India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల కోసం జిల్లాల వారీగా బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆ పార్టీ ప్రకటించింది. అక్రమ నిర్బంధాలు, అరెస్టులకు గురవుతున్న సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా ఉండేందుకు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ తరఫున ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. ఇందులో గుంటూరు జిల్లా నుంచి మాజీ మంత్రి విడదల రజిని, తాడికొండ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ డైమండ్ బాబుకు బాధ్యతలు అప్పగించారు.
ఆర్టీసీ బస్సు, ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీకొన్న సంఘటన నాదెండ్ల మండలం సాతులూరు వద్ద గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్టీసీ బస్సు గుంటూరు నుంచి బయలుదేరి సాతులూరు సమీపంలోకి రాగానే ప్రైవేట్ పాఠశాల బస్సును ఢీకొట్టింది. ఈ సంఘటనలో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వారిని వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
రాష్ట్రవ్యాప్తంగా 2022లో నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ (NCD) ప్రజల ఆరోగ్యంపై కోసం ఇళ్ల వద్దకే వెళ్లి బీపీ, షుగర్, బీఎంఐ.. సహా పలు రకాల స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా వ్యాప్తంగా 74.48 శాతం మందికి పరీక్షలు నిర్వహించగా అత్యధికంగా జిల్లాలో 65,772 మంది షుగర్ బాధితులు ఉన్నారు. ఈ నేపథ్యంలో షుగర్ బాధితులలో గుంటూరు మొదటి స్థానంలో నిలిచింది. కాగా ఇప్పుడు ఈ సంఖ్య ఇంకా పెరిగింది.
గుంటూరు కలెక్టర్, జిల్లా మెజిస్ట్రేట్ ఎస్. నాగలక్ష్మీ ఐఏఎస్. గురువారం పెదకాకానిలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు రోడ్డు నిర్మాణ పనుల నాణ్యతను పరిశీలించి, పనులు వేగవంతంగా పూర్తిచేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రజల సౌకర్యం కోసం ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడంపై ఆమె దృష్టి సారించారు.
పెదకాకాని మండలంలోని ఓ గ్రామంలో తండ్రి లేని ఓ మైనర్ బాలిక ఇంటి దగ్గరే ఉంటోంది. అదే గ్రామంలో నివసిస్తున్న చిన్నాన్న మొగులూరి శామ్యూల్ ఆ బాలికకు మాయ మాటలు చెప్పి లోబరుచుకొని 8 నెలలుగా లైంగిక దాడి చేస్తున్నాడు. ప్రస్తుతం బాలికకు నెలసరి రాకపోవడంతో తల్లి డాక్టర్‌కు చూపించగా 3వ నెల గర్భిణిగా నిర్ధారించారు. దీనిపై బాలిక తల్లి ఫిర్యాదు చేయగా.. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు.
సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్‌లపై సినీ నటుడు పోసాని కృష్ణమురళి గతంలో చేసిన అనుచిత వ్యాఖ్యలపై నరసరావుపేట 2వ పట్టణ పోలీస్ స్టేషన్ లో బుధవారం ఫిర్యాదు చేశారు. పోలీసులు పోసానిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పల్నాడు జిల్లా TDP ప్రధాన కార్యదర్శి కొట్టా కిరణ్, జిల్లా లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ ఆలీభాష డిమాండ్ చేశారు. కాగా బాపట్లో పోసానిపై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
పెదకాకాని మండలంలో గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మి బుధవారం పర్యటించారు. మండల కేంద్రంలోని గౌడపాలెం అంగన్వాడీని సందర్శించి ఇంకుడు గుంట ఏర్పాట్లను పరిశీలించారు. కేంద్రంలోని వసతులు, విద్య, టాయిలెట్లు, ఆహార పదార్థాలు, వాటి నాణ్యత గురించి అంగన్వాడీ టీచర్, ఆయాలను అడిగి తెలుసుకున్నారు. పెదకాకాని మండలంలోని పుష్పరాజ్ కాలనీ సీసీ రోడ్డు ఏర్పాట్లను పరిశీలించారు.
సినీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై తుళ్ళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి నారా లోకేశ్‌లపై అసభ్యంగా పోస్టులు పెట్టారని పెదపరిమి గ్రామానికి చెందిన నూతలపాటి రామారావు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా U/S 336(4), 353(2), 356(2), 61(2), 196, 352 BNS, Sec. 67 ఆఫ్ IT యాక్ట్‌ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
వేమూరు మాజీ MLA మేరుగు నాగార్జున క్వాష్ పిటిషన్‌పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. గతంలో మేరుగుపై పద్మావతి అనే మహిళ అత్యాచారం కేసు పెట్టగా.. ఇటీవల కేసుతో ఎలాంటి సంబంధం లేదని స్టేట్మెంట్ ఇచ్చారు. కేసును ఏం చేస్తారని హైకోర్టు పోలీసులను అడిగింది. రిటర్న్ రిపోర్టు ఇవ్వాలంటూ పోలీసులకు హైకోర్టు ఆదేశించింది. అప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశిస్తూ తదుపరి విచారణ ఈనెల 28కి వాయిదా వేసింది.
తండ్రిలేని యువతిని మేనమామ గర్భిణీని చేసిన ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. భట్టిప్రోలుకి చెందిన 18ఏళ్ల యువతికి చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు. ఈ నేపథ్యంలో ఆ యువతి ఆదిలాబాద్‌లో ఉంటున్న పెద్ద మేనమామ వద్ద ఉంటోంది. ఒంగోలులో ఉంటున్న చిన్న మేనమామ ఇటీవల ఆదిలాబాద్ వెళ్లాడు. ఈ క్రమంలో అతను కోడలిని లొంగదీసుకొని గర్భిణీని చేశాడు. యువతికి తీవ్ర కడుపు నొప్పి రాగా.. వైద్యులు గర్భిణిగా నిర్దారించారు.
Sorry, no posts matched your criteria.