India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తుగ్గలి మండలం గుత్తి ఎర్రగుడి గ్రామానికి చెందిన బొల్లుం లావణ్య డీఎస్సీ మెరిట్ లిస్టులో 94.53202 మార్కులతో జిల్లా మొదటి ర్యాంక్ సాధించి టీచర్ ఉద్యోగం పొందారు. ఇష్టపడి చదివిన ఫలితమే ఈ విజయమని లావణ్య అన్నారు. మాజీ సర్పంచ్ వెంకటస్వామి, వైస్ ఎంపీపీ చంద్రశేఖర్ యాదవ్, గ్రామస్థులు ఆమె ప్రతిభను కొనియాడి అభినందించారు.
స్వాతంత్ర్య సమరయోధుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి, ప్రజల కోసం నిరంతరం శ్రమించిన యోధుడు టంగుటూరి ప్రకాశం పంతులు అని ఏఎస్పీ హుస్సేన్ పీరా అన్నారు. శనివారం ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలో టంగుటూరి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. ఆయన నిస్వార్థ సేవలు కొనసాగిద్దామని పిలుపునిచ్చారు.
కౌతాళం మం. నదిచాగి గ్రామానికి చెందిన 8 మంది ఉపాధ్యాయ నియామక పరీక్షల్లో ప్రతిభ కనబరిచారు. హైస్కూల్ కేటగిరిలో వడ్డే నాగరాజు కన్నడ సబ్జెక్ట్‌లో కర్నూలు జిల్లా రెండో ర్యాంక్, తాలూరు స్వాతి సోషల్‌లో జిల్లా ప్రథమ ర్యాంక్ కైవసం చేసుకున్నారు. టి.మంజుశ్రీ మ్యాథ్స్‌లో రాణించారు. అలాగే SGT విభాగంలో కె.కావ్య జిల్లా మూడో ర్యాంక్ సాధించారు. రణ్ రాజ్, రాంతుల్ల, విజయ కుమార్, వైశాఖ శెట్టి సైతం ఉద్యోగాలు పొందారు.
భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా కర్నూలు జిల్లాకు చెందిన సునీల్ రెడ్డిని నియమిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీఎన్‌వీ మాధవ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థి దశ నుంచే సునీల్ రెడ్డి ఏబీవీపీలో క్రియాశీలకంగా పనిచేసి అనేక పోరాటాలను చేశారు. సునీల్ రెడ్డి నియామకం పట్ల జిల్లా నాయకులు హర్షం వ్యక్తం చేశారు. నిజమైన కార్యకర్తలకు పార్టీలో మంచి స్థానం ఉంటుందని అన్నారు.
జిల్లా పారిశ్రామికంగా గణనీయమైన ప్రగతి సాధిస్తోందని కలెక్టర్ పి.రంజిత్ బాషా పేర్కొన్నారు. శుక్రవారం కర్నూలు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్-2024కు సంబంధించి పరిశ్రమల యాజమాన్యాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటోందన్నారు.
ఈనెల 23న నిర్వహించే స్వచ్ఛంద్ర-స్వర్ణాంధ్రలో ‘మాన్సూన్ హైజీన్’ థీమ్‌తో నిర్వహించే కార్యక్రమంలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను కలెక్టర్ పి.రంజిత్ బాషా ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో డ్వామా, డీపీఓ అధికారులతో సమావేశం నిర్వహించారు. పారిశుద్ధ్యంలో మెరుగైన ఫలితాలు సాధించిన అధికారులకు అక్టోబర్ 2న గాంధీ జయంతి నాడు అవార్డులు ప్రదానం చేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.
కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ పరిధిలో జిల్లా స్థాయిలో 5 సూచికలు, మండల స్థాయిలో 18 అభివృద్ధి సూచికలు ఉన్నాయని, వీటి ప్రగతిని ప్రోగ్రాం అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని డీఎంహెచ్ఓ డా.శాంతి కళ ఆదేశించారు. శుక్రవారం కర్నూలు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. 2047 నాటికి ‘ఆనంద ఆంధ్రప్రదేశ్’ లక్ష్యాలను సాధించేందుకు పనిచేద్దామన్నారు.
సివిల్, APSP కానిస్టేబుళ్లుగా ఎంపికైన అభ్యర్థులు ఈనెల 25, 26వ తేదీలలో కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో ఉదయం 10 గంటలకు హాజరు కావాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ కోరారు. సెలక్షన్ ప్రక్రియలో అప్లికేషన్‌తో జతపర్చిన అన్ని ధ్రువపత్రాల ఒరిజినల్ సర్టిఫికెట్స్, Annexure-I (Revised Attestation Form) గెజిటెడ్ అధికారితో అటెస్టేషన్ చేయించిన 3 సెట్ల జిరాక్స్ కాపీలు, 4 పాస్‌పోర్టు సైజ్ ఫొటోలను తీసుకుని రావాలన్నారు.
కర్నూలు జిల్లాలో ఈనెల 27 నుంచి ప్రారంభమయ్యే వినాయక ఉత్సవాలను పురస్కరించుకొని విగ్రహ మండపాలకు పోలీసుల అనుమతి తప్పనిసరి తీసుకోవాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ వెల్లడించారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. మండపాల నిర్వాహకులు పోలీస్ స్టేషన్లకు రావాల్సిన అవసరం లేదని, వివరాలను https://ganeshutsav. వెబ్ సైట్‌లో నమోదు చేయాలని సూచించారు.
వెల్దుర్తి మండలం బొమ్మిరెడ్డిపల్లె గ్రామ రైతు సేవా కేంద్రాన్ని గురువారం కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. రికార్డులు తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామంలో రైతులకు యూరియా ఎంతమందికి పంపిణీ చేశారో అడిగి తెలుసుకున్నారు. మండలానికి ఇంకా 300 బస్తాల యూరియా అవసరం అని మండల వ్యవసాయ అధికార అక్బర్ బాషా తెలపగా.. సరఫరా చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.
Sorry, no posts matched your criteria.