India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలపై CM చంద్రబాబు సమీక్ష చేశారు. పలు జిల్లాల్లో, పలు పట్టణాల్లో భారీ వర్షాల నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో పరిస్థితులపై సీఎం శనివారం ఉదయం అధికారులతో మాట్లాడారు. భారీ వర్షాలు ఉన్న ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించాలన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు తగు సూచనలు చేయాలని, అవసరమైన సహాయక చర్యలకు ప్రభుత్వ సిబ్బంది సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.
ప్రజా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరగబోతున్న వినాయక చతుర్థి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారని మంత్రి లోకేశ్ తెలిపారు. వినాయకచవితి సందర్భంగా ఏర్పాటు చేసుకునే గణేశ్ మండపాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనుమతుల కోసం ప్రత్యేక వెబ్సైట్ రూపొందించామని చెప్పారు. https://ganeshutsav.net ద్వారా మండపాల ఏర్పాటుకు అనుమతులన్నీ సింగిల్ విండో విధానంలో ఇచ్చేలా చేశామని Xలో పోస్ట్ చేశారు.
జిల్లాల్లో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులుగా ఐఏఎస్ లను నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాల్లో ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను అధికారుల సమన్వయంతో ప్రత్యేక అధికారులు నిర్వహించవలసి ఉంటుంది. గుంటూరుకు మల్లికార్జున, బాపట్లకు ఎంవి శేషగిరి బాబు, పల్నాడుకు రేఖ రాణిని ప్రభుత్వం నియమించింది.
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గురువారం సాయంత్రం మాచర్లకు వచ్చారు. పలు కేసుల్లో ఆయన నెల్లూరు జైలులో రిమాండ్లో ఉండి ఇటీవల బెయిల్పై బయటికి వచ్చిన విషయం తెలిసిందే. కాగా నరసరావుపేట ఎస్పీ కార్యాలయానికి వచ్చిన ఆయన తిరిగి కారులో హైదరాబాద్ వెళుతూ.. మాచర్లలోని తన ఇంటికి వచ్చి తల్లిదండ్రులతో మాట్లాడి వెళ్లారు.
ల్యాండ్ పూలింగ్ ద్వారా రాజధానికి భూములిస్తున్న రైతులకు ప్రాధాన్యత ప్రకారం వారి గ్రామాల్లోనే తిరిగి ప్లాట్లు కేటాయించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నారాయణ వెల్లడించారు. వెలగపూడిలోని సచివాలయంలో CRDA అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. ఖజానాకు భారమైనా లబ్ధిదారుల కోసం హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ పూర్తికి సీఎం అంగీకారం తెలిపారన్నారు.
గుంటూరు డీఎంహెచ్వో ఆఫీస్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. స్థానికులు వెంటనే నగరంపాలెం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని పరిశీలించి జీజీహెచ్ మార్చురికీ తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని నగరంపాలెం పోలీస్ కానిస్టేబుల్ రమేశ్ తెలిపారు.
సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు హంగు, ఆర్భాటాలు లేకుండా నరసరావుపేటలో బహిరంగ సభకు ఏర్పాట్లు చేశామని పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు వెల్లడించారు. కేవలం ఐదారు వేల లోపు స్థానిక ప్రజానీకం మధ్య వన మహోత్సవం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారన్నారు. సీఎం ఆదేశాల మేరకు పరిమిత సంఖ్యలో పోలీసు బలగాలను కేటాయించామని.. కానీ భద్రత విషయంలో రాజీ లేదన్నారు.
మంగళగిరికి చెందిన పవర్ లిఫ్టర్ షేక్ సాదియా అల్మస్ మరోసారి మెరిశారు. మాల్టా దేశంలో ఆగస్టు 28 నుంచి జరుగుతున్న జూనియర్ వరల్డ్ మెన్ అండ్ ఉమెన్ ఎక్విప్డ్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో పాల్గొన్నారు. 57 కేజీల విభాగంలో ఓవరాల్ గోల్డ్ మెడల్ సాధించారు. స్క్వాట్ 190 కేజీలు, బెంచ్ ప్రెస్ 97.5 కేజీలు, డెడ్ లిఫ్ట్ 175 కేజీలు మొత్తంగా 462.5 కేజీల బరువు ఎత్తి గోల్డ్ మెడల్ కొట్టారు.
భారతీయ రిజర్వ్ బ్యాంకు స్థాపించి 90 ఏళ్లు పూర్తైన సందర్భంగా దేశ వ్యాప్తంగా క్విజ్ పోటీలను నిర్వహిస్తున్నారు. సంబంధిత పోస్టర్లను గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మీ ఆవిష్కరించారు. జిల్లాలోని 8 విశ్వవిద్యాలయాలు, 186 కళాశాలల్లో డిగ్రీ చదువుకునే విద్యార్థులు www.rbi90quiz.in ద్వారా కళాశాల పేరుతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(AI) సిటీగా అమరావతి ఉండాలని.. ఈ మేరకు ప్రణాళికలు రూపొందించాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. పురపాలక శాఖా మంత్రి నారాయణ, CRDA అధికారులతో జరిగిన సమీక్షలో మాట్లాడారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ స్పురణకు వచ్చేలా అమరావతి లోగో ఉండాలన్నారు. మొదటి అక్షరం A, చివరి అక్షరం I అక్షరాలు వచ్చేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ లోగో రూపొందించాలన్నారు.
Sorry, no posts matched your criteria.