Krishna

News August 5, 2025

మీకోసం కార్యక్రమంలో 30 ఫిర్యాదులు: ఎస్పీ

image

మచిలీపట్నం పోలీసు కార్యాలయంలో సోమవారం “మీకోసం” కార్యక్రమం జరిగింది. ఎస్పీ ఆర్. గంగాధరరావు, స్వయంగా పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 30 మంది ఫిర్యాది దారులు తమ సమస్యలను ఎస్పీకి తెలిపినట్లు పేర్కొన్నారు. కుటుంబ కలహాలు, భూ వివాదాలు, వేధింపులు తదితర సమస్యలపై ప్రజలు ఫిర్యాదు చేశారు. ప్రతి ఒక్కరి సమస్యను శ్రద్ధగా విన్న ఎస్పీ, సంబంధిత పోలీసు అధికారలను పరిష్కారానికి ఆదేశించారు.

News August 4, 2025

కృష్ణా: ‘CSR నిధులతో చేపట్టిన పనులు పూర్తి చేయండి’

image

జిల్లాలో సీఎస్ఆర్ నిధులతో చేపట్టిన మౌలిక సదుపాయాల పనులను వేగంగా పూర్తి చేయాలని జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ గీతాంజలి శర్మ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని ‘మీ కోసం’ హాల్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో సంబంధిత శాఖల అధికారులతో ఆమె సీఎస్ఆర్ పనుల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు త్వరితంగా లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

News August 4, 2025

కృష్ణా: ఆగస్టు 15 స్వాతంత్య్ర వేడుకలకు ఏర్పాట్లు ప్రారంభం

image

మచిలీపట్నం: జిల్లా స్థాయి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు అవసరమైన ఏర్పాట్లను తక్షణమే పూర్తి చేయాలని జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ గీతాంజలి శర్మ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం పీజీఆర్‌ఎస్‌ హాల్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు పోలీసు కవాతు మైదానంలో అన్ని అవసరమైన సౌకర్యాలను కల్పించాలన్నారు. శాఖలు త‌మ బాధ్యత‌ల‌ను సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు.

News August 4, 2025

జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి: గీతాంజలి శర్మ

image

అవనిగడ్డ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఈనెల 6వ తేదీన జరిగే మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ గీతాంజలి శర్మ కోరారు. 10వ తరగతి నుంచి పీజీ వరకు చదువుకున్న విద్యార్థులు పాల్గొనవచ్చునని తెలిపారు. వివిధ కంపెనీల ప్రతినిధులు ఈ జాబ్ మేళాలో పాల్గొంటారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ మేళా జరుగుతుందన్నారు.

News July 11, 2025

కృష్ణా: క్రియాశీలక రాజకీయాలకు నాని, వంశీ రెడీ

image

ఎన్నికల అనంతరం రాజకీయాలకు దూరంగా ఉన్న మాజీ MLAలు కొడాలి నాని, వల్లభనేని వంశీ తిరిగి రాజకీయంగా చురుగ్గా మారేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికల్లో YCP ఓటమి, వంశీ అరెస్ట్, నాని ఆరోగ్య సమస్యలు వంటి పరిణామాల నేపథ్యంలో ఈ ఇద్దరూ ప్రజల కంటపడకుండా ఉన్నారు. నాని కొన్ని సందర్భాల్లో మీడియా ముందుకు వచ్చినప్పటికీ, వంశీ పూర్తిగా మౌనంగా ఉన్నారు. గుడివాడలో జరగనున్న YCP సమావేశంతో వీరు రాజకీయ ఎంట్రీ ఇవ్వనున్నారు.

News July 11, 2025

కృష్ణా: అన్నదాత సుఖీభవ అర్హుల జాబితా ఇదే.!

image

అన్నదాతా సుఖీభవ-PM కిసాన్ పథకానికి అర్హుల జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. రైతులు తమ ఆధార్ నంబర్‌ను మన మిత్ర వాట్సాప్‌ 9552300009కు పంపి అర్హతను తెలుసుకోవచ్చు. పేరు లేకుంటే గ్రామ రైతు సేవా కేంద్రంలో అర్జీ, పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలి. పోర్టల్‌ గ్రీవెన్స్‌ మాడ్యూల్‌లో ఫిర్యాదు నమోదు చేయవచ్చు. ఈనెల 13వ తేదీ వరకు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. జిల్లాలో 3,44,029 రైతులు ఉండగా 1,35,881 అర్హత పొందారు.

News July 10, 2025

కృష్ణాజిల్లాలో టుడే టాప్ న్యూస్

image

☞ విజయవాడ అమ్మాయికి కాంస్య పతకం
☞కృష్ణా జిల్లా వ్యాప్తంగా పీటీఎం
☞ పామర్రు – భీమవరం హైవే( వీడియో)
☞ గన్నవరం: కుమారులని రక్షించాలంటూ పవన్ కళ్యాణ్‌కు వినతి
☞ గ్లోబల్ ఎకనామిక్ పవర్ హౌస్‌గా భారత్: గవర్నర్
☞ మచిలీపట్నంలో 11న జర్నలిస్టులకు వర్క్ షాప్
☞ పెనమలూరు: భార్య పుట్టింటికి వెళ్లిందని.. ఆత్మహత్య  
☞కృష్ణా: డిగ్రీ పరీక్షల టైం టేబుల్ విడుదల
☞ విజయవాడ: నేటితో ముగిసిన శాకంబరి ఉత్సవాలు

News July 10, 2025

గన్నవరం: కుమారులని రక్షించాలంటూ పవన్‌కి తల్లి వినతి

image

ఉద్యోగాల కోసం ఏజెంట్ చేతిలో మోసపోయి విదేశాల్లో మానవ అక్రమ రవాణా ముఠాల చెరలో ఉన్న తన ఇద్దరి కుమారులను రక్షించాలంటూ సూర్యకుమారి Dy.CM పవన్‌ని గన్నవరం ఎయిర్‌పోర్టులో గురువారం కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ ఘటనపై పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించారు. ఈ విషయాన్ని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లి, విదేశాల్లో ఉన్నవారిని తిరిగి రప్పిస్తానని అన్నారు.

News July 10, 2025

మచిలీపట్నం: 11న ‘వార్తాలాప్’ జర్నలిస్ట్‌లకు వర్క్‌ షాప్

image

ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీన మచిలీపట్నంలో జర్నలిస్టులకు ‘వార్తాలాప్’ మీడియా వర్క్ షాప్ నిర్వహించనున్నట్టు PIB డైరెక్టర్ రత్నాకర్ తెలిపారు. ఉదయం 10 గంటలకు వలందపాలెంలోని G కన్వెన్షన్‌లో నిర్వహించే ఈ వర్క్ షాప్‌కు మంత్రి కొల్లు రవీంద్ర, కలెక్టర్ బాలాజీ ముఖ్య అతిథులుగా పాల్గొంటారన్నారు. జిల్లాలోని జర్నలిస్టులు ఈ వర్క్ షాప్‌లో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

News July 10, 2025

కృష్ణా: గుర్తింపు లేని పార్టీలకు ఈసీ షోకాజ్ నోటీసులు

image

ఆరు సంవత్సరాలుగా ఒక్క ఎన్నికలోనూ పోటీ చేయని గుర్తింపు లేని రాజకీయ పార్టీలకు భారత ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కృష్ణాజిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డీ.కే. బాలజీ ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. చట్టబద్ధంగా నమోదై, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనని ఈ పార్టీలపై తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు కలెక్టర్ వివరించారు.