India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉద్యోగాల కోసం ఏజెంట్ చేతిలో మోసపోయి విదేశాల్లో మానవ అక్రమ రవాణా ముఠాల చెరలో ఉన్న తన ఇద్దరి కుమారులను రక్షించాలంటూ సూర్యకుమారి Dy.CM పవన్‌ని గన్నవరం ఎయిర్‌పోర్టులో గురువారం కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ ఘటనపై పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించారు. ఈ విషయాన్ని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లి, విదేశాల్లో ఉన్నవారిని తిరిగి రప్పిస్తానని అన్నారు.
ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీన మచిలీపట్నంలో జర్నలిస్టులకు ‘వార్తాలాప్’ మీడియా వర్క్ షాప్ నిర్వహించనున్నట్టు PIB డైరెక్టర్ రత్నాకర్ తెలిపారు. ఉదయం 10 గంటలకు వలందపాలెంలోని G కన్వెన్షన్‌లో నిర్వహించే ఈ వర్క్ షాప్‌కు మంత్రి కొల్లు రవీంద్ర, కలెక్టర్ బాలాజీ ముఖ్య అతిథులుగా పాల్గొంటారన్నారు. జిల్లాలోని జర్నలిస్టులు ఈ వర్క్ షాప్‌లో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
ఆరు సంవత్సరాలుగా ఒక్క ఎన్నికలోనూ పోటీ చేయని గుర్తింపు లేని రాజకీయ పార్టీలకు భారత ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కృష్ణాజిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డీ.కే. బాలజీ ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. చట్టబద్ధంగా నమోదై, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనని ఈ పార్టీలపై తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు కలెక్టర్ వివరించారు.
☞కృష్ణా: రేపే మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్
☞ గుడివాడ ఫ్లైఓవర్ పనులు వేగవంతం
☞ వీరవల్లి: మిస్సింగ్ కేసు చేధించిన పోలీసులు
☞ మచిలీపట్నం: ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
☞ కృష్ణా: పీఏసీఎస్‌లకు త్రిసభ్య కమిటీలు
☞ మచిలీపట్నం: మైనర్ల తల్లిదండ్రులకు డీఎస్పీ రాజా హెచ్చరికలు
☞ కనకదుర్గమ్మ సన్నిధిలో కొనసాగుతున్న శాఖాంబరి ఉత్సవాలు
మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. వీరవల్లి ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల మేరకు.. పొట్టిపాడుకు చెందిన జస్వంత్ ఓ కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు. అదే కాలేజీలో హాస్టల్‌లో ఉంటున్నాడు. హాస్టల్‌లో ఉండటం ఇష్టం లేక అక్కడి నుంచి పారిపోవడంతో తండ్రి వెంకటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సాంకేతిక పరిజ్ఞానంతో యువకుడిని పట్టుకొని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మచిలీపట్నం చిలకలపూడిలో కొనసాగుతున్న మైనార్టీ గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధిత శాఖాధికారులు చర్యలు చేపట్టారు. PGT, ఇంగ్లిష్, ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండగా సంబంధిత పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అర్హత, ఆసక్తి గల వారు తమ దరఖాస్తులను పాఠశాల పని వేళలలో అందజేయాలని ప్రిన్సిపల్ బేతపూడి రవి కోరారు.
విద్యార్థుల అభ్యాసాన్ని, అభివృద్ధిని సమీక్షించేందుకు ప్రభుత్వం చేపట్టిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ గురువారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు. జిల్లా వ్యాప్తంగా 1,798 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో జరిగే ఈ సమావేశంలో 2,65,574 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొననున్నారు. కార్యక్రమంలో భాగంగా అధికారులు పాఠశాలల వద్ద తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
పెనమలూరు, గన్నవరం మండలాలవారు నిత్యం విజయవాడ నగరానికి ఉద్యోగాలు, విద్య, ఇతర అవసరాల కోసం ప్రయాణిస్తుంటారు. అయితే సీఎం చంద్రబాబు ప్రకటించిన ఉచిత బస్సు ప్రయాణం జిల్లాకే పరిమితం అన్న స్పష్టతతో ఆ ప్రయాణికుల్లో అసంతృప్తి నెలకొంది. కానీ ఈ మండలాల నుంచి విజయవాడ కూతవేటు దూరంలో ఉన్నా ఉచిత ప్రయాణం వర్తించకపోవడం విద్యార్థులు, ఉద్యోగులకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తోంది. దీనిపై మీ కామెంట్.!
ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు (PACS)లకు త్రిసభ్య కమిటీలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా కృష్ణా జిల్లాలో మొత్తం 66 పీఏసీఎస్‌లకు కమిటీలను ఏర్పాటు చేశారు. ఛైర్మన్‌గా ఒకరు, సభ్యులుగా ఇద్దరిని నియమించారు. ఈ కమిటీల ఆధ్వర్యంలో పీఏసీఎస్‌ల సీఈఓ, కార్యదర్శులు పని చేయనున్నారు. పీఎసీఎస్‌లకు ఎన్నికలు నిర్వహించే వరకు ఈ కమిటీలు పని చేస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ముందస్తు సమాచార వ్యవస్థను బలోపేతం చేసుకొని, రాత్రిపూట జరిగే దొంగతనాలు, చైన్ స్నాచింగ్ వంటి నేరాలు జరగకుండా పటిష్ఠ నిఘా ఏర్పాటు చేయాలని ఎస్పీ ఆర్.గంగాధర్ రావు అన్నారు. మంగళవారం మచిలీపట్నంలో సీసీఎస్ పోలీసులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఎస్పీ దిశా నిర్దేశం చేశారు. దొంగతనాలకు పాల్పడే వారి ఆటలకు చెక్ పెడుతూ, చైన్ స్నాచింగ్ వంటి నేరాలు చేసే వారిపై నిఘా ఉంచాలన్నారు.
Sorry, no posts matched your criteria.