Guntur

News July 18, 2024

నేటి నుంచి జనసేన సభ్యత్వ నమోదు: మంత్రి నాదెండ్ల మనోహర్

image

నేటి నుంచి ఈనెల 28 వరకు జరగనున్న 4వ విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రతి ఒక్క జనసేన నాయకుడు, జనసైనికుడు, వీర మహిళ బాధ్యతగా పాల్గొనాలని మంత్రి నాదెండ్ల మనోహర్ బుధవారం కోరారు. కొత్త సభ్యత్వ నమోదుతోపాటు, సభ్యత్వ రెన్యువల్ జరిగేలా, ప్రతి జనసైనికుడి కుటుంబానికి రక్షణ కల్పించాలని ఉద్దేశమన్నారు. పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ ఆలోచనను అమలు చేయాలని సూచించారు.

News July 17, 2024

అంబేడ్కర్ వర్సిటీ దూరవిద్య పీజీ పరీక్షలు వాయిదా

image

ఈనెల 30 నుంచి జరగాల్సిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ దూరవిద్య పీజీ పరీక్షలు వాయిదా పడినట్లు, జేకేసీ కళాశాల క్యాంపస్ వర్సిటీ స్టడీ సెంటర్ సమన్వయకర్త పి గోపీచంద్ తెలిపారు. పీజీ ద్వితీయ పరీక్షలు ఆగస్ట్ 20 నుంచి 25 వరకు, పీజీ ప్రథమ సంవత్సర పరీక్షలు సెప్టెంబర్ 20 నుంచి 24 వరకు జరుగుతాయని తెలిపారు. ఏపీ ఆన్‌లైన్ ద్వారా పరీక్ష ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు.

News July 17, 2024

బీఆర్ అంబేడ్కర్ వర్సిటీ దూరవిద్య పీజీ పరీక్షలు వాయిదా

image

ఈనెల 30 నుంచి జరగాల్సిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ దూరవిద్య పీజీ పరీక్షలు వాయిదా పడినట్లు, జేకేసీ కళాశాల క్యాంపస్ వర్సిటీ స్టడీ సెంటర్ సమన్వయకర్త
పి గోపీచంద్ తెలిపారు. పీజీ ద్వితీయ పరీక్షలు ఆగస్ట్ 20 నుంచి 25 వరకు, పీజీ ప్రథమ సంవత్సర పరీక్షలు సెప్టెంబర్ 20 నుంచి 24 వరకు జరుగుతాయని తెలిపారు. ఏపీ ఆన్‌లైన్ ద్వారా పరీక్ష ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు.

News July 17, 2024

ఆస్ట్రేలియాలో బాపట్ల యువకుడి మృతి

image

బాపట్ల జిల్లాకు చెందిన యువకుడు ఆస్ట్రేలియాలో మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. బాపట్లకు చెందిన సూర్యతేజ MS కోసం ఆస్ట్రేలియా వెళ్లారు. సూర్యతేజ, ప్రకాశం జిల్లాకు చెందిన చైతన్యతో పాటు మరో స్నేహితుడు కలిసి ఆస్ట్రేలియాలోని మిల్లామిల్లా జలపాతానికి వెళ్లారు. ప్రమాదవశాత్తు సూర్యతేజ జలపాతంలోకి జారిపడటంతో అతడిని కాపాడేందుకు చైతన్య దిగగా ఇద్దరూ మునిగి చనిపోయారు.

News July 17, 2024

నాగార్జున సాగర్‌లో ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు ప్రణాళికలు

image

గుంటూరు జిల్లా నాగార్జున సాగర్‌లో ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. నాగార్జున సాగర్‌తో పాటు ఏపీలోని మరో 3 ప్రాంతాల్లో చిన్నతరహా ఎయిర్‌పోర్ట్‌లు నిర్మించేందుకు ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(AAI)కు సీఎం చంద్రబాబు తాజాగా ప్రతిపాదనలు పంపించారు. కాగా ఇందుకోసం 1,800 ఎకరాల భూమి అవసరమవుతుందని రాష్ట్ర ప్రభుత్వానికి AAI వర్గాలు తెలిపాయి.

