Kurnool

News April 1, 2026

రాయలసీమ యూనివర్సిటీకి NAAC లక్ష్యం: వీసీ

image

వచ్చే విద్యా సంవత్సరానికల్లా రాయలసీమ యూనివర్సిటీ NAAC అక్రిడిటేషన్ సాధించాల్సిన అవసరం ఉందని వీసీ ఆచార్య వీ.వెంకట బసవరావు పేర్కొన్నారు. IQAC ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన సమీక్షలో అకడమిక్, అడ్మినిస్ట్రేటివ్ సమాచారాన్ని క్రమపద్ధతిలో సేకరించి ఆధారాలతో అప్లోడ్ చేయాలని సూచించారు. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తే ఉత్తమ ర్యాంక్ సాధ్యమేనని వీసీ అభిప్రాయపడ్డారు.

News March 31, 2026

ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

image

వాహనదారులు రోడ్డుపై భద్రతా ప్రమాణాలు పాటించేలా సంబంధిత అధికారులు అవగాహన కల్పించాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అన్నారు. మంగళవారం కర్నూలు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశాన్ని ఎస్పీ విక్రాంత్ పాటిల్‌తో కలిసి నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రహదారిపై ప్రమాదాలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

News March 31, 2026

కర్నూలు చేరుకున్న మంత్రి నిమ్మల రామానాయుడు

image

జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి నిమ్మల రామానాయుడు మంగళవారం కర్నూలు చేరుకున్నారు. స్టేట్ గెస్ట్ హౌస్‌లో మంత్రి టీజీ భరత్, కలెక్టర్ సిరి, ఎస్పీ, ప్రజాప్రతినిధులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన, గెస్ట్ హౌస్ నుంచి నేరుగా కలెక్టరేట్ సమావేశానికి పయనమయ్యారు. జిల్లా అభివృద్ధి, స్థానిక సమస్యలపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించనున్నారు.

News March 31, 2026

కర్నూలు చేరుకున్న మంత్రి నిమ్మల రామానాయుడు

image

జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి నిమ్మల రామానాయుడు మంగళవారం కర్నూలు చేరుకున్నారు. స్టేట్ గెస్ట్ హౌస్‌లో మంత్రి టీజీ భరత్, కలెక్టర్ సిరి, ఎస్పీ, ప్రజాప్రతినిధులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన, గెస్ట్ హౌస్ నుంచి నేరుగా కలెక్టరేట్ సమావేశానికి పయనమయ్యారు. జిల్లా అభివృద్ధి, స్థానిక సమస్యలపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించనున్నారు.

News March 30, 2026

కర్నూల్: పోలీస్ ప్రజా ఫిర్యాదుల వేదికకు 98 వినతులు

image

కర్నూల్ ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు జిల్లావ్యాప్తంగా 98 వినతులు అందాయి. ఉద్యోగాల పేరిట మోసాలు, ఆర్థిక వివాదాలు, కుటుంబ సమస్యలపై ప్రజలు మొరపెట్టుకున్నారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ.. ఫిర్యాదులపై చట్టప్రకారం విచారణ జరిపి బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు.

News March 30, 2026

కర్నూల్: పీజీఆర్ఎస్‌లో డీఆర్‌వో వినతుల స్వీకరణ

image

ప్రజల ఫిర్యాదులను నాణ్యతతో, వేగవంతంగా పరిష్కరించాలని డీఆర్‌వో సి.వెంకట నారాయణమ్మ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ప్రజల వినతులు స్వీకరించి, పెండింగ్ లేకుండా వెంటనే పరిష్కరించాలని సూచించారు. రీ-ఓపెన్ అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అనురాధ తదితరులు పాల్గొన్నారు.

News March 30, 2026

దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు: కలెక్టర్ సిరి

image

వేసవిలో ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజల దాహార్తిని తీర్చేందుకు కర్నూలులోని కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కేంద్రంలో తాగునీరు, చల్లని మజ్జిగను నిరంతరం అందుబాటులో ఉంచుతామని ఆమె తెలిపారు. వడదెబ్బ నివారణకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రధాన ప్రాంతాల్లో మరిన్ని చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆమె ఆదేశించారు.

News March 30, 2026

కర్నూలు: ఆస్తి కోసం తండ్రిని చంపిన కొడుకు

image

కర్నూలు జిల్లా కౌతాళం మండలం కుంటనహాల్ గ్రామంలో ఆస్తి కోసం కన్నకొడుకే తండ్రిని హతమార్చాడు. స్థానికుల వివరాల మేరకు.. నానేసాబ్ రెండో భార్య గర్భవతి కావడంతో, పుట్టబోయే బిడ్డకు ఆస్తిలో వాటా వెళ్తుందనే భయంతో మొదటి భార్య కుమారుడు నూర్ సాబ్ ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. ఆదివారం రాత్రి నానేసాబ్‌ను కత్తితో పొడిచి చంపేశాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 30, 2026

కర్నూలులో 23 తులాల బంగారం చోరీ

image

కర్నూలు నాలుగో పట్టణ పరిధిలోని అమీన్ అబ్బాస్ నగర్‌లో భారీ చోరీ జరిగింది. ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లిన వృద్ధ దంపతుల నివాసంలోకి దొంగలు చొరబడి సుమారు 23 తులాల బంగారు నగలు ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి క్లూస్ టీం సాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సీఐ విక్రమ్ సింహ తెలిపారు.

News March 30, 2026

కర్నూలు జిల్లాకు ప్రభుత్వం మొండిచేయి

image

2024-25 ఆర్థిక సంవత్సరానికి కర్నూలు(D)లో 9 మండలాలను కరవు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించింది. ఆస్పరి, కల్లూరు, కర్నూలు రూరల్, అర్బన్, మద్దికేర, ఓర్వకల్లు, గూడూరు, కోడుమూరు, వెల్దుర్తి మండలాలు ఆ జాబితాలో ఉన్నాయి. అయితే మంత్రాలయం నియోజకవర్గంలో ఒక్క మండలం కూడా లేకపోవడం, ఆలూరు నియోజకవర్గంలో 6 మండలాల్లో ఆస్పరి మాత్రమే ఉండటం, ఆదోని నియోజకవర్గంలో ఒక్క మండలాన్నీ చేర్చకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.