India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు సాంకేతిక నైపుణ్యం అందిస్తే ఏ దేశంలో అయినా ఉపాధి అవకాశాలు లభిస్తాయని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అన్నారు. బుధవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో ‘స్కూలింగ్ బిల్డింగ్ బ్లాక్స్’ అంశంపై జిల్లా స్థాయి వర్క్‌షాప్‌లో డీఈఓ శామ్యూల్ పాల్‌తో కలిసి పాల్గొన్నారు. వికసిత్ భారత్ @2047 లక్ష్యాన్ని సాధించేందుకు విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలన్నారు.
జిల్లాలో అధికంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అప్రమత్తం ఉండాలని అధికార యంత్రాంగాన్ని కలెక్టర్ పి.రంజిత్ బాషా ఆదేశించారు. జిల్లాలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై సబ్ కలెక్టర్, ఆర్డీవోలు, తహశీల్దార్లు, ఎంపీడీఓలు, ఇరిగేషన్ అధికారులతో ఆయన బుధవారం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో రెండు మూడు రోజులుగా అధిక వర్షపాతం నమోదయిందన్నారు.
ఎమ్మిగనూరు మండలం కోటేకల్ సమీపంలో వేగంగా వెళ్తున్న బుల్లెట్ బైక్ అదుపుతప్పి ఓ వ్యక్తి మృతిచెందాడు. స్థానికుల వివరాల మేరకు.. ఆదోనికి చెందిన లక్ష్మన్న ఎమ్మిగనూరులో పెళ్లికి వచ్చి తిరిగి వెళ్తుండగా బుధవారం వేకువజామున కోటేకల్-ఆరేకల్ గ్రామాల మధ్యలో ఉన్న కోళ్లఫారం దగ్గర బైక్ అదుపు తప్పింది. పక్కనే ఉన్న కరెంట్ స్తంభాన్ని ఢీకొని అక్కడికక్కడే మృతిచెందాడు.
స్వాతంత్ర్య స్ఫూర్తితో ప్రతీ ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేద్దామని ప్రజలకు కలెక్టర్ రంజిత్ బాషా పిలుపునిచ్చారు. మంగళవారం కర్నూలులోని ప్రైవేట్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో భారీ ఎత్తున తిరంగా ర్యాలీని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా కర్నూలులో 1.1 మీటర్ల పొడవైన జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించడం శుభ పరిణామం అన్నారు.
కర్నూలు జిల్లా యోగా సంఘం ఆధ్వర్యంలో రెండు రోజులుగా నిర్వహించిన కర్నూలు జిల్లాస్థాయి యోగా పోటీలు మంగళవారం ముగిశాయి. ఈ మేరకు జిల్లా యోగా సంఘం అధ్యక్ష కార్యదర్శులు అవినాష్ శెట్టి, మునిస్వామి తెలిపారు. విజేతలకు కర్నూలు అవుట్డోర్ స్టేడియంలో యోగా సంఘం రాష్ట్ర ఛైర్మన్ దండు లక్ష్మీకాంత్ రెడ్డి బహుమతులు ప్రదానం చేశారు. క్రీడాకారులు గెలుపు, ఓటములను సమానంగా స్వీకరించాలని ఆయన సూచించారు.
కర్నూలు బి క్యాంప్ డాక్టర్స్ కాలనీలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో ఈనెల 14న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా తెలిపారు. జేసీ డాక్టర్ బి.నవ్య, డీఈవో దీప్తితో కలిసి జాబ్ మేళా పోస్టర్లను ఆవిష్కరించారు. 10వ తరగతి, డిగ్రీ, బీటెక్ పూర్తిచేసిన నిరుద్యోగులు హాజరుకావాలని, 11 కంపెనీలలో 500 ప్రైవేట్ ఉద్యోగాల భర్తీకి మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
సంపూర్ణతా అభియాన్‌లో కర్నూలు జిల్లా బంగారు పతకం సాధించిందని కలెక్టర్ పి.రంజిత్ బాషా తెలిపారు. సోమవారం సునయన ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మద్దికెర, చిప్పగిరి, హోళగుంద మండలాలు 100% ప్రగతి సాధించాయని చెప్పారు. ఇదే ఉత్సాహంతో అధికారులు ముందుకు సాగాలని సూచించారు. ఎమ్మెల్సీ బీటీ నాయుడు పాల్గొన్నారు.
మట్టి వినాయకులను పూజించి పర్యావరణాన్ని కాపాడుదామని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా పిలుపునిచ్చారు. కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ‘మట్టి వినాయకులను పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం’ అనే నినాదంతో పోస్టర్లు ఆవిష్కరించారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వినియోగాన్ని పూర్తిగా నిర్మూలించాలని పేర్కొన్నారు. జేపీ నవ్య, డీఆర్ఓ వెంకట నారాయణమ్మ పాల్గొన్నారు.
ఆదోని ప్రజల చిరకాల కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో జిల్లాల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. కర్నూలు జిల్లా నుంచి పశ్చిమ ప్రాంతాన్ని విడదీసి ఆదోని కేంద్రంగా జిల్లా చేయాలంటూ ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. గత ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్విభజన సమయంలో ఆందోళనలు చేసినా ఫలితం లేదు. కూటమి ప్రభుత్వం ఆదోని ప్రజల కల నెరవేర్చే దిశగా అడుగులు చేస్తున్నట్లు తెలుస్తోంది.
విజయవాడ వేదికగా ఆదివారం జరిగిన ఏపీ గణేశ్ ఉత్సవ సమితి సర్వసభ్య సమావేశంలో కర్నూలు జిల్లాకు చెందిన బి.వేణుగోపాల్ రాష్ట్ర కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన మాట్లాడుతూ.. కర్నూలు జిల్లా గణేశ్ ఉత్సవ సమితికి చేసిన సేవకుల గాను రాష్ట్ర కమిటీ సభ్యులు తనను రాష్ట్ర కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.