India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కారంపూడి మండలం పెదకోదమగుండ్ల గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్లో సోషల్ టీచర్ ఆరో తరగతి చదువుతున్న విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని తల్లిదండ్రులు హెచ్ఎంకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం గ్రామస్థులతో కలిసి విద్యార్థుల తల్లిదండ్రులు టీచర్పై దాడికి యత్నించారు. దీంతో తల్లిదండ్రులను అడ్డుకుని శాంతింపజేశామని ఉపాధ్యాయులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
మెగా డీఎస్సీని ఎటువంటి విమర్శలకు తావు లేకుండా పారదర్శకంగా నిర్వహించాలని మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు. టెట్, మెగా డీఎస్సీ నిర్వహణపై పాఠశాల విద్య ఉన్నతాధికారులతో సచివాలయంలోమంగళవారం సమీక్ష నిర్వహించారు. సిలబస్ విషయంలో సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారంపై మంత్రి ఆరా తీశారు. సిలబస్లో ఎటువంటి మార్పులు చేయలేదని అధికారులు మంత్రికి వివరించారు.
పల్నాడు జిల్లా కలెక్టర్గా పి.అరుణ్ బాబును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సత్యసాయి జిల్లా కలెక్టర్గా పని చేస్తున్న అరుణ్ బాబు పల్నాడు కలెక్టర్గా రానున్నారు. అరుణ్ బాబు గతంలో నరసరావుపేట, గురజాల ఆర్డీవోగా పని చేశారు. ప్రస్తుతం ఉన్న కలెక్టర్ శ్రీకేశ్ బాలాజీ బదిలీ అయ్యారు. ఆయన పోస్టింగుపై ఎలాంటి సమాచారం వెల్లడించలేదు.
ప్రభుత్వం నిర్వహించనున్న డీఎస్సీ- 2024 పరీక్షలకు హాజరయ్యే ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ (సోషల్ స్టడీస్) అభ్యర్థులు 200 మందికి ఉచిత శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు ఏపీ బీసీ స్టడీ సర్కిల్ గుంటూరు సంచాలకుడు మధుసూదనరావు సోమవారం తెలిపారు. టెట్ పరీక్షలో అర్హత సాధించిన జిల్లాలోని SC,ST,BC అభ్యర్థులు ఈనెల 7వ తేదీ లోపు గుంటూరులోని బీసీ స్టడీ సర్కిల్లో దరఖాస్తులు అందజేయాలన్నారు.
గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో కొన్ని రైళ్లను, గుంటూరు-విజయవాడ మార్గంలో తాత్కాలికంగా రద్దు చేసినట్లు సీనియర్ డీసీ ప్రదీప్ కుమార్ సోమవారం వెల్లడించారు. రైలు నంబర్ 17329 (హుబ్లి-విజయవాడ) ఈ నెల 15 నుంచి 31వరకు, 17330 (విజయవాడ-హుబ్లి) ఈ నెల 16 నుంచి ఆగస్టు 1వరకు, 17282 (నరసాపూర్-గుంటూరు), 17281 (గుంటూరు- నరసాపూర్) ఈ నెల 1 నుంచి 31 వరకు రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
గుంటూరు జిల్లాలో అతిసార వ్యాధిని అదుపు చేసేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ నాగలక్ష్మీ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో వైద్యశాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ అతిసార వ్యాధిని అరికట్టేందుకు రూపొందించిన ప్రచార పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ రాజకుమారి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు లక్ష్మీ కుమారి, తదితరులు పాల్గొన్నారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజలు అందించిన ఫిర్యాదులను సత్వరమే పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ నాగలక్ష్మీ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల ప్రజలు వచ్చి ఇచ్చిన 142 అర్జీలను కలెక్టర్ స్వీకరించారు. ఫిర్యాదులు స్వీకరించడానికి ముందు పెండింగ్లో ఉన్న ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులతో సమీక్షించారు.
ఏపీకి చెందిన ముగ్గురు జవాన్ల మృతి పట్ల మంత్రి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లద్దాక్ ప్రమాదంలో నాగరాజు, సుభానా ఖాన్, ఎం ఆర్కే రెడ్డి మృతిచెందటం బాధాకరమన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందన్నారు.
మంగళగిరి- తెనాలి ఫ్లై ఓవర్ బ్రిడ్జి సమీపంలో సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తాడికొండ మండలం కంతేరుకు చెందిన సర్పంచ్ బెజ్జం మహేశ్కు చెందిన కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో సర్పంచ్ మహేశ్ మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మద్యం నిల్వ చేసిన కేసులో మంగళగిరి YCP అభ్యర్థినిగా పోటీ చేసిన మురుగుడు లావణ్య తండ్రి, వైసీపీ నాయకుడు కాండ్రు శివనాగేంద్రంను అరెస్టు చేసినట్లు సెబ్ సీఐ ప్రసన్న ఆదివారం తెలిపారు. మంగళగిరిలోని కాండ్రు వారి వీధిలో దామర్ల వీరాంజనేయులు నివాసంలో జూన్ 1న 6,528 మద్యం సీసాలను నిల్వ చేశారు. దీంతో పోలీసులు శివనాగేంద్రంను శనివారం అరెస్టు చేసి మంగళగిరి కోర్టులో హాజరుపరచగా 15 రోజుల రిమాండ్ విధించింది.
Sorry, no posts matched your criteria.