India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కర్నూలు జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 83 ప్రజా ఫిర్యాదులను చట్టపరంగా విచారణ చేసి బాధితులకు న్యాయం చేస్తామని జిల్లా SP విక్రాంత్ పాటిల్ స్పష్టం చేశారు. సోమవారం కర్నూలులోని కొత్తపేట వద్ద ఉన్న ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించారు. ఎస్పీ పాల్గొని ఫిర్యాదులను స్వీకరించారు. బాధితులతో మాట్లాడి న్యాయంచేస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు.
ఆదోనిలో సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఆధ్వర్యంలో సోమవారం “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (PGPRS) జరిగింది. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. అధికంగా భూ సమస్యలపై వినతులు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు సూచనలు ఇచ్చారు. నిర్ణీత గడువులోపు సమస్యలు పరిష్కరించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్ కొత్త బార్ పాలసీ 2025 – 28 లాటరీ / డ్రా ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తూ జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా సోమవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. కర్నూలు కలెక్టరేట్ వేదికగా ఆయన దరఖాస్తులను ఆహ్వానించారు. ఈ నెల 18 – 26 వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుందన్నారు. ఈనెల 25వ తేదీన జిల్లా పరిషత్ కార్యాలయంలో లాటరీ తీసి లైసెన్స్ మంజూరు చేస్తామన్నారు.
భారీ వర్షాల దృష్ట్యా కర్నూలు జిల్లాలో నేడు పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు డీఈవో శామ్యూల్ పాల్ తెలిపారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా కలెక్టర్ రంజిత్ భాషా ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ఇచ్చినట్లు వెల్లడించారు. >Share it
నేరాలకు స్వస్తి పలకాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. ఆదివారం ఎస్పీ ఆదేశాల మేరకు కర్నూల్‌లోని వివిధ పోలీస్ స్టేషన్‌లలో పోలీసులు రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో సహకరించాలన్నారు. నేర ప్రవృత్తిని విడాలన్నారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు తప్పవన్నారు.
కర్నూలు జిల్లాకు ‘కోట్ల’ పేరు పెట్టాలని కర్నూల్ పార్లమెంట్ తెలుగు యువత కార్యదర్శి చరణ్ డిమాండ్ చేశారు. గూడూరులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి 105వ జయంతి వేడుకలు నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పులమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రజల కోసం నిరంతరం సేవ చేసి మచ్చలేని నాయకుడిగా గుర్తింపు పొందిన వ్యక్తి కోట్ల అని కొనియాడారు.
కర్నూలు జిల్లా ప్రజలకు సాగు, తాగునీటిని అందిస్తున్న తుంగభద్ర జలాశయంలో మరో 7 గేట్లు (4, 11, 18, 20, 24, 27, 28) పనిచేయడం లేదని ఇంజినీర్లు గుర్తించారు. ఇప్పటికే 19వ గేటు గతేడాది దెబ్బతింది. దీంతో జలాశయం 33 గేట్లను మార్చే పనులు జరుగుతున్నాయి. ప్రస్తుత వరద ప్రవాహం 23 వేల క్యూసెక్కులు కాగా, 3 గేట్లద్వారా 9 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
కర్నూలు జిల్లాలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభమైంది. ఆదోనిలో సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, టీడీపీ నేత మీనాక్షి నాయుడు, కూటమి నేతలు ఉచిత బస్సులను ప్రారంభించారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో.. ఆధార్, రేషన్ కార్డు, ఓటర్ ఐడీలలో ఏదో ఒకటి చూపించి మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ప్రయాణించొచ్చని తెలిపారు.
జిల్లా సమగ్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేద్దామని మంత్రి టీజీ భరత్ అన్నారు. 79వ స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా కర్నూలులోని జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో కలెక్టర్ పి.రంజిత్ బాషా, ఎస్పీతో కలిసి జాతీయ జెండాని ఎగరేశారు. అనంతరం వివిధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. కర్నూలు జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని అన్నారు.
కర్నూలు మండలం పంచలింగాలలో పలు ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకల్లో ఎంపీ బస్తిపాటి నాగరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జాతీయ జెండాను ఎగురవేశారు. ఆయన మాట్లాడుతూ.. మహిళ సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. విద్యార్థుల సంక్షేమం కోసం మంత్రి లోకేశ్ నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు.
Sorry, no posts matched your criteria.