News July 16, 2024

గుంటూరు రేంజి పరిధిలో పలువురు సీఐల బదిలీలు

image

గుంటూరు రేంజ్ పరిధిలో పలువురు సీఐలను బదిలీ చేస్తూ రేంజ్ ఐజీ సర్వ శ్రేష్ట త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో ఎక్కువగా పల్నాడు జిల్లాలోని వారికే స్థాన చలనం కలిగింది. మొత్తం 10మందిని ఐజీ బదిలీ చేయగా వారిని వెంటనే విధుల్లో చేరాలని ఉత్తర్వులు పేర్కొన్నారు.

News July 16, 2024

ఫిరంగిపురం: బాలిక మృతి.. పోక్సో కేసు నమోదు

image

యువకుడి వేధింపులతో బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. సీఐ వీరేంద్రబాబు తెలిపిన వివరాల ప్రకారం..  ఫిరంగిపురం మండలంలోని ఓ గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలిక ఇంటివద్దే ఉంటోంది. బాలికను మరో గ్రామ యువకుడు ప్రేమ పేరుతో వేధిస్తుండటంతో బాలిక తండ్రి అతన్ని మందలించాడు. నీలాంబరం, మరి కొందరు బాలిక ఇంటికి వెళ్లి ఆమె తండ్రిపై దాడి చేశారు. మనస్తాపానికి గురైన బాలిక ఆత్మహత్యకు యత్నించి చికిత్స పొందుతూ మృతి చెందింది.

News July 16, 2024

అమరావతిలో ZSI పనులు ప్రారంభం

image

అమరావతి ప్రాంతంలోని రాయపూడి గ్రామంలో జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంస్థ నిర్మాణ పనులు ప్రారంభించనుంది. సోమవారం రాయపూడి పంచాయితీలో ప్రాథమిక అనుమతుల కోసం రుసుము చెల్లించి దరఖాస్తు చేసింది. ఈ సంస్థకు 2019 ఫిబ్రవరిలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం రెండు ఎకరాల భూమిని 60 ఏళ్లకు లీజు ప్రాతిపదికన కేటాయించారు. ఈ సంస్థ దేశంలోని వివిధ జంతు జాతులపై సర్వే చేస్తూ, వాటి మనుగడకు పరిశోధనలు సాగిస్తుంది.

News July 16, 2024

ఉమ్మడి గుంటూరు జిల్లాకు కొత్త బస్సులు

image

ఉమ్మడి గుంటూరు జిల్లాలో RTCకి కొత్త బస్సులు కేటాయించడంతో ఆయా మార్గాల్లో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందనున్నాయి. కొన్నాళ్లుగా డొక్కు బస్సులతో ఇబ్బందిపడిన ప్రయాణికులకు కొత్త బస్సుల రాకతో ఊరట కలగనుంది. ఉమ్మడి జిల్లాకు RTC సొంత బస్సులు, అద్దె బస్సులు కలిసి 130 వరకు కొత్తవి సమకూరనున్నాయి. ఇప్పటికే 30 బస్సులు ఆయా డిపోలకు రాగా మిగిలినవి నెల నుంచి 2 నెలల వ్యవధిలో తీసుకురానున్నట్లు అధికారులు చెబుతున్నారు.

News July 16, 2024

గుంటూరు: కిడ్నీ రాకెట్ నిందితుడి అరెస్ట్

image

విజయవాడ కిడ్నీ రాకెట్‌ కేసులో ఒక నిందితుడిని గుంటూరు నగరపాలెం పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. కిడ్నీ ఇస్తే రూ.30 లక్షలు ఇస్తామని ఓ ముఠా గుంటూరుకు చెందిన గార్లపాటి మధుబాబు వద్ద కిడ్నీ తీసుకున్నారు. చివరికి డబ్బు ఇవ్వకుండా మోసం చేయడంతో మధుబాబు గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేసి బాషా అనే వ్యక్తిని పట్టుకున్నారు.