Guntur

News October 31, 2024

బోరుగడ్డ అనిల్‌కు 7 రోజుల రిమాండ్

image

వైసీపీ నేత బోరుగడ్డ అనిల్‌కు= శ్రీకాకుళం ఫస్ట్ క్లాస్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కోర్ట్ జడ్జీ భరణి 7 రోజులు రిమాండ్ విధిస్తూ తీర్పు చెప్పారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌పై గతంలో అనిల్ చేసిన విమర్శలపై కేసు నమోదవ్వడంతో పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. ఈ నేపథ్యంలో భరణి రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చారు. ఓ వ్యక్తిని బెదిరించిన కేసులో ఇప్పటికే అనిల్ రాజమండ్రి జైలులో ఉన్నారు.

News October 31, 2024

గుంటూరు మిర్చి యార్డుకు నేడు సెలవు

image

గుంటూరు మార్కెట్ యార్డుకు దీపావళి పండుగను పురస్కరించుకొని గురువారం సెలవు ప్రకటించినట్లు యార్డు ఉన్నత శ్రేణి కార్యదర్శి వినుకొండ ఆంజనేయులు తెలిపారు. శుక్రవారం యార్డులో యథావిధిగా క్రయ విక్రయాలు జరుగుతాయని చెప్పారు. శని, ఆదివారం సాధారణ సెలవులు ఉంటాయన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని రైతుల మిర్చి యార్డుకు సరుకు తీసుకురావద్దని చెప్పారు. 

News October 31, 2024

గుంటూరులో ‘రన్ ఫర్ యూనిటీ’: ఎస్పీ

image

గుంటూరు జాతీయ ఐక్యత దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం ఉదయం 6:45 గంటలకు గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి ‘ఐక్యత పరుగు'(రన్ ఫర్ యూనిటీ) నిర్వహించనున్నట్లు ఎస్పీ సతీశ్ కుమార్ తెలిపారు. ఆసక్తి కలిగిన వారు ఈ ఐక్యత పరుగులో పాల్గొనవచ్చునని ఎస్పీ సూచించారు. ‘ప్రతి ఒక్కరూ సమానులే’ అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఎస్పీ తెలిపారు.

News October 30, 2024

మంగళగిరి మహిళకు TTDలో కీలక పదవి

image

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నూతన పాలక మండలి 24 మంది సభ్యులతో ఏర్పాటు కానుంది. ఈ మేరకు టీటీడీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇందులో మంగళగిరికి చెందిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, చేనేత కుటుంబానికి చెందిన తమ్మిశెట్టి జానకి దేవికి చోటు దక్కింది. ఆమెను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యురాలిగా నియమించారు.

News October 30, 2024

పల్నాడు: TTD పాలకవర్గంలో జంగాకు చోటు

image

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గం ఛైర్మన్, మెంబర్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఛైర్మన్‌గా బీఆర్ నాయుడును నియమించగా, ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి TTD సభ్యుడిగా మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి నియమితులయ్యారు. జంగా కృష్ణమూర్తి ఇటీవలే వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే.

News October 30, 2024

గుంటూరు : LLB 9వ సెమిస్టర్ టైంటేబుల్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో అయిదేళ్ల LLB కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 9వ సెమిస్టర్ (రెగ్యులర్ & సప్లిమెంటరీ) థియరీ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. నవంబర్ 19, 21, 23, 25, 27వ తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 70 మార్కులకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని ANU పరీక్షల విభాగం తెలిపింది. పూర్తి వివరాలకై https://www.nagarjunauniversity.ac.in/ వెబ్‌సైట్ చూడవచ్చు.

News October 30, 2024

ముఖ్యమంత్రి చంద్రబాబు నేటి షెడ్యూల్ ఇదే

image

సీఎం చంద్రబాబు 11.50 గంటలకు సచివాలయానికి చేరుకుంటారు. దీపం-2 పథకంలో భాగంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం ప్రారంభించడానికి అవసరమైన రూ.876 కోట్ల చెక్‌ను గ్యాస్ సరఫరా చేసే పెట్రోలియం సంస్థలకు అందజేయనున్నట్లు తెలిపారు. 12 గంటలకు స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్‌పై నీతి ఆయోగ్ సంస్థ ప్రతినిధులతో చర్చించనున్నట్లు సీఎం క్యాంప్ కార్యాలయం తెలిపింది. 

News October 30, 2024

గుంటూరు: శాస్త్రవేత్త రామారావు కన్నుమూత

image

గుంటూరు జిల్లాకు చెందిన ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త మొవ్వ రామారావు(90) మంగళవారం తెనాలిలో అనారోగ్యంతో కన్నుమూశారు. లాంగ్ ఫామ్‌లో సుదీర్ఘకాలంగా పనిచేయడంతో పాటు ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ పాలకమండలి సభ్యుడిగా కూడా వ్యవహరించారు. వేమూరు మండలం జంపనిలో 1935, జూన్ 4వ తేదీన మధ్యతరగతి కుటుంబంలో రామారావు జన్మించారు. నవంబర్ 1న అంత్యక్రియలు జరగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 

News October 30, 2024

బోరుగడ్డ అనిల్‌కు రిమాండ్ పొడగింపు

image

గుంటూరులో ఓ వ్యక్తిని రూ.50లక్షలు ఇవ్వాలని బెదిరించిన కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న బోరుగడ్డ అనిల్‌కు రిమాండ్ పొడగిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. మూడు రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీలో విచారణ అనంతరం పోలీసులు అనిల్‌ను కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌ను నవంబర్ 12వ తేదీ వరకు పొడిగించింది. దీంతో పోలీసులు తిరిగి అనిల్‌ను రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించారు. 

News October 30, 2024

పిన్నెల్లి బెయిల్ షరతులపై ముగిసిన వాదనలు

image

ఎన్నికల సమయంలో నమోదైన కేసుల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఆ షరతులను సడలించాలని పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించగా, పోలీసుల తరఫు న్యాయవాది కౌంటర్ దాఖలు చేయడంతో మంగళవారం వాదనలు ముగిశాయి. నవంబర్ 4వ తేదీన తీర్పు వెలువరిస్తామని న్యాయస్థానం తెలిపింది. సింగపూర్‌లో కుమారుడి విద్యాభ్యాసం కోసం తాను వెళ్లాల్సి ఉందని తన పాస్‌పోర్ట్ వెనక్కి ఇప్పించాలని కోరారు.