Kurnool

News February 28, 2025

పరిశ్రమల స్థాపనను ప్రోత్సహిస్తాం: కర్నూల్ కలెక్టర్

image

కర్నూలు జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను గుర్తించి పరిశ్రమల స్థాపనకు ప్రోత్సహించాలని కలెక్టర్ పి.రంజిత్ బాషా సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఆయన అధ్యక్షతన డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కమిటీ (DIEPC) సమావేశం జరిగింది. కల్లూరు ఇండస్ట్రియల్ ఎస్టేట్ అభివృద్ధికి ప్రతిపాదనలను రూపొందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

News February 28, 2025

టెన్త్ పరీక్షలను పక్కాగా నిర్వహించాలి: కలెక్టర్ 

image

మార్చి 17 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్న పదో తరగతి పరీక్షలలో ఎలాంటి పొరపాట్లు జరగకూడదని కలెక్టర్ పి.రంజిత్ బాషా చీఫ్ సూపరింటెండెంట్‌లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు సంబంధించి సి.ఎస్.లకు నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమంలో కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. అవాంఛనీయ ఘటనలు లేకుండా పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఆయన సూచించారు. 

News February 27, 2025

ఎమ్మిగనూరులో చోరీ

image

ఎమ్మిగనూరులో భారీ చోరీ జరిగింది. బాధితుల వివరాల మేరకు.. తిరుమల నగర్‌కు చెందిన బాలకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి శ్రీశైలం వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకున్న దొంగలు చోరీకి చొరబడ్డారు. ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలోని ఆభరణాలు, నగదును ఎత్తుకెళ్లారు. పక్కింటి వారు సమాచారం ఇవ్వడంతో బాధితులు వెంటనే ఇంటికి చేరుకున్నారు. రూ.7లక్షల విలువైన బంగారం, రూ.40వేల నగదు ఎత్తుకెళ్లారని చెప్పారు.

News February 27, 2025

అహోబిలంలో మార్చి 2న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

image

అహోబిలంలో మార్చి 2న కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహిస్తున్నట్లు దేవస్థానం ప్రధానార్చకులు కీడాంబి వేణుగోపాలన్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. కోయిల్ అంటే గుడి అని ఆళ్వార్ అంటే భక్తుడని తెలిపారు. కోయిల్ ఆల్వార్ తిరుమంజనం అంటే గుడిని శుద్ధి చేసే ప్రక్రియ అన్నారు. ఎగువ, దిగువ అహోబిలం క్షేత్రాలలో ఆ రోజు మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 7 గంటల వరకు భక్తులకు శ్రీ స్వామి దర్శనం ఉండదని తెలిపారు.

News February 26, 2025

కర్నూలు: రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

image

కర్నూలులోని కోడుమూరు రహదారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సీ.బెళగల్(M) పోలకల్‌కు చెందిన మహేంద్ర(30) మృతిచెందాడు. భార్య, కూతురితో కలిసి మహేంద్ర రాజీవ్ గృహకల్పలో ఉంటున్నాడు. భార్య ఊరికెళ్లడంతో మిత్రుడు లింగంతో కలిసి బైక్‌పై బళ్లారి చౌరస్తాకు వచ్చాడు. ఓ హోటల్‌లో టిఫిన్ చేసి తిరిగి వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. తన స్నేహితుడికి గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేశారు.

News February 26, 2025

శ్రీశైలంలో విషాదం.. తండ్రీకొడుకులు మృతి

image

శివరాత్రి వేళ శ్రీశైలంలో విషాద ఘటన జరిగింది. శ్రీశైలం డ్యామ్ దిగువన ఉన్న కృష్ణా నదిలో స్నానమాచరిస్తూ తండ్రీకొడుకులు మృతి చెందారు. ఈ ఘటన బుధవారం ఉదయం జరిగింది. ఓ వ్యక్తి భార్య, కొడుకుతో కలిసి మల్లన్న దర్శనార్థం వచ్చారు. లింగాలగట్టు పెద్ద బ్రిడ్జి కింద కొడుకు స్నానమాచరిస్తూ నదిలోకి వెళ్లిపోయాడు. అది గమనించిన తండ్రి అతడిని కాపాడే ప్రయత్నంలో ఇరువురూ మృతి చెందారు. వారి వివరాలు తెలియాల్సి ఉంది.

News February 26, 2025

జనసేన ఆవిర్భావ వేడుకలు.. కర్నూలు పార్లమెంట్ ఇన్‌ఛార్జ్ ఈయనే..!

image

జనసేన ఆవిర్భావ వేడుకలకు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమన్వయకర్తలను ఆ పార్టీ అధిష్ఠానం నియమించింది. కర్నూలు పార్లమెంటుకు చింతా సురేశ్ నియమితులయ్యారు. కాగా, జిల్లాలోని ఏడు నియోజకవర్గాల జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలను సమన్వయం చేసుకొని, మార్చి 14న పిఠాపురంలో నిర్వహించే పార్టీ ఆవిర్భావ వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది.

News February 26, 2025

నేడు కర్నూలు జిల్లాకు ప్రముఖ లేడీ సింగర్ రాక

image

ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గలోని శ్రీ భ్రమరాంబ సమేత బుగ్గ రామేశ్వర స్వామి ఆలయంలో బుధవారం శివరాత్రి పర్వదినం పురస్కరించుకొని ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత ఆధ్వర్యంలో నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ బ్రహ్మోత్సవాల్లో ప్రముఖ సింగర్ మధుప్రియ, పల్సర్ బైక్ ఝాన్సీ, రమేశ్ బృందం సందడి చేయనుంది. ఈ మేరకు ఏర్పాట్లను  పూర్తి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

News February 26, 2025

ఆదోనిని 4 మండలాలుగా విభజించండి: క్రిష్ణమ్మ

image

కర్నూలులో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషాను టీడీపీ ఆదోని మాజీ ఇన్‌ఛార్జ్ గుడిసె క్రిష్ణమ్మ మంగళవారం కలిశారు. ఆమె మాట్లాడుతూ.. ఆదోనిలో ప్రధానంగా రోడ్ల వెడల్పు, ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. రాబోయే వేసవి కాలంలో నియోజకవర్గ పరిధిలో మంచినీటి కొరత సమస్యల గురించి కలెక్టర్‌కు వివరించారు. జిల్లాలో అతి పెద్దదైన ఆదోని మండలాన్ని 4 మండలాలుగా విభజించాలని విన్నవించారు.

News February 25, 2025

కర్నూలు: వినియోగదారుల కమిషన్ సంచలన తీర్పు

image

జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఆదేశాలను పట్టించుకోని ఎలక్ట్రిక్ బైక్ MDకి కమిషన్ అధ్యక్షుడు కిషోర్ కుమార్ నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీచేశారు. ఓ ప్రభుత్వ ఉద్యోగి బైక్‌ కొనుగోలు చేయగా మరమ్మతులకు గురవుతుండటంతో కమిషన్‌ను సంప్రదించారు. విచారణ చేసి బైక్ కొనుగోలు మొత్తాన్ని 9% వడ్డీతో చెల్లించి, మరో రూ.25 వేలు పరిహారం ఇవ్వాలని గతంలో కమిషన్ తీర్పునిచ్చింది. MD ఆ ఆదేశాలు పట్టించుకోలేదు.