Kurnool

News April 2, 2026

ప్రభుత్వ ఆస్పత్రి ప్రసవాల్లో కర్నూలు జిల్లాకు అగ్రస్థానం

image

ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యధిక ప్రసవాలు నిర్వహించి కర్నూలు జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానం సాధించిందని కలెక్టర్ డా.ఏ.సిరి తెలిపారు. 2025 ఏప్రిల్ నుంచి 2026 ఫిబ్రవరి వరకు 5,500 ప్రసవాల లక్ష్యం కాగా, 145 శాతంతో 7,982 ప్రసవాలు జరిగాయని పేర్కొన్నారు. లక్ష్యానికి మించి సేవలందించడంలో జిల్లా టాప్‌లో నిలిచిందన్నారు. మెరుగైన వైద్య సేవలు అందడం వల్లే ఈ రికార్డు సాధ్యమైందని ఆమె వివరించారు.

News April 2, 2026

కర్నూలు: పరీక్షలు రద్దు

image

రికార్డ్ అసిస్టెంట్-1, ఫ్రంట్ ఆఫీస్ కో-ఆర్డినేటర్-1 పోస్టులకు ఈ ఏడాది ఫిబ్రవరి 18న నిర్వహించిన రాత పరీక్షలను హైకోర్టు ఆదేశాల మేరకు రద్దు చేస్తున్నట్లు కర్నూలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులుడు జి.కబర్థి తెలిపారు. త్వరలో మళ్లి రాత పరీక్షల తేదీని ప్రకటిస్తామని పేర్కొన్నారు. త్వరలో జిల్లా కోర్టు వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని చెప్పారు.

News April 2, 2026

కర్నూలు ఇక నుంచి 68 డివిజన్లు

image

52 డివిజన్లకు పరిమితమైన కర్నూలు నగరపాలక సంస్థకు మరో 16 డివిజన్లు అదనంగా పెంచారు. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తంగా 68 డివిజన్లుగా మార్పు చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఈ సందర్భంగా కార్పొరేటర్ కావాలనుకుంటున్న అన్ని రాజకీయ పార్టీలోని ఆశావాహులకు ఇదో చక్కటి అవకాశంగా పలువురు అభివర్ణిస్తున్నారు.

News April 1, 2026

మున్సిపాలిటీలలో కౌన్సిలర్ స్థానాల పెంపు

image

రాష్ట్ర మున్సిపల్ పరిపాలన శాఖ ఉత్తర్వుల మేరకు కొన్ని మున్సిపాలిటీల్లో కౌన్సిలర్ స్థానాలు పెంచారు. ఆదోనిలో 42 స్థానాల నుంచి 52, గూడూరులో 20 నుంచి 23, ఎమ్మిగనూరులో 35 నుంచి 44, డోన్‌లో 32 నుంచి 36కు పెరిగాయి. జనాభా పెరుగుదల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల కోసం వార్డుల పునర్విభజన చేపట్టనున్నారు. మున్సిపల్ పరిపాలన కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.

News April 1, 2026

అమ‌రావ‌తి ఆంధ్ర‌ప్ర‌దేశ్ క‌ల‌: మంత్రి టీజీ

image

అమ‌రావ‌తి అనేది కేవ‌లం రాజ‌ధాని కాద‌ని, ఇది ఆంధ్ర‌ప్ర‌దేశ్ క‌ల అని మంత్రి టీజీ భ‌ర‌త్ గుప్తా అన్నారు. ఈ మేర‌కు ఆయ‌న ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. అమ‌రావ‌తికి చ‌ట్ట‌బ‌ద్ద‌త బిల్లును లోక్‌స‌భ ఆమోదించ‌డం శుభ ప‌రిణామం అన్నారు. ఇక రాజ‌ధానిగా అమ‌రావ‌తిని ఎవ్వ‌రూ క‌దిలించ‌లేర‌న్నారు. ఒకే రాజ‌ధాని అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ కూటమి ప్ర‌భుత్వ ధ్యేయ‌మ‌ని తెలిపారు.

News April 1, 2026

పరిశ్రమల ప్రోత్సాహానికి చర్యలు వేగవంతం చేయాలి: కలెక్టర్

image

జిల్లాలో కొత్త పరిశ్రమల స్థాపనకు వేగవంతంగా అనుమతులు ఇవ్వాలని, పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం కల్పించాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధికారులకు సూచించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో కలెక్టర్ అధ్యక్షతన డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ అండ్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఎంఎస్ఎంఈల అభివృద్ధి, ఎగుమతుల ప్రోత్సాహంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు.

ఈ నెల 5న బేస్ బాల్ ఎంపిక పోటీలు

image

ఈనెల 5న కర్నూలు అవుట్డోర్ స్టేడియంలో జిల్లా స్థాయి సబ్ జూనియర్ బాలబాలికల బేస్ బాల్ ఎంపిక పోటీలను నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు రమణయ్య తెలిపారు. 01/01/2010 తరువాత జన్మించిన క్రీడాకారులు అర్హులన్నారు. జిల్లా స్థాయికి ఎంపికైన క్రీడాకారులు మే మొదటి వారం కర్నూలు జిల్లాలో జరగబోయే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. వివరాలకు 9010775080 నంబర్‌కు సంప్రదించవచ్చు అన్నారు.