Nellore

News May 25, 2024

ఆత్మకూరులో యువకుడి మృతి

image

ఆత్మకూరులో శుక్రవారం ప్రమాదవశాత్తు ఓ యువకుడు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. హుస్సేన్ (25) స్థానిక పెద్ద మసీదు ప్రాంతంలోని ఓ ఇంటికి అద్దాలు బిగించే పనికి వెళ్లాడు. ఈ క్రమంలో అక్కడ పని చేస్తూ.. ప్రమాదవశాత్తు జారి పడి మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. హుస్సేన్ ఉత్తర ప్రదేశ్ నుంచి వలస వచ్చినట్లు ఎస్ఐ ముత్యాల రావ్ తెలిపారు.

News May 25, 2024

నెల్లూరు: కన్నల పండుగగా పెంచలకోన తెప్పోత్సవం

image

ప్రముఖ పుణ్యక్షేత్రం పెంచలకోనలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారిని తెప్పపై ఉంచి కోనేటిలో ఊరేగించారు. నేత్రపర్వంగా సాగిన ఈ ఉత్సవాన్ని వీక్షించేందుకు భక్తజనులు కోలాహలంతో పాల్గొన్నారు. గోవింద నామస్మరణతో కోన మారుమోగింది.

News May 24, 2024

నెల్లూరు : మే25న ఏపీపీఎస్సీ పరీక్ష

image

జిల్లా వ్యాప్తంగా ఆదివారం జరగనున్న ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) పరీక్షను సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు డీఆర్డీ లవన్న తెలిపారు. శుక్రవారం నెల్లూరు కలెక్టరేట్లోని శంకరన్ హాలులో డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నిర్వహిస్తున్న ఆన్లైన్ పరీక్షపై సమన్వయ అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్లతో డీఆర్డీ సమావేశం నిర్వహించారు. పరీక్షను పక్కాగా నిర్వహించాలన్నారు.

News May 24, 2024

కౌంటింగ్ విధులను అప్రమత్తంగా నిర్వహించాలి: నెల్లూరు కలెక్టర్

image

ఎన్నికల సంఘం నిబంధనలను పాటిస్తూ ఓట్ల లెక్కింపు విధులను సక్రమంగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ ఎం.హరినారాయణన్ ఆదేశించారు. శుక్రవారం కలక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియపై రిటర్నింగ్ అధికారులకు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు పాటించాల్సిన జాగ్రత్తలను ఆయన వివరించారు.

News May 24, 2024

కొడవలూరులో అగ్ని ప్రమాదం

image

కొడవలూరు మండలం గండవరం గౌతమ్ నగర్‌లో శుక్రవారం అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గ్రామంలోని ఓ రైతుకు చెందిన గడ్డివాము కాలిపోయినట్లు స్థానికులు తెలిపారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. సుమారు 50 వేల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు తెలిపాడు. ప్రమాదంలో ఎవరికి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

News May 24, 2024

సోమిరెడ్డికి కాకాణి సవాల్

image

సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి కాకాణి గోవర్ధన్ రెడ్డి సవాల్ విసిరారు. ఇటీవల బెంగుళూరు రేవ్ పార్టీలో కాకాణి పేరుతో స్టిక్కర్ ఉన్న కారు గుర్తించిన విషయం తెలిసిందే.. అయితే కాకాణిపై సోమిరెడ్డి చేసిన విమర్శలకు ఆయన స్పందించారు. ‘నీవి,నావి బ్లడ్ శాంపిల్స్ టెస్ట్ కి ఇద్దాం..అప్పుడు తెలుస్తుంది ఎవరు డ్రగ్స్ తీసుకుంటారో’ అని కాకాణి కౌంటర్ వేశారు.

News May 24, 2024

నెల్లూరు: హత్య కేసులో ఆరుగురి అరెస్ట్

image

బాపట్లలో ఈ నెల 15న జరిగిన ప్రశాంత్ హత్యకేసులో నెల్లూరుకు చెందిన ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నెల్లూరుకు చెందిన ప్రశాంత్ బాపట్ల పాత బస్టాండ్ ప్రాంతంలో హత్యకు గురయ్యాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడు కృష్ణారెడ్డితో పాటు ఆర్.లక్ష్మయ్య, ద్వారకా, చెర్ల లక్ష్మణ్, పంగా రోహిత్, కొమరిక ఈశ్వర్‌ను అరెస్ట్ చేసినట్లు బాపట్ల డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. నిందితుల కారును కూడా స్వాధీనం చేసుకున్నారు.

News May 24, 2024

నెల్లూరు: ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ సస్పెండ్

image

ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మధును ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ సస్పెండ్ చేశారు. మధు భార్య విజయలక్ష్మి నెల్లూరు 41వ డివిజన్ కార్పొరేటర్. ఈ క్రమంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో మధు వైసీపీ అభ్యర్థులకు అనుకూలంగా ప్రచారం నిర్వహించారని ఈసీకి ఫిర్యాదులు అందాయి. ఆధారాలను పరిశీలించిన అధికారులు చర్యలకు సిఫార్సు చేయడంతో.. సస్పెండ్ చేస్తూ ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు.

News May 24, 2024

నెల్లూరు: విద్యుత్ షాక్‌తో దంపతులు మృతి

image

టీపీ గూడూరు మండలం చిన్న చెరుకూరు గ్రామంలో గురువారం విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్‌తో భార్యాభర్తలు మృతి చెందారు. టేబుల్ ఫ్యాన్ వైర్లు తగిలి పడిపోయిన అన్నం నరసయ్యను కాపాడేందుకు వచ్చిన భార్య భాగ్యమ్మ కూడా మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

News May 24, 2024

నెల్లూరు: ఏర్పాట్లు పర్యవేక్షించిన జిల్లా కమిటీ సభ్యుల బృందం

image

ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో చివరి ప్రక్రియను ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని కమిటీ అధ్యక్షుడు నెల్లూరు సిటీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి వికాస్ మర్మత్ కౌంటింగ్ కమిటీ సభ్యులకు సూచించారు. స్థానిక కనుపర్తిపాడులోని ప్రియదర్శిని ఇంజినీరింగ్ కళాశాలలో కౌంటింగ్ ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్‌తో కలిసి పరిశీలించారు.