Kurnool

News July 19, 2024

తాగు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి కృషి చేయండి: ఎమ్మెల్సీ

image

అమరావతి సచివాలయంలో జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును ఎమ్మెల్సీ బీటీ నాయుడు కలిశారు. కర్నూలు జిల్లాలోని తాగునీరు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి కృషి చేయాలని కోరినట్లు బీటీ నాయుడు తెలిపారు. అనంతరం రాష్ట్రం గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్రను మర్యాదపూర్వకంగా కలిశారు.

News July 19, 2024

కాటసాని రాంభూపాల్‌రెడ్డిపై ఫిర్యాదు

image

మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి నకిలీ పత్రాలతో తమ భూమిని కాజేశారని నంద్యాల జిల్లా పాణ్యంకు చెందిన బాధితులు వాపోయారు. తమకు న్యాయం చేయాలని రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూఖ్‌కు ఫిర్యాదు చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తోన్న గ్రీవెన్స్‌లో వారు ఈ ఫిర్యాదు చేశారు. పరిష్కారానికి మంత్రి అధికారులతో మాట్లాడారు.

News July 19, 2024

విద్య వ్యవస్థను మరింత పటిష్టం చేస్తాం: ఎంపీ

image

విద్య వ్యవస్థను మరింత పటిష్టం చేస్తామని కర్నూలు ఎంపీ నాగరాజు అన్నారు. గురువారం కర్నూలు సమీపంలోని ట్రిపుల్ ఐటీని ఆ కళాశాల రిజిస్ట్రార్ గురుమూర్తితో కలిసి పరిశీలించారు. కళాశాలలో కాంపౌండ్ వాల్ నిర్మించాలని, నీటి సమస్యను పరిష్కరించాలని ఎంపీకి రిజిస్ట్రార్ గురుమూర్తి విన్నవించారు. విద్యారంగాల సమస్యలను పరిష్కరించాలని ఇటీవలే మంత్రి లోకేశ్‌ను కలిసి విన్నవించాలని ఎంపీ అన్నారు.

News July 19, 2024

సైబర్ వలలో లద్దగిరి సర్పంచ్

image

కోడుమూరు మండలం లద్దగిరి గ్రామ పంచాయతీ సర్పంచ్ హనుమంతు బ్యాంకు ఖాతా నుంచి సైబర్ నేరగాళ్లు డబ్బు మాయం చేశారు. బాధిత సర్పంచ్ మాట్లాడుతూ.. యూనియన్ బ్యాంకులోని తన వ్యక్తిగత ఖాతా నుంచి బుధవారం రాత్రి పదేపదే మెసేజ్‌లు వచ్చాయని తెలిపారు. తర్వాత బ్యాలెన్స్ చెక్ చేసుకోగా రూ.1.95 లక్షల నగదు మాయం అయినట్లు తెలిసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సైబర్ మోసంపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

News July 19, 2024

కర్నూలు: జాహ్నవి కందుల మృతి.. ఊడిన అమెరికా పోలీసు ఉద్యోగం

image

కర్నూలు జిల్లాకు చెందిన 23 ఏళ్ల కందుల జాహ్నవి 2023 జనవరిలో సియాటెల్‌లోని పోలీసు పెట్రోలింగ్ వాహనం ఢీకొని మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తుపై పోలీసు అధికారి డేనియల్ అడెరెర్ చులకనగా మాట్లాడుతూ పగలబడి నవ్విన వీడియో ఒకటి వైరల్ అయ్యింది. ‘ఆమె ఓ సాధారణ వ్యక్తి. ఈ మరణానికి విలువలేదు’ అన్నట్లుగా ఆయన మాట్లాడటం తీవ్ర దుమారం రేపింది. దీంతో ఆ అధికారిపై తాజాగా చర్యలు తీసుకున్నారు.

News July 19, 2024

నేడు కర్నూలులో జడ్పీ సమావేశం

image

కర్నూలులో నేడు జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం జరగనుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత జరుగుతున్న తొలి జడ్పీ సమావేశం ఇది. జిల్లాకు మినీ అసెంబ్లీ లాంటి ఈ సమావేశానికి సమావేశానికి మంత్రులతోపాటు ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. జిల్లాలో నెలకొన్న ప్రధాన సమస్యలు, వివిధ శాఖలకు రావాల్సిన నిధులు, పేరుకుపోయిన బకాయిలపై చర్చ జరిగే అవకాశం ఉంది.

News July 19, 2024

కుష్టు వ్యాధిని నిర్మూలిద్దాం: డీఎంహెచ్‌వో

image

జిల్లా ప్రజలు, వైద్య ఆరోగ్య సిబ్బంది కలిసికట్టుగా పనిచేసి కుష్టు వ్యాధిని నిర్మూలిద్దామని నంద్యాల డీఎంహెచ్‌వో డాక్టర్ ఆర్.వెంకటరమణ పేర్కొన్నారు. గురువారం వైద్య సిబ్బంది జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నుంచి టెక్కే వరకు కుష్టు వ్యాధి లక్షణాలపై అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కుష్టు వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించారు.

News July 18, 2024

కర్నూలు యూనివర్సిటీలకు ఇన్‌ఛార్జ్ వీసీలు నియామకం

image

కర్నూలులో ఉన్న రెండు ప్రధానమైన యూనివర్సిటీలకు ఇన్‌ఛార్జ్ వీసీలను నియమిస్తూ గురువారం ప్రభుత్వం జీవో విడుదల చేసింది. రాయలసీమ యూనివర్సిటీ ఇన్‌ఛార్జ్ వైస్ ఛాన్స్‌లర్‌గా ప్రొఫెసర్ ఎన్‌టీకే నాయక్, డాక్టర్ అబ్దుల్ అక్ష ఉర్దూ యూనివర్సిటీకి కడప యోగి వేమన యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్ పటాన్ షేక్ షాషావలి ఖాన్‌ను నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

News July 18, 2024

నంద్యాల: ఆ రెండు రైళ్ల పునరుద్ధరణ

image

రైల్వే డివిజన్ పరిధిలో పలు ఎక్స్ ప్రెస్ రైళ్లను పునరుద్ధరిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. జులై 21 నుంచి నరసాపూర్ – గుంటూరు ఎక్స్‌ప్రెస్‌, గుంటూరు – డోన్ ఎక్స్ ప్రెస్‌ను నడపనున్నట్లు తెలిపారు. అదేవిధంగా జులై 22 నుంచి డోన్ – గుంటూరు ఎక్స్‌ప్రెస్, గుంటూరు-నరసాపూర్ ఎక్స్ ప్రెస్‌ను పునరుద్ధరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. రైల్వే ప్రయాణికులు గమనించాలని కోరారు.

News July 18, 2024

కర్నూలులో దారుణ హత్య.. UPDATE

image

కర్నూలులో నిన్న <<13648791>>హత్య<<>> జరిగిన విషయం తెలిసిందే. తాడిపత్రికి చెందిన శ్రీరాములు యాచకుడిగా జీవిస్తున్నారు. అదే వృత్తిలో ఉన్న ఫాతిమాతో పరిచయం ఏర్పడింది. ఆమెకు ఐదుగురు పిల్లలు ఉండగా ఒక కూతురు శ్రీరాములు ద్వారా జన్మించినట్లు తెలిసింది. శ్రీరాములు కూతురితో పరశురాం అనే వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. గొడవ జరగ్గా శ్రీరాములిని బండరాయితో కొట్టి పరశురాం హత్య చేశాడు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.