Krishna

News April 6, 2025

పెనమలూరు: కలకలం రేపిన మహిళ అనుమానాస్పద మృతి  

image

యనమలకుదురు లంకలలో ఓ మహిళ మృతదేహం కనపడటం కలకలం రేపింది. శనివారం ఉదయం ముళ్లకంపల్లో గులాబీ చీర, జాకెట్‌లో ఆమె శవమై కనిపించింది. కళ్లు, ముక్కు, నోటి నుంచి రక్తస్రావం, మోచేతికి పచ్చబొట్టు ఉండటంతో అనుమానాలు పెరిగాయి. పోలీసులు కేసు నమోదు చేసి డాగ్ స్క్వాడ్‌తో విచారణ ప్రారంభించారు. ఎవరైనా అఘాయిత్యానికి పాల్పడ్డారా అనే అనుమానాలు వస్తున్నాయి. 

News April 6, 2025

కృష్ణా జిల్లాలో తగ్గిన చికెన్ ధరలు.!

image

కృష్ణా జిల్లాలో చికెన్ ధరలు గత వారంతో పోల్చుకుంటే కొంతమేర తగ్గాయి. ఆదివారం జిల్లాలోని గన్నవరం, ఉంగుటూరు, బాపులపాడు మండలాల్లో గత వారంలో కేజీ చికెన్ రూ.260లు ఉండగా, నేడు రూ.230కి తగ్గింది. పెద్దబాయిలేర్ రూ.230, చిన్న బాయిలర్ స్కిన్ లెస్ రూ.230, విత్ స్కిన్ రూ.220గా ఉన్నాయి. ధరలు తగ్గిన నేపథ్యంలో మాంసం దుకాణాల వద్ద కొనుగోలుదారుల సందడి నెలకొంది. మీ ఊరిలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయో.. COMMENT చేయండి. 

News April 6, 2025

VJA: గంజాయిపై ఉక్కు పాదం.. ఇద్దరి అరెస్ట్

image

గంజాయిపై విజయవాడ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. సెంట్రల్ ఏసీపీ దామోదర్ ఆధ్వర్యంలో గంజాయిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈ మేరకు చెన్నై వైపు గంజాయి తరలిస్తున్న కారును పటమట పోలీసులు సీజ్ చేశారు. ఈ కారులో నుంచి 80 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకొని, చిత్తూరుకు చెందిన షేక్ సాజిద్, షేక్ ఫయాజులను అరెస్టు చేసి శనివారం రిమాండ్‌కు తరలించామన్నారు.

News April 6, 2025

నేగు మచిలీపట్నంలో శ్రీరామ శోభాయాత్ర

image

శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా ఈనెల 6వ తేదీన మచిలీపట్నంలో శ్రీరామ శోభా యాత్రను నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు స్థానిక హిందూ కాలేజ్ నుంచి కోనేరు సెంటర్ వరకు నిర్వహించే ఈ శోభాయాత్రలో అశేష భక్తజనులు పాల్గొనున్నారు. శోభాయాత్ర కమిటీ ప్రతినిథులు ప్రజా ప్రతినిథులు, అధికారులు, నగర ప్రముఖులను స్వయంగా ఆహ్వానించారు. ఇందులో భాగంగా శనివారం కలెక్టర్ డీకే బాలాజీని కలిసి ఆహ్వానపత్రం అందజేశారు. 

News April 5, 2025

మచిలీపట్నం: పీజీ సెట్ కోసం KUలో సమాచార కేంద్రం

image

పీజీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌కు దరఖాస్తు చేసుకునే విద్యార్ధుల కోసం కృష్ణా విశ్వవిద్యాలయంలో సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ డా ఎల్. సుశీల తెలిపారు. పీజీ సెట్-2025కు సంబంధించిన నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. ఈనెల 2 నుంచి 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. 

News April 5, 2025

కృష్ణా: బాబు జగ్జీవన్ రామ్‌కి కలెక్టర్ నివాళి  

image

దేశానికి అపార సేవలందించిన మహా నాయకుడు బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు శుక్రవారం మచిలీపట్టణంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డీకే బాలాజీ, జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. బాబు జగ్జీవన్ రామ్ సామాజిక సమానత్వం కోసం చేసిన పోరాటం ప్రతి ఒక్కరికీ ప్రేరణగా నిలుస్తోందన్నారు. 

News April 5, 2025

మచిలీపట్నం: సద్గుణాలు కలిగిన మహోన్నత వ్యక్తి జగ్జీవన్ రామ్: ఎస్పీ

image

మానవ తావాదం, ఆదర్శవాదం వంటి సద్గుణాలు కలిగిన మహోన్నత వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ అని జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు అన్నారు. జగ్జీవన్ రామ్ 117వ జయంతిని జిల్లా ఎస్పీ క్యాంపు ఆఫీస్‌లో శనివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్పీ ఇతర పోలీస్ అధికారులతో కలిసి జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 

News April 5, 2025

మైలవరంలో ఒకరి ఆత్మహత్య

image

మైలవరంలో శుక్రవారం ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కథనం మేరకు.. దేవుని చెరువులో నివాసం ఉంటున్న వెంకటేశ్వరరావు భార్య, పిల్లల్ని వదిలేసి ఓ మహిళతో సహజీనవం చేస్తున్నాడు. ఆ మహిళ సాయంత్రం పని నుంచి ఇంటికి వచ్చే సరికి వెంకటేశ్వరరావు ఉరివేసుకొని కనిపించాడు. దీంతో పోలీసులుకు సమాచారం ఇవ్వగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News April 5, 2025

గన్నవరం: మహిళల్ని రక్షించబోయి మేస్త్రీ మృతి

image

గన్నవరం మండలం మాదలవారిగూడెంలో స్లాబ్ పనిలో విషాదం చోటుచేసుకుంది. ఆగిరిపల్లి చెందిన కాంక్రీట్ మేస్త్రీ పిల్లిబోయిన కొండలు (35) కూలీలతో కలిసి స్లాబ్ వేస్తున్నారు. ఆ సమయంలో సిమెంట్ తీసుకెళ్లె లిప్ట్ ఒక్కసారిగా తెగి కింద పడింది. అక్కడే మహిళల్ని తప్పించబోయి ఏడుకొండలు లిఫ్ట్ కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 5, 2025

కృష్ణా: వంశీ బెయిల్, కస్టడీ పిటిషన్‌లపై సోమవారం తీర్పు

image

గన్నవరం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్, కస్టడీ పిటిషన్‌లపై సోమవారం తీర్పు వెలువడనుంది. ఉంగుటూరు మండలం ఆత్కూరులో 8 ఎకరాల భూమి కబ్జా చేశారని వంశీపై కేసు నమోదు అయింది. వంశీని కస్టడీకి ఇవ్వాలన్న పోలీసుల పిటిషన్‌పై వాదనాలు పూర్తి అయ్యాయి. వంశీ బెయిల్, కస్టడీ పిటిషన్‌లపై సోమవారం కోర్టు తీర్పు వెలువరించనుంది.