Kurnool

News April 12, 2025

కర్నూలు : జాతీయ యోగా క్రీడాకారుడికి 978 మార్కులు

image

కర్నూలుకు చెందిన జాతీయ యోగా క్రీడాకారుడు షేక్ అశ్వంత్‌కు శనివారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలలో 978 మార్కులు సాధించారు. తల్లి ముంతాజ్ బేగం జాతీయ యోగా సంఘంలో న్యాయ నిర్ణీతగా, జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. జిల్లా యోగా సంఘం హర్షం వ్యక్తం చేసింది.

News April 12, 2025

ఆదోని : గిఫ్ట్ షాప్ నడుపుతున్న వ్యక్తి కూతురు జిల్లా టాపర్

image

ఆదోని పట్టణంలో టీచర్స్ కాలనీలో నివాసం ఉంటున్న మల్లన్నగౌడ్ రెండో కూతురు రూప యంపీసీ ఫస్టియర్ లో 466/470 మార్కులతో జిల్లా టాపర్‌గా నిలిచింది. తండ్రి పట్టణంలో గిఫ్ట్ షాప్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. పిల్లలను ఉన్నత స్థాయిలో చూడాలని కష్టపడి చదివించినట్లు తెలిపారు. తన కష్టానికి ప్రతిఫలంగా కూతురు జిల్లా స్థాయిలో ర్యాంక్ సాధించడం ఆనందంగా ఉందన్నారు.

News April 12, 2025

ఇంటర్ ఫలితాలలో కర్నూలు జిల్లా సత్తా

image

ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. కర్నూలు జిల్లాలో సెకండ్ ఇయర్‌లో 18,093 మంది మంది పరీక్షలు రాయగా 14,967 మంది పాసయ్యారు. 83 శాతం పాస్ పర్సంటేజీతో కర్నూలు జిల్లా రాష్ట్రంలోనే 11 వ స్థానంలో నిలిచింది. ఫస్ట్ ఇయర్‌లో 20,420 మందికి 14859 మంది పాసయ్యారు. 73 శాతం పాస్ పర్సంటేజీతో రాష్ట్రంలో 8 వ స్థానంలో జిల్లా నిలిచింది.

News April 12, 2025

కర్నూలు: రూ.11.77 కోట్ల చెక్కుల పంపిణీ

image

కర్నూలు జిల్లాలో ఆర్థికంగా వెనుకబడిన బీసీలు, కాపు లబ్ధిదారులకు స్వయం ఉపాధి పథకం కింద రూ.11.77 కోట్ల చెక్కును శుక్రవారం జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా, ఎంపీ నాగరాజు, పాణ్యం ఎమ్మెల్యే చరితారెడ్డి పంపిణీ చేశారు. 508 మందికి లాభం చేకూరేలా కలెక్టర్ రంజిత్ బాషా, ఎంపీ నాగరాజు, ఎమ్మెల్యే చరితారెడ్డి చెక్కులు అందజేశారు. ప్రభుత్వం కార్పొరేషన్ల ద్వారా సంక్షేమానికి కట్టుబడి ఉందని అధికారులు తెలిపారు.

News April 12, 2025

నేడే రిజల్ట్.. కర్నూలు జిల్లా విద్యార్థుల్లో ఉత్కంఠ

image

ఇంటర్ ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. ఇవాళ ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల కానున్నాయి. కర్నూలు జిల్లాలో 45,325 మంది ఇంటర్ విద్యార్థులు ఉన్నారు. మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు 69 కేంద్రాల్లో పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.
☞ వే2న్యూస్ యాప్‌లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

News April 12, 2025

వ్యూహాత్మకంగా పని చేయాలి: కర్నూలు కలెక్టర్

image

సమస్యలపై అధికారులు వ్యూహాత్మకంగా పని చేయాలని కర్నూలు జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ సునీత ఆడిటోరియంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా వర్క్ షాప్ నిర్వహించారు. అన్ని విషయాలపై అవగాహన ఉండాలని సూచించారు. జేసీ డా. బి.నవ్య, సబ్ కలెక్టర్, డిఆర్వో, ఆర్డీవోలు, తహశీల్దార్లు, సర్వేయర్లు ఉన్నారు.

News April 11, 2025

కర్నూలు జిల్లా నేటి ముఖ్యాంశాలు

image

➤మహానంది: ఉరుములు, మెరుపులతో వర్షం
➤ వైసీపీకి బీజం కర్నూలులోనే: వైఎస్ జగన్
➤ ఆదోనిలో మహిళ ఆత్మహత్య
➤ రేపే రిజల్ట్.. కర్నూలు జిల్లా విద్యార్థుల ఎదురుచూపు
➤ కౌతాళం: 25 జంటలకు సామూహిక వివాహాల
➤ కర్నూలు విద్యాశాఖ ఏడీపై సస్పెన్షన్ వేటు
➤ నంద్యాల: ఫలితాలు రాకముందే.. ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.!
➤ గుడిపాడులో వాటర్ ప్లాంట్లను తనిఖీ చేసిన జేసీ
➤విద్యార్థులతో కర్నూలు MP ముఖాముఖీ

News April 11, 2025

నంద్యాల: ఫలితాలు రాకముందే.. ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.!

image

నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం అయ్యవారి కోడూరుకి చెందిన బిజ్జం సుధీశ్వర్ రెడ్డి (18) శుక్రవారం ఉరి వేసుకొని మృతి చెందినట్లు SI జగన్ తెలిపారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాశాడని, రేపు ఇంటర్ ఫలితాలు రానున్నందున ఫెయిల్ అవుతాననే భయంతో చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు. పరీక్షలు జీవితంలో ఒక భాగం మాత్రమే.. దీనికి ప్రాణాలు తీసుకుని తల్లిదండ్రులను ఒంటరివాళ్లను చేయకండి.

News April 11, 2025

గుడిపాడులో వాటర్ ప్లాంట్లను తనిఖీ చేసిన జేసీ

image

కర్నూలు జిల్లా గూడూరు మండలంలోని మునగాల, మల్లాపురం, గుడిపాడు గ్రామాల్లో జాయింట్ కలెక్టర్ నవ్య పర్యటించారు. శుక్రవారం గుడిపాడులో రూ.8 లక్షల కుడా నిధులతో ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్లను తనిఖీ చేశారు. తాగునీటి సమస్యపై గ్రామస్థులను అడిగి తెలుసుకున్నారు. ప్రజల సంతృప్తిని చూసి జేసీ సంతోషం వ్యక్తం చేశారు. కుడా నిధులతో అభివృద్ధి పనులు అభినందనీయమన్నారు. కార్యక్రమంలో MRO, AO పాల్గొన్నారు.

News April 11, 2025

కర్నూలు విద్యాశాఖ ఏడీపై సస్పెన్షన్ వేటు

image

కర్నూలు విద్యాశాఖ అధికారి కార్యాలయంలో పనిచేస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులుపై సస్పెన్షన్ వేటు పడింది. మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తన్నాడని ఇటీవల ఆయనపై పలు ఫిర్యాదులు వచ్చాయి. విచారణ చేపట్టిన కడప ఆర్జేడీ నివేదికను ఉన్నతాధికారులకు పంపారు. దీంతో తాజాగా ఆయనను సస్పెండ్ చేస్తూ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ విజయరామరాజు ఉత్తర్వులు జారీ చేశారు.