India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
చేనేత సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని కలెక్టర్ పి.రంజిత్ బాషా అన్నారు. గురువారం ఎమ్మిగనూరులోని కుర్ని కళ్యాణ మండపంలో జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ప్రాచీన కాలం నుంచి చేనేత జాతీయ సంపదగా కొనసాగుతోందని, చేనేత అద్భుతమైన కళ అని ఆయన కొనియాడారు. అనంతరం ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డితో కలిసి రూ.83.50 లక్షలు లబ్ధిదారులకు అందజేశారు.
‘నేను ట్రాఫిక్ మిత్ర’ ప్రత్యేక పోస్టర్‌ను ఎస్పీ విక్రాంత్ పాటిల్ గురువారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. కర్నూలు నగరంలో ఎవరైనా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే నగర పోలీసు వాట్సాప్ గవర్నెన్స్ సెల్ 77778 77722 నంబర్‌కు ఫొటోలు, వీడియోలు పంపొచ్చన్నారు. అలా చేస్తే నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధిస్తామని తెలిపారు. ప్రతి పౌరుడూ పోలీసేనని, ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
కర్నూలు బి.క్యాంపులోని డాక్టర్స్ కాలనీలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 14న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా స్కిల్ అభివృద్ధి అధికారి ఆనంద్ రాజ్ కుమార్ బుధవారం తెలిపారు. పదో తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుకున్న 18 నుంచి 35 ఏళ్ల వయసు కలిగిన అభ్యర్థులు పాల్గొనవచ్చన్నారు. 11 ప్రముఖ కంపెనీల ప్రతినిధులు హాజరుకానున్నారని పేర్కొన్నారు. అభ్యర్థులు ఉదయం 10 గంటలకు కళాశాలకు చేరుకోవాలన్నారు.
ఈ నెల 12న జిల్లాలో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని నిర్వహించాలని కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో జాతీయ నులిపురుగుల నిర్మూలనపై అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం నులిపురుగుల నివారణకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు.
మంత్రి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన మాట ప్రకారం గూడెం కొట్టాల వారికి పట్టాలు పంపిణీ చేస్తున్నామని మంత్రి టీజీ భరత్ అన్నారు. మంగళవారం అశోక్ నగర్ నగరపాలక సంస్థ పంప్ హౌస్ ప్రాంతంలో గూడెం కొట్టాలలో అత్యంత ఖరీదైన ఒక ఎకరం స్థలంలో 150 మందికి జీవో ఎంఎస్ 30 ప్రకారం ఇళ్ల పట్టాలను ప్రస్తుతం రెవెన్యూ శాఖ తరపున ఇస్తున్నామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ రంజిత్ బాషా పాల్గొన్నారు.
ప్రైవేట్ ఉద్యోగాల యాప్ పేరుతో వచ్చే ఫేక్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగ యువతను లక్ష్యంగా చేసుకొని పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తూ సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని, ఆ మోసాల బారిన పడకుండా జగ్రత్తగా ఉండాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో ఇటీవల ఇలాంటి మోసాలు కొన్ని వెలుగులోకి వచ్చాయని తెలిపారు. మీ భద్రత మీ చేతుల్లోనే ఉందన్నారు.
కర్నూలు నగరంలో నివసిస్తూ ఇళ్లు లేని వారందరికీ త్వరలోనే ఇళ్ల పట్టాలు మంజూరు చేస్తున్నట్లు మంత్రి టీజీ భరత్ వెల్లడించారు. సోమవారం కర్నూలు నగరంలోని ప్రభుత్వ అతిధి గృహంలో మంత్రి రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. అమీర్ ఖాదర్ ఖాన్ నగర్, కారల్ మార్క్స్ నగర్, బుధవారపేట, జగన్నాథ గట్టుపై టిడ్కో ఇళ్లతో పాటు ఇళ్ల పట్టాలు లేని వారందరికీ పట్టాలు ఇచ్చేందుకు చర్యలు చేపట్టామన్నారు.
హైదరాబాద్‌లోని లాల్ బహదూర్ స్టేడియంలో ఆగస్టు 2–3 తేదీలలో జరిగిన ఇన్విటేషనల్ హ్యాండ్ బాల్ టోర్నమెంట్‌లో కర్నూలు జట్టు విజేతగా నిలిచింది. ఈ విషయాన్ని జిల్లా హ్యాండ్ బాల్ సంఘం కార్యదర్శి రుద్రా రెడ్డి తెలిపారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి 20 జట్లు పోటీలో పాల్గొన్నాయని, కర్నూలు క్రీడాకారులు అద్భుతంగా ప్రదర్శననిచ్చారని పేర్కొన్నారు.
ఈనెల 29న జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకొని వివిధ క్రీడాంశాల్లో ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి బి.భూపతి రావు సోమవారం వెల్లడించారు. ఈనెల 6వ తేదీన స్థానిక స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో అథ్లెటిక్స్, బాడ్మింటన్, ఆర్చరీ, వెయిట్ లిఫ్టింగ్, బాక్సింగ్, బాస్కెట్‌బాల్, హాకీ, ఖో-ఖో, కబడ్డీ, వాలీబాల్ క్రీడాంశంలో పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
అధికారులు ప్రజల సమస్యలను క్షేత్ర స్థాయిలోనే పరిష్కరించాలని కలెక్టర్ పి. రంజిత్ భాష అన్నారు. సోమవారం కర్నూలు కలెక్టరేట్ నుంచి పిజిఆర్ఎస్ ద్వారా వినతి పత్రాలను స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. అధికారులు తమ పరిధిలో పరిష్కరించదగ్గ సమస్యలను గడువు లోగా పరిష్కరించాలని ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ నవ్య పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.