India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మంత్రాలయం మండల కేంద్రానికి చెందిన నరసింహులు పట్టు వదలని విక్రమార్కుడిలా సాధన చేసి తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీలో ఉద్యోగం సంపాదించాడు. నరసింహులు ఒకవైపు ప్రైవేటుగా చేస్తూ మరో వైపు 11 సంవత్సరాలుగా సాధన చేస్తూ ఉద్యోగం సంపాదించాడు. 2014, 2018 డీఎస్సీ పరీక్ష రాయగా స్వల్ప మార్కుల తేడాతో మిస్సయ్యాడు. అయినా కూడా పట్టు వదలకుండా సాధన చేసి 48వ ర్యాంకుతో పీఈటీగా ఎంపికయ్యాడు.
కర్నూలు నగర ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే నగరపాలక సంస్థ ప్రధాన లక్ష్యమని, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందడుగులు వేస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ అన్నారు. శుక్రవారం స్థానిక ఎస్బీఐ ఎంప్లాయిస్ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో “ఓపెన్ ఫోరం” కార్యక్రమం నిర్వహించారు. వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు పౌరులు ఎల్‌ఆర్‌యస్, నిర్మాణ అనుమతులు, అక్రమ నిర్మాణాలపై అర్జీలు సమర్పించారు.
ఆదోనిలో నేడు జరగనున్న గణేష్ నిమజ్జనోత్సవాన్ని ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా SP విక్రాంత్ పాటిల్ సూచించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. 1000 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నామని అన్నారు. నిమజ్జనం కార్యక్రమం అంతా డ్రోన్, బాడి ఓన్ కెమెరాలు, సీసీ కెమెరాలు, విడియో కెమెరాలతో చిత్రికీరణ ఉంటుందన్నారు. బందోబస్తు విధుల్లో ఇద్దరు అడిషనల్ SPలు, ఐదుగురు DSPలు ఉంటారు.
ఆదోని పట్టణంలో ఆదివారం జరిగే వినాయక నిమజ్జనానికి భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని కర్నూలు జిల్లా అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా తెలిపారు. శనివారం ఆదోని టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో DSP హేమలత ఆధ్వర్యంలో సూచనలు చేశారు. ఉదయం నిమజ్జనాన్ని త్వరగా ప్రారంభించి చీకటి పడేలోగా శోభయాత్ర ముగిసేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. డీఎస్పీలు, సీఐలు పోలీసులు సుమారుగా 1000 మందికి పైగా బందోబస్తులో ఉంటారన్నారు.
కర్నూలు జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డిని మరో పదవి వరించింది. కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్తగా నియమితులయ్యారు. మాజీ సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. గత ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ MLA అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన విశ్రాంత ఐఏఎస్ అధికారి ఏఎండీ ఇంతియాజ్ రాజకీయాలకు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే.
ఈ-చలాన్ పేరుతో వచ్చే లింకును తొందరపడి క్లిక్ చేయవద్దని ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. వివిధ సామాజిక మాధ్యమాల్లో ఆర్టీఓ చలాన్, ట్రాఫిక్ చలాన్, పీఎం కిసాన్ పేరుతో APK ఫైల్స్ వస్తున్నాయన్నారు. వాటి లింకులను క్లిక్ చేసి, డౌన్లోడ్ చేసుకునే వారి ఫోన్లో రహస్య సమాచారాన్ని సైబర్ నేరగాళ్లు చోరీ చేసే ప్రమాదం ఉందని అన్నారు. సైబర్ నేరాల పట్ల ఫిర్యాదు చేయడానికి 1930కి కాల్ చేయాలని సూచించారు.
కర్నూలు జిల్లా ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కర్నూల్ అవుట్డోర్ స్టేడియంలో ఉన్న మేజర్ ధ్యాన్‌చంద్ కాంస్య విగ్రహానికి ఒలింపిక్ సంఘం సీఈవో విజయ్ కుమార్, డీఎస్డీఓ భూపతి రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ధ్యాన్‌చంద్ సేవలను వారు కొనియాడారు. క్రీడా సంఘాల ప్రతినిధులు శ్రీనివాసులు, డాక్టర్ రుద్ర రెడ్డి, సునీల్ కుమార్, అవినాష్, సతీశ్ పాల్గొన్నారు.
కర్నూలు శివారులోని జగన్నాథ గట్టుపైకి వెళ్లే ప్రేమికులను బెదిరించి డబ్బు, చైన్లు లాక్కుంటున్న నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నగరానికి చెందిన నాగేంద్రుడు, రమేశ్, మాలిక్ బాషాలను అరెస్ట్ చేసినట్లు సీఐ విక్రమ సింహ వెల్లడించారు. ఈ నెల 19న వచ్చిన ఫిర్యాదుపై విచారణ చేసి నిందితులను అదుపులోకి తీసున్నామని చెప్పారు. వారి నుంచి రూ10,500 నగదు, కత్తి, స్కూటీ, కారు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
Way2News కథనానికి సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ స్పందించారు. బుధవారం ‘ఆదోనిలో వైరల్ ఫీవర్లు.. హాస్పిటల్లో <<17531451>>రోగుల ఇబ్బందులు<<>>’ శీర్షికతో కథనం వెలువడింది. స్పందించిన సబ్ కలెక్టర్ ఇవాళ జనరల్ ఆస్పత్రిని సందర్శించారు. వార్డుల్లో కలియతిరిగి రోగుల సమస్యలపై ఆరా తీశారు. వైద్యులు సరైన వైద్యం అందిస్తున్నారా, లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో సిబ్బంది కొరతను తీర్చి, ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామన్నారు.
డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ గురువారం కర్నూలు DEO శామ్యూల్ పాల్ అధ్యక్షతన ప్రారంభమైంది. రాయలసీమ యూనివర్సిటీలో జరుగుతున్న కౌన్సిలింగ్ ప్రక్రియను రాష్ట్ర విద్యాశాఖ అధికారులతో కలిసి జాయింట్ కలెక్టర్ నవ్య పరిశీలించారు. కౌన్సెలింగ్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన సౌకర్యాల గురించి అభ్యర్థులను అడిగి తెలుసుకున్నారు.
Sorry, no posts matched your criteria.