Kurnool

News September 10, 2024

కర్నూల్ యువతికి గోల్డ్ మెడల్

image

కర్నూల్ యువతి గోల్డ్ మెడల్ గెలిచారు. గత నెల 31 నుంచి సెప్టెంబర్ 6 నేపాల్‌లో ఎస్బీకేఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీలలో కర్నూలుకు చెందిన రేష్మ పాల్గొని సత్తా చాటారు. 57 కేజీల మహిళల విభాగంలో బంగారు పతకం కైవసం చేసుకున్నారని జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ సెక్రటరీ లోకేశ్ తెలిపారు. ఈ సందర్భంగా రేష్మను పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి తన నివాసంలో అభినందించారు.

News September 10, 2024

నంద్యాలలో 10న దిశా కమిటీ సమావేశం

image

ఈ నెల 10వ తేదీ దిశా కమిటీ (కేంద్ర ప్రభుత్వ పథకాలు, నిధులు, అభివృద్ధిపై సమీక్ష) సమావేశం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్, కన్వీనర్ జి.రాజకుమారి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్‌లోని సెంటినరీ హాల్లో సోమవారం ఉ.10 గంటలకు ఎంపీ బైరెడ్డి శబరి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుందన్నారు. జిల్లా మంత్రులు, జిల్లా పరిషత్ ఛైర పర్సన్, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు పాల్గొంటారని తెలిపారు.

News September 9, 2024

శ్రీశైలం: గణపయ్యకు 130 రకాల ప్రసాదాలు నైవేద్యం

image

శ్రీశైలం ప్రాజెక్టు కాలనీలో వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆయా గణేశ్ ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా అలంకరించిన అలంకారం మండపంలో కొలువుతీరిన గణనాథులకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. సోమవారం పలుచోట్ల అన్నదాన కార్యక్రమాలను చేపట్టారు. కొత్త బజార్లోని శ్రీ లక్ష్మీ గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బొజ్జా గణపయ్యకు 130 రకాల ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించారు.

News September 9, 2024

ప్రభుత్వం అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తోంది: మంత్రి ఫరూక్

image

ప్రభుత్వం అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తోందని నంద్యాల ఎమ్మెల్యే, మంత్రి ఫరూక్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నవ్యాంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. వృద్ధాప్య పింఛన్ రూ.4 వేలకు పెంచడం, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, పోలవరం నిర్మాణం, పకృతి విపత్తుల సమర్ధ నిర్వహణపై దృష్టి సారించామని అన్నారు.

News September 9, 2024

జాతీయ ఫుట్‌బాల్ జట్టుకు గ్రామీణ విద్యార్థిని ఎంపిక

image

కోసిగి మండలం జంపాపురానికి చెందిన అశ్విని జాతీయ ఫుట్‌బాల్ జట్టుకు ఎంపికైనట్లు తల్లిదండ్రులు బసవ, పార్వతీ తెలిపారు. అశ్విని కడప సైనిక్ స్కూల్లో చదువుకుంటూ ఫుట్‌బాల్ క్రీడలో కొన్నేళ్లుగా రాణిస్తోందని అన్నారు. కర్నూలు జిల్లా జట్టులో సభ్యురాలిగా ఉంటూ రాష్ట్ర జట్టులో చోటు సంపాదించిందన్నారు. ఇప్పుడు జాతీయ జట్టుకు ఎంపికవ్వడం సంతోషంగా ఉందన్నారు.

News September 9, 2024

నంద్యాల: వినాయక నిమజ్జనంలో విషాదం

image

ఆళ్లగడ్డ మండలం అహోబిలంలో వినాయక నిమజ్జనం సందర్భంగా అపశ్రుతి చోటుచేసుకుంది. నలుగురు బాలురు స్వతహాగా వినాయకుడి విగ్రహాన్ని తయారు చేసుకొని నిమజ్జనం చేసేందుకు తెలుగు గంగ కాలువ వద్దకు వెళ్లారు. నిమజ్జనం చేస్తుండగా అదుపుతప్పి కాలువలోకి జారిపడ్డారు. వారిలో ముగ్గురిని టోల్‌గేట్ సిబ్బంది కాపాడగా.. దస్తగిరి కుమారుడు లాల్ బాషా(12) గల్లంతయ్యాడు. పోలీసులు, గ్రామస్థులు కాల్వకట్ట వెంబడి గాలిస్తున్నారు.

News September 9, 2024

గణేశ్ ఉత్సవాలలో అపశ్రుతి.. గుండెపోటుతో యువకుడి మృతి

image

గణేశ్ ఉత్సవాల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. ఆళ్లగడ్డలోని ఆశ్రమం వీధిలో ఉన్న గంగమ్మ దేవాలయం వద్ద ఆదివారం రాత్రి అశోక్(32) అనే యువకుడు డాన్స్ వేస్తూ హఠాత్తుగా కుప్పకూలిపోయాడు. స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా గుండెపోటుతో మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆశ్రమం వీధిలో విషాద ఛాయలు అలముకున్నాయి.

News September 9, 2024

పీజీఆర్ఎస్ రద్దు: ఎస్పీ

image

నంద్యాల ఎస్పీ కార్యాలయంలో నేడు జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక అనివార్య కారణాల వల్ల రద్దు చేసినట్లు ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా తెలిపారు. ఎస్పీ కార్యాలయానికి సమస్యల కోసం వచ్చే ప్రజలు రావద్దని ఆయన సూచించారు. సుదూర ప్రాంతాల నుంచి వ్యయ ప్రయాసలతో ప్రజలు తమ సమస్యలను వస్తారని ఈ విషయాన్ని గమనించి ఎవరూ రావద్దని ఆయన సూచించారు.

News September 8, 2024

వ‌ర‌ద‌ బాధితుల స‌హాయార్ధం రూ.కోటి విలువైన 10 వేల కిట్లు సిద్ధం

image

విజ‌య‌వాడ వ‌ర‌ద బాధితుల‌కు కోసం రూ.కోటి విలువైన 10 వేల నిత్యావసర సరుకుల కిట్లు సిద్ధం చేసిన‌ట్లు మంత్రి టీజీ భ‌ర‌త్, టీడీపీ క‌ర్నూలు జిల్లా అధ్య‌క్షుడు తిక్కారెడ్డి తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యేలు, నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌ఛార్జులు, నాయ‌కుల స‌హ‌కారంతో వీటిని తయారు చేసిన‌ట్లు చెప్పారు. ఒక్కో కిట్‌లో 5 కేజీల బియ్యం, కేజీ కందిప‌ప్పు, కేజీ చక్కెర‌, ఉప్మార‌వ్వ‌, కారంపొడి, త‌దిత‌ర వ‌స్తువులు ఉన్నాయన్నారు.

News September 8, 2024

ప్రణాళికలతో నిమజ్జన ఏర్పాట్లను చేయండి: ఎస్పీ

image

కర్నూలులో ఈనెల 15న జరగబోయే వినాయక నిమజ్జన మహోత్సవాన్ని అధికారులు ప్రణాళికలతో ఏర్పాటు చేయాలని ఎస్పీ బిందు మాధవ్ అన్నారు. ఆదివారం రాంబోట్ల దేవాలయం, బాదం మాస్క్ మీదుగా, కింగ్ మార్కెట్, కొండారెడ్డి బురుజు మీదుగా అంబేడ్కర్ సర్కిల్, రాజ్ విహార్ మీదుగా వెళ్లే వినాయక విగ్రహాల ఊరేగింపు ప్రాంతాలను పరిశీలించారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడాలన్నారు.