Nellore

News January 29, 2026

ఫిబ్రవరి 2, 3న ఎస్టిమేట్స్ కమిటీ పర్యటన

image

రాష్ట్ర శాసనసభ ఎస్టిమేట్స్ కమిటీ ఛైర్మన్ వి.జోగేశ్వర రావు ఫిబ్రవరి 2, 3 తేదీల్లో నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో కలెక్టర్, ఇతర జిల్లా అధికారులతో కలిసి 2019–20, 2020–21, 2021–22 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన బడ్జెట్ అంచనాలపై ఎస్టిమేట్స్ కమిటీ సమీక్షిస్తారని ఆయన పేర్కొన్నారు.

News January 29, 2026

నెల్లూరు: 482 మందికి కొత్త అక్రిడిటేషన్ మంజూరు

image

ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు 2026, 2027 సంవత్సరాలకు సంబంధించి అర్హత ఉన్న 482 మంది జర్నలిస్టులకు మొదటి విడతలో అక్రిడిటేషన్ మంజూరు చేశామని జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. నెల్లూరు కలెక్టరేట్‌లో జేసీ అధ్యక్షతన జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ మొదటి సమావేశం గురువారం జరిగింది. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఏ ఒక్క అక్రిడిటేషన్ దరఖాస్తును కూడా రిజెక్ట్ చేయలేదని స్పష్టం చేశారు.

News January 29, 2026

నెల్లూరు: కొత్తగా 9 విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణం

image

నెల్లూరు జిల్లాలో విద్యుత్తు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపుతోంది. ఇప్పటికే పంచేడు, కుడితిపాలెం, అక్కచెరువుపాడు, వెల్లంటి, కల్లూరుపల్లి, బోడిగాడితోటలో రూ.30 కోట్లతో సబ్ స్టేషన్లు నిర్మించారు. నందిపాడు, సాయిపేట, కొండబిట్రగుంట, సిరిపురం, అన్నారెడ్డిపాళెం, పెరుమాల్లపాడు, పూడిపర్తి, కృష్ణపట్నం, దాచూరు ప్రాంతాల్లోనూ వీటిని ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు పంపామని విద్యుత్ SE రాఘవేంద్ర తెలిపారు.

News January 29, 2026

NLR: అంతంతగానే సోలార్స్ సిస్టం ఏర్పాటు

image

నెల్లూరు జిల్లాలో పీఎం సూర్య ఘర్ పథకానికి స్పందన అంతంతగానే ఉంది. ఆన్‌లైన్ ద్వారా 65,916 అప్లికేషన్స్ వచ్చాయి. సోలార్ ప్యానల్స్ ఇచ్చేందుకు 5,744 మంది వెండర్స్ ముందుకొచ్చారు. 3,086 పరికరాలను మాత్రమే అమర్చారు. 2,767 సర్వీస్లకు రూ.2158 లక్షల సబ్సిడీని విడుదల చేశారు. 1kv కి ₹30వేలు, 2kv ₹60వేలు, 3kv-10kv వరకు ₹78 వేలు సబ్సీడీ ఇస్తున్నారు. వెండర్స్ ఎక్కువ మంది లేకపోవడంతో పథకం లక్ష్యం చేరడం లేదు.

News January 29, 2026

నెల్లూరు: ఫ్రీ ల్యాప్‌టాప్.. వైరల్

image

ఫ్రీ ల్యాప్‌టాప్ పథకం అంటూ నెల్లూరు జిల్లాలోని వాట్సాప్‌ గ్రూపుల్లో ఓ మెసేజ్ వైరల్ అవుతోంది. ఇండియా ఫ్రీ ల్యాప్‌టాప్-2026 పథకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారని.. వివరాలు నమోదు చేసుకుంటే ఫ్రీగా ఇస్తారని ఓ లింకును షేర్ చేస్తున్నారు. ఇలాంటి పథకంపై అధికారులు ఎక్కడా ప్రకటన చేయలేదు. ఇలాంటి మెసేజ్‌లపై జాగ్రత్తగా ఉండండి.

