత్తగా రాణించారు. ఆంధ్రప్రభలో సబ్‌ఎడిటర్‌గా, రాడికల్ డెమోక్రాట్,  విహారి, దేశాభిమాని, విజయప్రభ పత్రికలలో ఎడిటర్‌గా పనిచేశారు. స్టడీస్ ఇన్  కళాపూర్ణోదయంలో పీహెచ్డీ పొందారు. 1978 ఆగష్టు 23న మరణించారు.

News August 23, 2025

GNT: ఆయన సీఎంగా ఉన్నప్పుడే బ్యారేజ్ నిర్మాణం

image

ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారికి (1872 ఆగష్టు 23 – 1957 మే 20) గుంటూరుతో ప్రత్యేక అనుబంధం ఉంది. అప్పటి గుంటూరు జిల్లాలోని టంగుటూరిలో వారి కుటుంబం వంశపారంపర్యంగా గ్రామ కరణం వృత్తిలో ఉండేది. ఆయన సీఎంగా ఉన్నప్పుడు కృష్ణా నదిపై ప్రకాశం బారేజి నిర్మాణం, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం స్థాపన,2000 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రముఖమైనవి.

News August 23, 2025

సమన్వయంతో పనులు చేయాలి: జేసీ భార్గవ్ తేజ

image

రెవెన్యూ, సర్వే, పంచాయతీ రాజ్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ సూచించారు. స్వామిత్వ రీ సర్వే పురోగతి పై శుక్రవారం జేసీ సమీక్ష నిర్వహించారు. మండల కేంద్రాల్లో గ్రౌండ్ ట్రూతింగ్ పనులను వేగవంతం చేయాలని చెప్పారు. డిప్యూటీ ఎంపీడీవోలు మండల స్థాయిలో మానిటరింగ్ చేస్తూ నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.