Nellore

News January 31, 2026

నెల్లూరు: రైతన్నలు ఆ.. ఐడీ నంబర్లు చేసుకున్నారా..?

image

వ్యవసాయశాఖ ద్వారా ఏ పథకం అమలైనా రైతులకు అందాలంటే వ్యక్తిగత గుర్తింపు నంబర్లు తప్పనిసరి. ఆ గుర్తింపు నెంబర్‌ను AP ఫార్మర్ రిజిస్ట్రీ (apfr) అంటారు. జిల్లాలో 2.69 లక్షలు మంది రైతులు ఉండగా 1.69 లక్షల మందికి ఈ గుర్తింపు నెంబర్ ఉంది. PM కిసాన్, అన్నదాత సుఖీభవ, పంటల బీమా, రైతు రాయితీలు పొందాలంటే సచివాలయంలో ఉండే VAAలను సంప్రదించి ఆధార్ కార్డు, భూపత్రాలు, ఫోన్ నెంబర్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి.

News January 30, 2026

నెల్లూరు: ఆలస్యంగా నడిచిన రైళ్లు

image

నెల్లూరు, గూడూరు, కావలి తదితర స్టేషన్లలో శుక్రవారం ఆగాల్సిన రైళ్లు ఆలస్యంగా నడిచాయి. సూపర్ ఫాస్ట్, ఎక్సప్రెస్, పాసింజర్ రైళ్లన్నీ గంట, రెండు గంటలు లేటుగా వచ్చాయి. ప్రకాశం జిల్లా అమ్మనబ్రోలు వద్ద ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో ఈ పరిస్థితి తలెత్తిందని నెల్లూరు స్టేషన్ మేనేజర్ తెలిపారు. రైళ్లు ఆలస్యం కావడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.

News January 30, 2026

నెల్లూరులో దారుణం

image

దారి చూపి అండగా ఉండాల్సిన కన్న తండ్రి కామాంధుడై కూతురుపై లైంగిక దాడికి పాల్పడుతున్న ఘటన నెల్లూరులో కలకలం రేపింది. నగరానికి చెందిన ఓ దంపతులకు ఆరేళ్ల కుమార్తె ఉంది. ఆమె ఆలనా పాలన చూసుకోవాల్సిన తండ్రి కూతురుపై కన్నేసి కొన్ని రోజులుగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. గమనించిన తల్లి భర్తపై సంతపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News January 30, 2026

నెల్లూరు: ఇద్దరికి పదేళ్ల జైలుశిక్ష

image

సూళ్లూరుపేట మండలం మన్నారుపోలూరు హైవే క్రాస్ రోడ్డు వద్ద 2018 సెప్టెంబర్ 10న పోలీసులు తనిఖీలు చేస్తుండగా 200KGల గంజాయి పట్టుబడింది. తమిళనాడు(ST) సేలం జిల్లా పెదనాయకంపాళేనికి చెందిన మహదేవన్, వెంకటేశ్‌ను అరెస్ట్ చేశారు. నేరం రుజువు కావడంతో 10ఏళ్ల జైలు శిక్ష, రూ.లక్ష చొప్పున ఇద్దరికి జరిమానాను విధిస్తూ నెల్లూరు ఫస్ట్ ఆడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి గీత గురువారం తీర్పు చెప్పారు.

News January 30, 2026

తిరుమల లడ్డూ ఘటనలో నిజమే గెలిచింది: కాకాణి

image

తిరుమల లడ్డు ప్రసాదంపై ఇటీవల జరిగిన అసత్య ప్రచారాలు, ఆధారరహిత ఆరోపణలు పూర్తిగా అబద్ధమని సీబీఐ నివేదికతో స్పష్టమైందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా నిజమే గెలిచిందని పేర్కొన్నారు. గురువారం ఆయన నగరంలోని మాగుంట లే అవుట్‌లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నాయకులు, భక్తులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

News January 29, 2026

గ్రూప్-2 పోస్టుల్లో ఆత్మకూరు వాసుల సత్తా

image

ఆత్మకూరు ప్రాంతంలో నలుగురికి గ్రూప్-2 పోస్టులు లభించాయి. ఇందులో రాజవోలు సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న రవి డిప్యూటీ తహశీల్దార్‌గా, బట్టేపాడు సెక్రెటరీగా ఉన్న శ్రీనివాసులు, అనంతసాగరం పనిచేసే వెంకటేశ్వర్లు, ఆత్మకూరుకు చెందిన విజయ వివిధ విభాగాల్లో అధికారులుగా ఎంపికయ్యారు. మూడేళ్లుగా శ్రమించి గ్రూప్-2కు ఎంపికైన ఈ నలుగురు మధ్యతరగతి, పేద కుటుంబాలకు చెందిన వారే కావడం విశేషం.

News January 29, 2026

నెల్లూరు జిల్లాలో స్పీడ్ పెంచిన YCP..!

image

నెల్లూరు జిల్లాలో వైసీపీ టాప్ గేర్ వేస్తోంది. ఇటీవల సోమశిల, కండలేరు పరిశీలనకు బయల్దేరిన వైసీపీ శ్రేణులను.. ప్రభుత్వం అడ్డుకుని హౌస్ అరెస్టులు చేయించడంపై తిరుగుబాటు చేసింది. పార్టీని బలోపేతం చేసేందుకు నియోజకవర్గాల వారీగా మీటింగ్‌లు పెడుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు మరింతగా పుంజుకొనేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. వివిధ అంశాలపై రోడ్డు ఎక్కి ఆందోళనలు చేసి శ్రేణుల్లో ఉత్సాహన్ని నింపుతోంది.