India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

వెంకటాచలంలో కొన్ని వేల మీటర్ల గ్రావెల్ తవ్వకాలు జరిగాయని 3 నెలల క్రితం విజిలెన్స్ అధికారులు ఆ శాఖ DGకి నివేదికిచ్చారు. నాలుగేళ్ల కిందట జరిపిన తవ్వకాలకు గత Oct.లో కాకాణి, అతని అనుచరులకు నోటీసులిచ్చారు. కాకాణి Decలో హైకోర్టులో స్టే తెచ్చుకున్నారు. రూ.53Cr జరిమానాగా అప్పట్లో విధించారని మైన్స్ DD శ్రీనివాసరావు Way2Newsకు తెలిపారు. అయితే అప్పట్లో జరగని ఎంక్వరీ ఇప్పుడేందుకని పలువురు చర్చించుకుంటున్నారు.

కృష్ణాపురంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో వచ్చే నెల 9వ తేదీన ప్రేరణ ఉత్సవం ఫేస్-2 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నెల్లూరు డీఈవో బాలాజీరావు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, సీబీఎస్ఈ పాఠశాలలు, కళాశాలల్లో 8వ తరగతి నుంచి 11 విద్యార్థులు ముందుగా https://prerana. education.gov.inలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.

నెల్లూరు జిల్లా దుత్తలూరుకు చెందిన రిటైర్డ్ జవాన్ గంగాధర్ కుమారుడు భారతాల ఉదయ్ శంకర్ గ్రూప్-1 ఫలితాల్లో సత్తాచాటాడు. చిన్నప్పటి నుంచి ప్రభుత్వ స్కూళ్లలో చదివాడు. రూ.20లక్షల ప్యాకేజీతో సాప్ట్‌వేర్ జాబ్ చేసేవాడు. ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా ఆ జాబ్ వదిలేశాడు. కష్టపడి గ్రూప్-1లో పాస్ కావడంతో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్స్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. అతనికి పలువురు అభినందనలు తెలిపారు.

నెల్లూరు పరేడ్ గ్రౌండ్‌లో పోలీస్ స్పోర్ట్స్ మీట్-2026 ఏర్పాటు చేశారు. ఎస్పీ అజిత వేజెండ్ల పావురాలు, బెలూన్లు విడిచిన అనంతరం స్పోర్ట్స్ టార్చ్ వెలిగించి క్రీడలను ప్రారంభించారు. అథ్లెటిక్స్, ఫుట్‌బాల్, క్రికెట్, కబడ్డీ సహా పలు విభాగాల్లో పోటీలు మూడు రోజుల జరగనున్నాయి. తొలిరోజు సిబ్బంది ఉల్లాసంగా పోటీల్లో పాల్గొన్నారు.

మాజీ మంత్రి కాకాణి, వేమారెడ్డి శ్యాం సుందర్ రెడ్డి, రఘునాథ్ రెడ్డి, మందల శేషయ్య, షేక్ షాజ్‌హాన్‌కు షాక్ తగిలింది. గతంలో వెంకటాచలం(M) ఈదగాలి, రామదాసుకండ్రిగలో లక్షల క్యూబిక్ మీటర్ల గ్రావెల్ అక్రమంగా తవ్వినట్లు విచారణలో తేలింది. ఒక్కో క్యూబిక్ మీటర్‌కు రూ.45 వెలగట్టి.. దానికి 10రెట్లతో రూ.53 కోట్ల ఫైన్ కట్టాలని ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. కాకాణి కోర్టుకు వెళ్లడంతో మరోసారి విచారణకు ఆదేశించింది.

జిల్లాలో వానొచ్చినా, బలమైన గాలులు వీచినా, వెంటనే వైర్లు తెగిపోయి కరెంట్ ఆగిపోతుంది. ఇలాంటి పరిస్థితుల నుంచి గట్టేక్కెందుకు TRANSCO చేపట్టిన 3 ఫేజ్ విద్యుత్ వైర్ల ఏర్పాటు నత్త నడకన సాగుతోంది. జిల్లాలో 2816 KM మేరా ఏర్పాటు చేయాల్సి ఉండగా 1708 KM పూర్తి చేశారు. రూ.500 కోట్ల వెచ్చించగా ఇప్పటి వరకు రూ.230Cr మాత్రమే ఖర్చు చేసినట్లు సమాచారం. మార్చిలోగా వీటిని పూర్తిచేసి అందుబాటులోకి తీసుకు రావాల్సి ఉంది.

వ్యవసాయశాఖ ద్వారా ఏ పథకం అమలైనా రైతులకు అందాలంటే వ్యక్తిగత గుర్తింపు నంబర్లు తప్పనిసరి. ఆ గుర్తింపు నెంబర్‌ను AP ఫార్మర్ రిజిస్ట్రీ (apfr) అంటారు. జిల్లాలో 2.69 లక్షలు మంది రైతులు ఉండగా 1.69 లక్షల మందికి ఈ గుర్తింపు నెంబర్ ఉంది. PM కిసాన్, అన్నదాత సుఖీభవ, పంటల బీమా, రైతు రాయితీలు పొందాలంటే సచివాలయంలో ఉండే VAAలను సంప్రదించి ఆధార్ కార్డు, భూపత్రాలు, ఫోన్ నెంబర్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి.

Sorry, no posts matched your criteria.