India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
చనిపోయినా కష్టాలు తప్పడం లేదనడానికి పైఫొటోనే నిదర్శనం. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం కరాలపాడుకు చెందిన ఒకరు అనారోగ్య కారణాలతో చనిపోయారు. పాడెపై మృతదేహాన్ని శ్మశానానికి తీసుకెళ్లేందుకు చాలా ఇబ్బందులు పడ్డారు. దారి లేకపోవడంతో వాగులు, పంట పొలాల వెంబడి ఇలా అతికష్టం మీద వెళ్లి అంత్యక్రియలు చేశారు. అధికారులు, నేతలు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.
తెనాలి రైల్వే స్టేషన్ 5వ ప్లాట్‌ఫారమ్ రైల్వే పట్టాలపై యువకుడి మృతదేహం కలకలం రేపింది. సుమారు 30-32 సంవత్సరాలు కలిగిన యువకుడు జన్మభూమి రైలు వస్తున్న సమయంలో పట్టాలపై తలపెట్టి ఆత్మహత్య చేసుకున్నట్లుగా జీఆర్పీ ఎస్ఐ వెంకటాద్రి తెలిపారు. పట్టాలపై యువకుడు తల పెట్టడంతో శరీరం నుండి తల వేరుగా పడి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ వెంకటాద్రి తెలిపారు.
మాజీ మంత్రులు కొడాలి నాని, అంబటి రాంబాబు, రోజాపై విశాఖ టూ టౌన్ స్టేషన్‌లో టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్‌పై గతంలో వీరు అనుచిత వ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ టీడీపీ జిల్లా పార్లమెంటు ఉపాధ్యక్షుడు విల్లూరి చక్రవర్తి, విల్లూరి తిరుమల దేవి ఫిర్యాదు చేశారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరినట్లు వెల్లడించారు.
పల్నాడు(D) వినుకొండలోని శివాలయంలో అర్చకుడు మద్యం సేవించాడంటూ ఓ వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు పూజారికి నోటీసులు జారీ చేశారు. తాత్కాలికంగా ఆయనను విధుల నుంచి తప్పించినట్లు ఈవో హనుమంతురావు తెలిపారు. ఆయన స్థానంలో నూతన అర్చకుడిని నియమించినట్లు చెప్పారు. అయితే తాను అనుచితంగా ప్రవర్తించలేదని, కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని పూజారి తెలిపారు.
నరసరావుపేట: ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకానికి గడువు డిసెంబర్ 31వ తేదీతో ముగుస్తుందని కలెక్టర్ అరుణ్ బాబు చెప్పారు. సోమవారం కలెక్టరేట్లో రబీ 2024 -25 సీజన్‌కు సంబంధించి బీమా యోజనపై అవగాహన కల్పించే గోడపత్రికలను ఆయన ఆవిష్కరించారు. నేషనల్ క్రాఫ్ట్ ఇన్సూరెన్స్ పోర్టల్‌లో ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.
కలెక్టరేట్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చిన దివ్యాంగుల వద్దకే కలెక్టర్ వెళ్లి వినతిని స్వీకరించారు. తమ సమస్యలను అధికారులకు వివరించిన పట్టించుకోవడంలేదని విభిన్న ప్రతిభావంతులు కలెక్టర్‌ను వేడుకున్నారు. దివ్యాంగులకు కావాల్సిన వీల్ ఛైర్‌లు, బ్యాటరీ వాహనాలను, చెక్క కర్రలు, వినికిడి యంత్రాలను అందించాలని దివ్యాంగులు కోరారు. దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని కలెక్టర్ నాగలక్ష్మి అన్నారు.
ఓ విద్యార్థిని సహచర విద్యార్థులు కొట్టి చంపి బావిలో పడేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. స్థానికుల వివరాల మేరకు.. పొన్నెకల్లులో సమీర్ అనే 9వ తరగతి విద్యార్థిని తోటి విద్యార్థులు గత నెల 24న గొడవపడి కొట్టి చంపి బావిలో పడేశారు. స్థానికులు గమనించి ఉపాధ్యాయులు, పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకుండా కుటుంబసభ్యులకు అప్పగించగా, బాలుడి ఒంటిపై రక్తపు గాయాలు ఉండడాన్ని గమనించడంతో వెలుగులోకి వచ్చింది.
శవ రాజకీయాలకు జగన్ బ్రాండ్ అంబాసిడర్ గా మారారని చిలకలూరిపేట MLA ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. ఆదివారం చిలకలూరిపేటలో మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు కుటుంబం విషాదంలో ఉంటే తమ్ముడిని తొక్కేశాడని, కుటుంబంలో వివాదం ఉందని జగన్ మీడియా వార్తలు రాయటం దారుణమన్నారు. సొంత మనుషులను రాజకీయంగా వాడుకొని ఎలా వదిలేయాలో జగన్‌కు తెలిసినట్లు ఎవరికీ తెలియదు అన్నారు. ముందు తల్లి, చెల్లికి సమాధానం చెప్పాలన్నారు.
నరసరావుపేట భావన కళాశాల ఇంటర్ విద్యార్థిని అనూష ఆత్మహత్యపై ఆదివారం రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు బత్తుల పద్మావతి నివేదికను కోరారు. పోలీస్ శాఖ, విద్యాశాఖ సమగ్ర దర్యాప్తు జరిపి నివేదికను తక్షణమే పంపాలని ఆదేశాలు ఇచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. దురదృష్టకరమైన ఘటన పట్ల ఆవేదన వ్యక్తం చేసి తల్లిదండ్రులకు సానుభూతి తెలిపారు.
సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నటి శ్రీరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు దాసరి జ్యోతి శ్రీరెడ్డిపై నగరంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు శ్రీరెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ వీరనాయక్ చెప్పారు.
Sorry, no posts matched your criteria.