News January 29, 2026

నెల్లూరు: అమ్మను నడిరోడ్డుపై వదిలేశాడు..!

image

కనిపెంచిన తల్లి భారమనకున్నాడు. నిర్దాక్షిణ్యంగా రోడ్డుపై వదిలేశాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలో వెలుగు చూసింది. ఈదలవారిపాలేనికి చెందిన వృద్ధురాలు మేకల లింగమ్మను అతని కుమారుడు ఆటోలో తీసుకు వచ్చి పంటపాళెం రోడ్డుపై వదిలేశాడు. ముత్తుకూరు పోలీసులు ఆమెను ఇంటికి చేర్చారు. కుమారుడికి తమదైన శైలిలో స్ట్రాంగ్ కౌన్సెలింగ్ ఇచ్చారు. మరోసారి ఇలా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News January 29, 2026

నెల్లూరు జిల్లాలో సబ్సిడీ ఇస్తున్నా..!

image

జిల్లాలో పశువులు 57,774, బర్రెలు 6,46,106, గొర్రెలు 10,95,197, మేకలు 3,86,929 చొప్పున ఉన్న పశు సంపదకు రక్షణ కల్పించేందుకు తీసుకొచ్చిన ఎనిమల్ షెల్టర్స్ పడకేశాయి. జిల్లాకు 2700 షెల్టర్స్ మంజూరైతే 800 మాత్రమే పూర్తవ్వగా మిగిలిన 1900 నిర్మాణాలను మార్చిలోగా పూర్తి చేయాల్సి ఉంది. పశువులకు రూ.2.30 లక్షలకు 90% సబ్సిడీ, గొర్రెలు, మేకలకు రూ.2.30 లక్షలు, పౌల్ట్రీ కింద రూ.1.32 లక్షలకు 70% సబ్సిడీ ఇస్తున్నారు.

News January 29, 2026

నెల్లూరు: 4 గవర్నమెంట్ ఉద్యోగాలు..!

image

ఓ ప్రభుత్వ ఉద్యోగం రావడమే కష్టమవుతున్న ఈ రోజుల్లో ఓ యువకుడు 4 ఉద్యోగాలు సాధించాడు. అనంతసాగరం(M) కొత్తపల్లికి చెందిన హెడ్ కానిస్టేబుల్ మస్తాన్ కుమారుడు లాల్ అహమ్మద్ బీటెక్ చదివాడు. 2019లో పంచాయతీ కార్యదర్శిగా, తర్వాత జిల్లా కోర్టులో జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ సాధించారు. ప్రస్తుతం మనుబోలు MRO ఆఫీసులో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తుండగా.. గ్రూప్-2లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌గా ఎంపికయ్యారు.

News January 29, 2026

నెల్లూరు జిల్లాలో డబ్బులు ఇవ్వందే పని చేయరు..!

image

నెల్లూరు జిల్లాలో కరెంటోళ్లు మామూళోల్లు కాదు. గ్రామాల్లో వారు చెప్పిందే వేదం. ఎప్పుడొస్తే అప్పుడే పని. అప్పటి వరకు ప్రమాదమైనా అరచేతిలో ప్రాణాలు పెట్టుకోవాల్సిందే. పని చేస్తే వాళ్లు అడిగినంత ఇవ్వాల్సిందే. లేకుంటే తిరిగి ముఖం కూడా చూడరు. జిల్లాలో 247 మంది లైన్‌మెన్లకు 50మందే ఉండటంతో వీరికి డిమాండ్‌ పెరిగింది. ప్రభుత్వం ఖాళీలను భర్తీ చేయడం లేదు. మీ ఏరియాలో లైన్‌మెన్ పనితీరుపై కామెంట్ చేయండి.

News January 29, 2026

ఆత్మ స్థైర్యంతో ముందుకు సాగండి: కలెక్టర్

image

చదువు, క్రమశిక్షణ, ఆత్మస్థైర్యంతో ముందుకు సాగితే ఏ పరిస్థితినైనా జయించవచ్చని కలెక్టర్ హిమాన్షు శుక్లా విద్యార్థులకు ప్రేరణాత్మక సందేశం ఇచ్చారు. బుధవారం కలెక్టర్ తన చాంబర్‌లో కరోనా మహమ్మారి సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థులతో ముఖాముఖీ నిర్వహించారు. ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సహాయానికి సంబంధించిన పోస్టాఫీసు పాస్‌బుక్స్‌, సర్టిఫికెట్లను విద్యార్థులకు అందజేశారు.