India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

గుంటూరు మండల విద్యాశాఖ అధికారి ఎస్.ఎం.ఎం ఖుద్దూస్ 10 మంది ఉపాధ్యాయులకు ఆదివారం షోకాజ్ నోటీసులు జారీచేశారు. పదోతరగతి ఇన్విజిలేషన్ డ్యూటీ రిపోర్ట్‌లో నిర్లక్ష్యం చేయడంతో ఆ ఉపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖ అధికారి సి.వి రేణుక ఆదేశానుసారం నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. తాఖీదు అందిన వెంటనే సంబంధిత ఉపాధ్యాయులు వివరణ ఇవ్వాలని ఖుద్దూస్ సూచించారు.

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ(PGRS)ను ఈ సోమవారం నుంచి మండల, డివిజనల్, మున్సిపల్ స్థాయిలో కూడా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ నాగలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి తమ ఫిర్యాదులను సమీపంలోని మండల కార్యాలయాలు, డివిజనల్ కార్యాలయాలు లేదా మున్సిపల్ కార్యాలయాలలో సమర్పించుకోవచ్చని అన్నారు. ప్రజలకి పాలనను మరింత చేరువ చేయడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు.

ఉండవల్లి నివాసంలో ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో హడ్కో-సీఆర్డీఏ మధ్య ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం మేరకు రాజధాని నిర్మాణాలకు హడ్కో రూ.11వేల కోట్లు రుణంగా అందించనుంది. జనవరి 22న ముంబైలో జరిగిన హడ్కో బోర్డు సమావేశంలో నిధులు మంజూరుకు అంగీకారం తెలిపారు. కార్యక్రమంలో మంత్రి నారాయణ, హడ్కో సీఎండీ సంజయ్ కుల్ శ్రేష్ఠ, మున్సిపల్ శాఖ అధికారులు పాల్గొన్నారు.

మేయర్ మనోహర్ రాజీనామా నిర్ణయంపై వైసీపీలో కూడా కొంత అసంతృప్తికి దారితీసినట్లు సమాచారం. వైసీపీకి ఉన్న 23 మంది కార్పొరేటర్లతో ఆయన మాట మాత్రం చెప్పకుండా నిర్ణయం తీసుకున్నారని డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు వ్యాఖ్యానించారు. పార్టీ జిల్లా నగర అధ్యక్షులకు కూడా సమాచారం ఇవ్వలేదని సమాచారం. టీడీపీ అవిశ్వాసం పెట్టడానికి ముందే మేయర్ రాజీనామా చేయడంతో తదుపరి చర్యలపై ఆ పార్టీ నాయకులు మల్లగుల్లాలు పడుతున్నారు.

ఇంటర్ ప్రథమ, 2వ సంవత్సరం విద్యార్థులకు ప్రధాన పరీక్షలు శనివారంతో ముగిశాయి. గురువారంతో ఇంటర్ ప్రథమ సంవత్సరం, శనివారం ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు ముగిశాయి. చివరి రోజు పరీక్షలకు జనరల్, ఒకేషనల్ విద్యార్థులు కలిపి 29,405 మందికి 28,901 మంది హాజరు కాగా 503 మంది గైర్హాజరయ్యారు. జవాబు పత్రాల మూల్యాంకనం సోమవారం నుంచి జరగనుంది. ఇందుకోసం సాంబశివపేటలోని ప్రభుత్వ మహిళ కాలేజీలో ఏర్పాట్లు చేశారు.

నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికలను టీడీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని అన్ని స్థానాలను కైవసం చేసుకుంది. గత ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం జీఎంసీలో 4ఏళ్లలోపు ఎటువంటి అవిశ్వాస తీర్మానం పెట్టడానికి వీల్లేదు. ఈ నెలతో ఆ గడువు ముగుస్తుంది. కనుక అవిశ్వాస తీర్మానం కచ్చితంగా పెడతామని టీడీపీ నాయకులు బాహాటంగానే ప్రకటించారు. అందుకే మేయర్ రాజీనామా అని పలువురు చర్చించుకుంటున్నారు.

పెదకాకాని మండలం నంబూరులోని గుంటూరు ఛానల్‌లో శుక్రవారం గల్లంతైన బాలుడు మృతి చెందాడు. స్థానిక అంబేడ్కర్ నగర్‌కు చెందిన ప్రొక్లెయినర్ డ్రైవర్ ఏసురత్నం, సాంబమ్మ దంపతుల 2వ కుమారుడు జాషువా(12) స్థానిక జడ్పీ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. పాఠశాలకు సెలవు కావడంతో గుంటూరు ఛానల్‌కు వెళ్లాడు. సరదాగా నీటిలో దిగుదామనే ప్రయత్నం చేస్తుండగా కాలుజారి కాలువలో పడి గల్లంతై మరణించాడు.

మేడికొండూరు మండలం పేరేచర్ల ఎస్సీ కాలనీకి చెందిన 65 ఏళ్ల దేవరకొండ రామారావు అదే కాలనీలోని తన స్నేహితుడు ఇంటికి శుక్రవారం వెళ్లాడు. ఇంటిలో బాలిక మాత్రమే ఉండడంతో లైంగిక దాడికి యత్నించాడు. అతనితో పెనుగులాడిన బాలిక పెద్దగా కేకలు వేస్తూ బయటకు పరుగులు తీసింది. ఇది తెలిసిన బాధితురాలి బంధువులు మేడికొండూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం కింద నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

వెంకటపాలెంలో నేడు జరగబోవు శ్రీవారి కల్యాణానికి వెయ్యి మందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ సతీష్ తెలిపారు. శుక్రవారం ఆలయ ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ వద్ద సిబ్బందికి పలు సూచనలు చేశారు. బంధువు పొత్తు నిర్వహణకు వీలుగా సభా ప్రాంగణాన్ని సెక్టార్లుగా విభజించి ఎస్పీ, డీఎస్పీ స్థాయి అధికారులను ఇన్‌ఛార్జ్ లుగా నియమించామని చెప్పారు.

వెంకటపాలెంలో రేపు జరగబోవు శ్రీవారి కల్యాణానికి వెయ్యి మందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ సతీష్ తెలిపారు. శుక్రవారం ఆలయ ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ వద్ద సిబ్బందికి పలు సూచనలు చేశారు. బంధువు పొత్తు నిర్వహణకు వీలుగా సభా ప్రాంగణాన్ని సెక్టార్లుగా విభజించి ఎస్పీ, డీఎస్పీ స్థాయి అధికారులను ఇన్‌ఛార్జ్ లుగా నియమించామని చెప్పారు.
Sorry, no posts matched your criteria.