India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆంధ్ర, TN సరిహద్దులోని సూళ్లూరుపేట RDOగా వచ్చేందుకు కొందరు పోటీపడుతున్నారు. జిల్లా పునర్విభజనకు ముందు సూళ్లూరుపేట నియోజకవర్గంలోని 6 మండలాలకే ఈ RDO కార్యాలయం ఉండేది. జిల్లాల పునర్విభజన తర్వాత తిరుపతి జిల్లాకేంద్రంగా సూళ్లూరుపేట రెవెన్యూ డివిజన్‌లో సత్యవేడు, వరదయ్యపాళెం, BN కండ్రిగ మండలాలను విలీనం చేశారు. డివిజన్ పరిధి 9 మండలాలకు విస్తరించడంతో RDOగా వచ్చేందుకు నలుగురు ఆశావాహులు ఉన్నట్లు తెలుస్తోంది.
నెల్లూరు జిల్లాలో మొత్తం 34 మంది తహశీల్దార్లను బదిలీ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఆనంద్ మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికలకు ముందు వీరిని ప్రకాశం, బాపట్ల, గుంటూరు జిల్లా నుంచి నెల్లూరుకు మార్చారు. ఎన్నికలు ముగియడం సాధారణ పరిస్థితి రావడంతో తిరిగి తహశీల్దార్లను ప్రకాశం, గుంటూరులోని సొంత మండలాలకు బదిలీ చేశారు.
విక్రమ సింహపురి యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలలోని విద్యార్థులు 4వ సెమిస్టర్ పరీక్షలు రాసి 3 నెలలు అవుతుంది. వచ్చే నెల 22వ తేదీన ఐసెట్ కౌన్సిలింగ్ చివరి తేదీ. అయినప్పటికీ ఇంకా 4వ సెమిస్టర్ రిజల్ట్స్ రాకపోవడంతో.. విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. పరీక్షా ఫలితాలు ఆలస్యం కావడంతో విద్యార్థులు యూనివర్సిటీ పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు.
నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్‌గా మల్లవరపు సూర్య తేజ నేడు బాధ్యతలు స్వీకరించనున్నారని మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. ఉదయం 11 గంటలకు నెల్లూరు నగరంలోని మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఆయన నూతనంగా బాధ్యతలు చేపడతారు. దీనితో ఆయా శాఖ అధికారులు తప్పక హాజరు కావాలని కోరారు.
సూళ్లూరుపేట ఇసుకమిట్ట వద్ద రైలు నుంచి జారి పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు గుర్తించి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని పరిశీలించగా మృతుడు నెల్లూరుకు చెందిన ఏలూరు కుమార్‌గా గుర్తించారు. ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడి ఉంటాడని వారు భావిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.
ప్రధానమంత్రి విశ్వకర్మ పధకం కింద లబ్ధిదారుల ఎంపిక కు సచివాలయ సిబ్బంది ద్వారా పరిశీలన ప్రక్రియ పూర్తి చేయవలసినదిగా జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్ లో ప్రధానమంత్రి విశ్వకర్మ పధకం జిల్లా అమలు కమిటీ సమావేశం నిర్వహించారు.
డిఐసి జనరల్ మేనేజర్ సుధాకర్ ప్రధానమంత్రి విశ్వకర్మ పధకం ఉద్దేశాలను వివరించారు.
ఉదయగిరి పంచాయతీ బస్టాండ్‌లో ఉన్న సయ్యద్ అబ్దుల్ ఖాదర్ ఖాన్ సాహెబ్ ఖాదిరి వారి 219వ గంధం మహోత్సవం ఆగస్టు 2న నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 2వ తేదీన హక్కుదారులు, దర్గా కమిటీ సభ్యులచే సందల్ మాలి జరుగుతోందని 3వ తేదీన దర్గా కమిటీ వారి చదివింపులు, పూల చాందినీ, మేళతాళములతో దర్గా షరీఫ్ చేరుతుందన్నారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.
జిల్లాలో బీసీ సంక్షేమ శాఖ తరఫున ఉపాధ్యాయ డీఎస్సీ పరీక్షల కోసం పోటీపడుతున్న అభ్యర్థులకు త్వరలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా అధికారి వై.వెంకటయ్య తెలిపారు. అందులో భాగంగా వీఆర్సీ హైస్కూల్‌లో శిక్షణ కోసం తరగతి గదులను సిద్ధం చేసినట్టు తెలిపారు. సంబంధిత సబ్జెక్ట్స్ వారీగా అధ్యాపకులను నియమించి శిక్షణా తరగతులు ప్రారంభిస్తామని అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
మంగళవారం రోజు జరిగిన ఏపీ శాసనసభ సమావేశాల్లో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గత వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం దేవరపాడులోని నరసింహకొండ అభివృద్ధికి అప్పటి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సహకారంతో కేంద్ర ప్రభుత్వం నుంచి తను రూ.50 కోట్లు నిధులు తీసుకొస్తే, ఆనాటి సీఎం జగన్ దుర్మార్గంగా ఆ నిధులను ఆపేశారని మండిపడ్డారు.
ఓజిలి క్రాస్ రోడ్ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారును లారీ ఢీకొన్న ఘటనలో శ్రీనివాసులు అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందారు. అరుణాచలం దైవ దర్శనానికి వెళ్లి స్వగ్రామమైన ఒంగోలుకు వెళ్తున్న క్రమంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. మృతదేహాన్ని గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Sorry, no posts matched your criteria.