India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మచిలీపట్నం-విజయవాడ జాతీయ రహదారిపై గురువారం ప్రమాదం జరిగింది. కారు, బైక్ ఢీకొనడంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే మరణించగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వ్యక్తిని వెంటనే 108 అంబులెన్స్‌లో మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.
కృష్ణా జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య అండర్ 19 ఫెన్సింగ్ జట్ల ఎంపికలను కృష్ణలంకలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించినట్లు జిల్లా ఎస్జీఎఫ్ కార్యదర్శి రవికాంత తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ పోటీలకు జిల్లా నలుమూలల నుంచి క్రీడా కారులు పాల్గొన్నారని చెప్పారు. కార్యక్రమంలో పీఈటీలు నాగరాజు, దీపా, వెంకట్రావ్ పాల్గొన్నారు.
కృష్ణా జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ ఉప్పాల హారిక అధ్యక్షతన మచిలీపట్నంలోని జెడ్పీ కన్వెన్షన్ హాలులో జెడ్పీ సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి కలెక్టర్ డీకే బాలాజీ, ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్, నూజివీడు సబ్ కలెక్టర్‌తోపాటు మూడు జిల్లాల అధికారులు హాజరయ్యారు. తొలుత వ్యవసాయ శాఖపై చర్చ ప్రారంభమైంది.
కృష్ణా జిల్లాలో రోజురోజుకు గొలుసు దొంగతనాలు పెరిగిపోతున్నాయి. గన్నవరం, బాపులపాడులలో పట్టపగలు మహిళల గొలుసులు లాక్కుని దొంగలు పారిపోయారు. ప్రస్తుతం బంగారం గ్రాము ధర రూ.10 వేలు దాటడంతో మహిళలు రెండు నుంచి నాలుగు లక్షల రూపాయల వరకు నష్టపోతున్నారు. ఈ క్రమంలో మహిళలు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా బస్టాండ్లు, బస్సులలో ప్రయాణించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
చల్లపల్లి (M) పురిటిగడ్డ ZP హైస్కూల్లో బుధవారం మధ్యాహ్నం విద్యార్థుల కోసం వండిన అన్నంలో పురుగులు కనిపించాయి. ఇది గమనించిన విద్యార్థులు వెంటనే HM కె.బి.ఎన్ శర్మ దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన వెంటనే స్పందించి, బియ్యాన్ని జల్లించి శుభ్రం చేయించి వండించారు. వండిన అన్నం నాణ్యతను స్వయంగా పరిశీలించి, ఆ తర్వాతే విద్యార్థులకు వడ్డించారు. ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు.
ఎస్పీ ఆర్. గంగాధరరావు ఫ్లెక్సీ ప్రింటర్స్ అసోసియేషన్ సభ్యులతో ప్రత్యేక సమావేశం బుధవారం నిర్వహించారు. పోలీస్ సూచనల ప్రకారం వివాదాస్పద, వ్యక్తిగత దూషణల ఫ్లెక్సీలు ముద్రించకూడదని, ఆర్డర్ ఇచ్చిన వారి పూర్తి వివరాలు నమోదు చేయాలిని సూచించారు. అసోసియేషన్ సభ్యులు చట్టపరంగా సహకరించి సమాజ శాంతికి కృషి చేయమని ప్రతిజ్ఞ చేసుకున్నారు.
☞ కృష్ణా: యూరియా పంపిణీని పరిశీలించిన కలెక్టర్.
☞ విజయవాడలో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా అరెస్ట్.
☞ కృష్ణా: పట్టిసీమకు పదేళ్లు పూర్తి.
☞ కృష్ణా జిల్లాలో ముగ్గురు ఏఎస్ఐలకు ఎస్ఐలుగా ప్రమోషన్.
☞ కృష్ణా: 11,12 తేదీల్లో కళా ఉత్సవ్ పోటీలు.
☞ కృష్ణా జిల్లా రైళ్లకు కొత్త స్టాపులు.
☞ విజయవాడలో ఈనెల 26న భారీ ఈవెంట్ ప్లాన్.
☞ కృష్ణా: రీవాల్యూషన్ నోటిఫికేషన్ విడుదల.
పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి పదేళ్లు పూర్తవుతున్న వేళ మరో మైలురాయిని చేరుకుంది. 2015లో ప్రారంభమై 89 రోజుల్లోనే 8.3 టీఎంసీల నీటిని కృష్ణా డెల్టాకు అందించి రైతుల ఊపిరిగా మారింది. ఆ తరువాత 2015-19లో 263 టీఎంసీలు, 2019-24లో 165 టీఎంసీలు, ఈ ఏడాది ఇప్పటి వరకు 11.05 టీఎంసీలు చేరాయి. మొత్తంగా 439 టీఎంసీలు మళ్లించిన ఈ పథకం డెల్టా రైతులకు ఆపద్బాంధవంగా నిలిచింది.
కృష్ణా జిల్లాలో యూరియా సరఫరా సక్రమంగా జరుగుతోందని కలెక్టర్ డీకే బాలాజీ స్పష్టం చేశారు. బుధవారం మధ్యాహ్నం చల్లపల్లి మండలం లక్ష్మీపురం పీఏసీఎస్ వద్ద యూరియా విక్రయాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. యూరియా సరఫరా, పొందిన రైతుల వివరాలను నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్ఐ కృష్ణమోహన్, ఏఓ కే.మురళీకృష్ణ, సొసైటీ సీఈఓ రమేశ్, వీఆర్ఓ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
కృష్ణా జిల్లాలో ముగ్గురు ఏఎస్ఐలకు ఎస్ఐగా పదోన్నతి లభించింది. 1989 బ్యాచ్‌కు చెందిన కేఏవీ ప్రసాదరావు, కె. గణేష్, కె. వెంకటేశ్వరరావులకు ఈ పదోన్నతి దక్కింది. వీరిని ఎస్పీ ఆర్. గంగాధరరావు ప్రత్యేకంగా అభినందించారు. పట్టుదల, నిబద్ధత, విధేయత కారణంగానే ఈ పదోన్నతి సాధ్యమైందని ఎస్పీ అన్నారు. పదోన్నతితో బాధ్యతలు మరింత పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.