India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కారుణ్య నియామకంలో భాగంగా వివిధ పోస్టులకు జిల్లాలో 11 మంది ఎంపికయ్యారు. సోమవారం కలెక్టరేట్‌లో ఎంపికైన అభ్యర్థులకు నియామకపు ఉత్తర్వులను కలెక్టర్ నాగలక్ష్మీ అందించారు. ఇద్దరికి జైళ్ల శాఖ, ఇద్దరికి గ్రౌండ్ వాటర్, ఇద్దరికి పోలీస్ శాఖ, ఇరిగేషన్, మెడికల్ అండ్ హెల్త్, ట్రాన్స్‌పోర్ట్ ఇండస్ట్రీస్, రెవెన్యూ శాఖలలో జేఓఏలుగా నియమించారు. ఉద్యోగాలు పొందిన వారు సమర్ధవంతంగా విధులు నిర్వహించాలన్నారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలతో పాటు రెవెన్యూ సదస్సులలో అందిన అర్జీలు కూడా నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ అధికారులను ఆదేశించారు. సోమవారం కలక్టరేట్లో ఆమె ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుంచి 183 ఫిర్యాదులను కలెక్టర్ స్వీకరించారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యతగా పరిష్కరించాలని కలెక్టర్ అన్నారు.
సమష్టి కృషితో కుష్టు వ్యాధి రహిత సమాజస్థాపన కోసం కృషిచేయాలని గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మీ పిలుపునిచ్చారు. “లేప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్”పై గుంటూరు జిల్లా స్థాయి కో-ఆర్డినేషన్ కమిటీ సమావేశం సోమవారం కలెక్టరేట్‌లో జరిగింది. ఇందులో భాగంగా కుష్టు వ్యాధిపై అవగాహన కల్పించే పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు.
పొన్నూరుకు చెందిన ఆళ్ళ రామకృష్ణ అనే ఆర్మీ ఉద్యోగి ఇన్‌స్ట్రాగ్రాంతో పరిచయమైన విజయవాడ మహిళకు ఉద్యోగం ఇప్పిస్తానని రూ.8 లక్షలు తీసుకొని మోసం చేశాడు. బాధితురాలు స్పందనలో ఫిర్యాదు చేయడంతో గుణదల పోలీసులు కేసు నమోదు చేశారు. రామకృష్ణకి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చినా డబ్బులు తిరిగి ఇవ్వకుండా బాధితురాలిపై ఇష్టానుసారంగా మాట్లాడారు. మనస్తాపం చెందిన మహిళ ఆత్మహత్యాయత్నం చేశారు. తనడబ్బు ఇప్పించాలని వాపోయారు.
పోలీసులమని బెదిరించి ఓ వ్యక్తితో దుస్తులు ఇప్పించడంతో పాటూ నగదు దోచుకున్న ఘటన నగరంపాలెం స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఇద్దరు వ్యక్తులు ఓ యువకుడిని ఆపి మెడికల్ కాలేజ్ వద్ద నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లి బట్టలు విప్పించారు. జేబులో మత్తుపదార్థాలున్నాయి, కేసు నమోదు చేస్తామని బెదిరించారు. బాధితుడి వద్ద ఫోన్ లేకపోవడంతో అతని సోదరుడికి ఫోన్ చేయించి ఐదు వేలు కొట్టించుకున్నారు.
RRRను గత ప్రభుత్వ హయాంలో అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌లో చిత్రహింసలు పెట్టిన విషయం విషయం తెలిసిందే. అయితే ఆ ఘటనలో గుంటూరు ప్రభుత్వాసుపత్రి రిటైర్డ్ సూపరింటెండెంట్ డా. నీలం ప్రభావతి హస్తం ఉందని RRR తరఫున లాయర్ హైకోర్టులో వినిపించారు. రఘురామపై దాడి చేసిన పోలీసులను కాపాడేందుకు, కస్టడీలో RRR ఆరోగ్యం బాగానే ఉందని రికార్డులు తారుమారు చేశారని లాయర్ పోసాని అన్నారు.
పల్నాడు జిల్లాలోని నాగార్జున సాగర్ వద్ద ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి గతంలోనే ప్రతిపాదనలు సిద్ధమైన విషయం తెలిసిందే. అయితే తాజాగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం దానిపై దృష్టిసారించింది. ఈ నేపథ్యంలో ఎయిర్ పోర్ట్ ఏర్పాటుపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు నాగార్జున సాగర్‌లో 1670 ఎకరాల్లో నిర్మించాలని భావిస్తున్నట్లు తెలిపారు.
గుంటూరు పాతబస్టాండ్ సమీపంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాటు చేశామని డీఈవో సీవీ రేణుక తెలిపారు. శనివారం ఉదయం 9.30 గంటల నుంచి ప్రదర్శన ప్రారంభం అవుతుందని చెప్పారు. పాఠశాలల యాజమాన్యాలు తమ విద్యార్థులను ప్రదర్శనకు తీసుకు రావాలని కోరారు.
APలో ఆరోగ్యశ్రీ ఎక్కడికీ పోలేదని.. ఎన్టీఆర్ వైద్య సేవ పేరుతో మరింత మైరుగైన సేవలు అందించేలా రూపాంతరం చెందినట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. వెలగపూడి సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏప్రిల్ 01 నుంచి నగదు రహిత చికిత్సల్లో హైబ్రిడ్ విధానం అమలవుతుందన్నారు. రూ.2.5 లక్షల నుంచి రూ.25 లక్షల వైద్య సేవల ఖర్చును NTR వైద్య సేవ ట్రస్ట్ భరిస్తుందన్నారు.
గుంటూరులోని పోలీస్ పరేడ్ మైదానంలో కానిస్టేబుల్ మహిళా అభ్యర్థులకు శుక్రవారం పరుగు పోటీలను నిర్వహించారు. పరీక్షలకు 216 మంది మహిళా అభ్యర్థులు వచ్చారు. దేహధారుడ్య, పరుగు పోటీల్లో 106 మంది క్వాలిఫై అయినట్లు అధికారులకు తెలిపారు. పరుగు పోటీల నిర్వహణను ఎస్పీ సతీశ్ కుమార్ పరిశీలించారు. ఏఎస్పీలు సుప్రజ, హనుమంతు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.