India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఈ నెల 28 నుంచి డీఎస్సీ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ మొదలవుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 2,600 మంది అభ్యర్థుల కౌన్సిలింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. ఈ కార్యక్రమం కోసం మూడు ప్రాంతాలలో 54 బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు.
హైదరాబాద్‌లో జరిగిన హాఫ్ మారథాన్ రన్ రేస్‌లో కర్నూలు నగరానికి చెందిన హిమబిందు ప్రతిభ కనబరిచారు. మూడు ప్రధాన ఫ్లైఓవర్ల మీదుగా 21 కిలోమీటర్లు పరిగెత్తి, కేవలం 2 గంటల 53 నిమిషాల్లోనే పూర్తి చేశారు. హిమబిందు విజయంతో జిల్లాలోని క్రీడాభిమానులు, క్రీడాసంఘ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. హిమబిందు ప్రదర్శన నేటి యువతరానికి స్ఫూర్తిదాయకమని వారు అభినందించారు.
క్రిష్ణగిరి మండలంలోని మారుమూల గ్రామం బి.ఎర్రబాడులో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన కలుగొట్ల మల్లికార్జున ఎస్జీటీ టీచర్ ఉద్యోగం పొందగా, ఆయన అబ్బాయి కలుగొట్ల మంజునాథ్ ఇండియన్ పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం సాధించారు. తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. ఇద్దరికీ ప్రభుత్వ ఉద్యోగాలు రావడంతో గ్రామస్థులు అభినందనలు తెలిపారు.
రేపటి రోజు జరగాల్సిన DSC-2025 సర్టిఫికెట్ వెరిఫికేషన్ వాయిదా వేయడం జరిగిందని రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ ఒక ప్రకటనలో తెలిపారు. తదుపరి వెరిఫికేషన్ తేదీనీ రాష్ట్ర విద్యాశాఖ అనుమతుల మేరకు ప్రకటించడం జరుగుతుందని వెల్లడించారు. డీఎస్సీ అభ్యర్థులు కీలక మార్పును గమనించి సహకరించాలని కోరారు.
దేవనకొండ మండలం తెర్నేకల్ గ్రామానికి చెందిన 21 మంది డీఎస్పీ మెరిట్ లిస్టులో అర్హత సాధించారు. వీరిలో 17 మంది ఎస్జీటీ పోస్టులు, ఒకరు పీఈటీ, మరో ముగ్గురు స్కూల్ అసిస్టెంట్లు ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. వీరిని గ్రామస్థులు అభినందించారు. తమ తల్లిదండ్రులు కష్టపడి చదివించారని, వారి కష్టం వృథా కాలేదని వారు పేర్కొన్నారు.
జిల్లాలోని పెద్దకడబూరుకు చెందిన శివప్రసాద్ DSCలో పట్టు విడువని విక్రమార్కుడిలా పోరాడాడు. DSC ఎస్జీటీలో 83.43 మార్కులతో టీచర్ పోస్ట్‌లు అర్హత సాధించాడు. గతంలో జరిగిన ప్రతి DSCలో ఒకటి, అర మార్కులతో ఎస్జీటీ పోస్టు చేయి జారినా నిరుత్సాహపడలేదు. 2025 DSC ఇక తనకు చివరిదిగా భావించి రాత్రింబవళ్లు కష్టపడి ఎస్జీటీ పోస్టుకు ఎంపికై తన చిరకాల కలను సాధించాడు.
బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా కర్నూలుకు చెందిన గీతా మాధురిని నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు పీఎన్వీ మాధవ్ ఉత్తర్వులు జారీ చేశారు. గీతా మాధురి పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేశారు. గతంలో మహిళా మోర్చా కర్నూలు జిల్లా అధ్యక్షురాలిగా పనిచేశారు. ఫిలిం సెన్సార్ బోర్డు మెంబర్‌గా కూడా పనిచేసిన అనుభవం ఆమెకు ఉంది.
గూడూరుకు చెందిన వడ్ల రామాంజనేయులు, సరస్వతి దంపతుల కుమారులు(కవలలు) రవితేజ ఆచారి, విష్ణు వర్ధన ఆచారి డీఎస్సీలో ఉత్తీర్ణులై టీచర్ ఉద్యోగాలు పొందారు. రవితేజ ఆచారి 83 మార్కులు, విష్ణు వర్ధన ఆచారి 82 మార్కులు సాధించారు. తమ కుమారులు ఎస్జీటీ విభాగంలో ఉద్యోగాలు సాధించారని తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. పలువురు వారిని అభినందించారు.
కల్లూరు మండలం ఉలిందకొండ గ్రామానికి చెందిన మన్సూర్ బాషా, జిలాని బేగం దంపతులకు చెందిన ముగ్గురు పిల్లలు డీఎస్పీ మెరిట్ లిస్టులో ఉద్యోగాలు సాధించారు. మొహమ్మద్ హనీఫ్ 79.67, హసీనా బాను 81.62, హరూన్ రషీద్ 84.11 మార్కులతో ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. వీరిని గ్రామస్థులు అభినందించారు. తమ తల్లిదండ్రులు కష్టపడి చదివించారని, వారి కష్టం వృథా కాలేదని పిల్లలు పేర్కొన్నారు.
ఈనెల 27 నుంచి ప్రారంభం కానున్న గణేశ్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ శనివారం వెల్లడించారు. గణేశ్ మండపాలకు, ఊరేగింపులకు సింగిల్ విండో విధానంలో నిర్వాహకులు అనుమతులు తీసుకోవాలన్నారు. మండపాల వద్ద ఒకరిని కాపలా ఉంచాలని, సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. విపరీతమైన డీజే సౌండ్‌లను అనుమతించబోమని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.