Kurnool

News July 18, 2024

కర్నూల్ జిల్లాలో పెట్రోల్, డీజిల్ ధరలు

image

కర్నూల్ జిల్లాలో పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. జిల్లాలో నిన్న లీటర్ పెట్రోల్ ధర రూ.109.85 ఉండగా 94 పైసలు తగ్గి నేడు రూ.108.91కు చేరింది. డీజిల్ 87 పైసలు తగ్గి నేడు లీటర్ రూ.96.80గా ఉంది. నంద్యాల జిల్లాలో నిన్న లీటర్ పెట్రోల్ ధర రూ.109.89 ఉండగా 20 పైసలు పెరిగి నేటికి రూ.110.09కు చేరింది. 18 పైసలు పెరగడంతో లీటర్ డీజిల్‌ ధర రూ.97.87గా ఉంది.

News July 18, 2024

నంద్యాల జిల్లాకు వర్ష సూచన

image

అల్పపీడనం ప్రభావంతో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. నంద్యాల జిల్లాలో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు, మిగిలినచోట్ల అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఈ మేరకు రైతులు, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

News July 18, 2024

రహదారి ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేయండి: కేంద్ర మంత్రికి విజ్ఞప్తి

image

రాష్ట్రంలో రహదారి ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేసి రాష్ట్ర అభివృద్ధికి చక్కటి బాటలు వేయాలని రోడ్లు, భవనాలు శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి విజ్ఞప్తి చేశారు. జాతీయ రహదారులతో రాష్ట్రంలోని రహదారులను అనుసంధానం చేస్తూ వివిధ దశల్లో జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులు, భూ సేకరణ సమస్యలు, నూతనంగా నిర్మించాల్సిన రహదారులపై ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

News July 17, 2024

కర్నూలు జిల్లాలో మరోసారి చిరుత పులి పంజా

image

కర్నూలు జిల్లా కోసిగిలో బుధవారం చిరుత పులి సంచారం కలకలం రేపింది. ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో రాముడు అనే వ్యక్తి గొర్రెల మందను ఏర్పాటు చేసుకున్నాడు. తెల్లవారుజామున చిరుత పులి గొర్రెల మందపై దాడి చేసింది. గమనించిన రాముడు కేకలు వేయడంతో పారిపోయింది. కాగా చిరుత దాడిలో ఒక గొర్రెపిల్ల మృతిచెందింది. చిరుత పులి తరచూ దాడులు చేస్తోందని, తమను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.

News July 17, 2024

BIG BREAKING: ముచ్చుమరి ఘటనలో CI, SI సస్పెండ్

image

నంద్యాల జిల్లా ముచ్చుమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో వాసంతి కేసుకు సంబంధించి ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. మిస్సింగ్ కేసు నమోదుపై నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకుగాను నందికొట్కూరు రూరల్ సీఐ ఓ.విజయ భాస్కర్, ముచ్చుమర్రి ఎస్ఐ ఆర్.జయశేఖర్‌ను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఈ మేరకు కర్నూలు రేంజ్ డీఐజీ సీహెచ్.విజయరావు ఉత్తర్వులు జారీ చేశారు.

News July 17, 2024

నంద్యాల: ఉపాధ్యాయ పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు-2024 సంవత్సరానికి అర్హులైన ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ సుధాకర్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పాఠశాల విద్యా కమిషనర్ ఆదేశాల మేరకు ఈనెల 18 నుంచి 21వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలన్నారు. http://nationalawardstoteacher.education.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News July 17, 2024

కర్నూలు: మరణంలోనూ వీడని స్నేహం

image

ఇద్దరూ స్నేహితులు మరణంలోనూ స్నేహబంధాన్ని వీడలేదు. పత్తికొండ మండలం దూదేకొండ గ్రామానికి చెందిన సురేశ్(18), మణికుమార్(19) పత్తికొండ నుంచి సొంతూరుకు బయలుదేరారు. దూదేకొండ గ్రామ సమీపంలోని సుకాలి నాగమ్మ ఆలయం వద్ద ముందు వెళుతున్న ఎద్దుల బండిని ఢీకొట్టారు. స్థానికులు వారిని సమీప ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యుల తెలిపారు.

News July 17, 2024

నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించండి: నంద్యాల కలెక్టర్

image

నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఉపాధి మార్గాలను అన్వేషించాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి స్కిల్ డెవలప్‌మెంట్, ఉపాధి కల్పన అధికారులను ఆదేశించారు. మంగళవారం ఈ విషయమై సమీక్ష నిర్వహించారు. జిల్లా ఉపాధి కల్పనాధికారి దీప్తి, స్కిల్ డెవలప్‌మెంట్ అధికారి ప్రతాపరెడ్డి, జూనియర్ ఎంప్లాయిమెంట్ అధికారి సోమశివారెడ్డి తదితరులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో వారికి పలు సూచనలు చేశారు.

News July 16, 2024

ప్రాణాలు కాపాడిన గుత్తి ప్రభుత్వ వైద్యులు

image

గుండెపోటుకు గురైన నంద్యాల జిల్లా వ్యక్తికి క్షణం ఆలస్యం చేయకుండా వైద్యం అందించి గుత్తి డాక్టర్లు బతికించారు. డోన్ మండలం కొత్త బురుజుల గ్రామానికి చెందిన చిన్న ఓబులేసు అనంతపురం వెళ్తుండగా గుత్తి సమీపంలో ఛాతీ నొప్పికి గురయ్యారు. వెంటనే గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎల్లప్ప గుండెపోటును నివారించే ఇంజక్షన్ ఇచ్చి ప్రాణాపాయం నుంచి తప్పించారు.

News July 16, 2024

డేటింగ్ యాప్‌లతో మోసం.. నంద్యాల యువకుడి అరెస్ట్

image

డేటింగ్ యాప్‌లతో యువతులకు వల విసిరి పెళ్లి చేసుకుంటానని మోసాలకు పాల్పడుతున్న నంద్యాల జిల్లా యువకుడిని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. సంజామల మండలానికి చెందిన చిన్ని రెడ్డి శ్రీనాథ్ రెడ్డి.. టిండర్, నీతో డేటింగ్ అనే యాప్ ద్వారా హైదరాబాద్‌కు చెందిన ఓ యువతిని నమ్మించి రూ.6.41 లక్షలు వసూలు చేశాడు. మోసపోయానని తెలుసుకున్న ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడి బండారం బయటపడింది.