Nellore

News May 22, 2024

కావలిలో యువతికి వేధింపులు

image

కావలి పట్టణంలోని ఓ వీధికి చెందిన యువతిని అదే ప్రాంతానికి చెందిన యువకుడు వేధిస్తున్న ఘటనపై పోలీసు కేసు నమోదైంది. కొంతకాలంగా ఆ యువకుడు తనను ప్రేమ పేరుతో వేధించడంతో పాటు, కత్తితో బెదిరిస్తున్నాడని బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

News May 22, 2024

సింహ వాహనంపై పెంచల స్వామి విహారం

image

రాపూరు మండలం పెంచలకోనలో జరుగుతున్న శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం సింహ వాహన సేవ జరిగింది. నృసింహ జయంతి సందర్భంగా పెంచల స్వామికి విశేష పూజలు నిర్వహించారు. సింహ వాహనంపై కొలువై కోనలో విహరించిన శ్రీవారిని పెద్దసంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. సాయంత్రం గరుడసేవ జరగనున్న నేపథ్యంలో పెంచలకోనకు పెద్దసంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.

News May 22, 2024

నెల్లూరు: కోళ్ల పంపిణీపై అధికారుల విచారణ

image

ఎన్నికల పోలింగ్‌కు మందు రోజు ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మండలం మంగానెల్లూరులో ఓటర్లకు ఓ పార్టీ నేతలు కోళ్లు పంపిణీ చేశారని ప్రత్యర్థి పార్టీ నేతలు ఆరోపించారు. ఈఘటనపై మొదట గ్రామంలో విచారణ జరిపిన అధికారులు అలాంటిదేమీ లేదని తేల్చారు. పునర్విచారణ జరపాలని కలెక్టర్‌తో పాటు రిటర్నింగ్ అధికారులకు ఫిర్యాదులు అందాయి. ఎంపీడీఓ, ఎస్ఐ, ఇతర పోలీస్ సిబ్బంది మంగళవారం గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు.

News May 22, 2024

NLR: 100 మంది ఉద్యోగులకు నోటీసులు

image

ఎన్నికల విధులకు హాజరుకాని ప్రభుత్వ ఉద్యోగులపై నెల్లూరు జిల్లా ఎన్నికల అధికారి హరినారాయణన్ సీరియస్ అయ్యారు. పోలింగ్ రోజు విధులకు గైర్హాజరైన 100 మందికి పైగా ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. విధులకు ఎందుకు హాజరు కాలేదో లిఖితపూర్వకంగా తెలియజేయాలని ఆదేశించారు. నోటీసులు అందుకున్న ఉద్యోగుల్లో పలువురు మంగళవారం కలెక్టరేట్‌కు వచ్చారు.

News May 22, 2024

నెల్లూరు జిల్లాలో 24 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు

image

నెల్లూరు జిల్లాలో 10వ తరగతి, ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి లవన్న అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈనెల 24 నుంచి జూన్ 3వ తేదీ వరకు పదోతరగతి, ఈనెల 24 నుంచి జూన్ 1 వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు.

News May 22, 2024

నెల్లూరుకు చేరుకున్న గవర్నర్ అబ్దుల్

image

ఏపీ గవర్నర్ ఏస్ అబ్దుల్ నజీర్ మంగళవారం రాత్రి నెల్లూరు రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. ఆయన జిల్లా అధికారులు స్వాగతం పలికారు. కలెక్టర్ ఎం.హరి నారాయణన్, విక్రమ సింహపురి యూనివర్సిటీ వీసీ సుందర వల్లి, ఎస్పీ ఆరీఫ్ హఫీజ్, నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ వికాస్ మర్మత్, జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ పుష్పగుచ్ఛం అందజేశారు.

News May 21, 2024

అల్లర్లు జరగకుండా చర్యలు: కలెక్టర్

image

నెల్లూరు జిల్లాలో ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయ ఘర్షణలు, అల్లర్లు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎం.హరినారాయణన్ రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. మండల స్థాయిలో తహశీల్దార్లు, పోలీసు అధికారులు సంయుక్తంగా గ్రామాల్లో పర్యటించాలని సూచించారు. జిల్లాలో రాజకీయ ఘర్షణలు జరగకుండా కిందిస్థాయి సిబ్బందితో సమాచారం తెప్పించుకుని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

News May 21, 2024

నెల్లూరు: భారీగా నిలిచిన వాహనాలు

image

నెల్లూరు జిల్లా కోవూరు మండలం పడుగుపాడు వద్ద కొత్తగా రోడ్డు పనులు చేస్తున్నారు. వీటిని గ్రామస్థులు అడ్డుకున్నారు. నూతన రహదారి నిర్మాణ క్రమంలో పెద్దపడుగుపాడు గ్రామానికి ఊన్న దారిని మూసేస్తున్నారని చెప్పారు. తమ రోడ్డు అలాగే ఉంచాలంటూ ఆందోళనకు దిగారు. ఈక్రమంలో సుమారు 5 కిలోమీటర్ల మేర వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. గ్రామస్థులు ఆందోళనకు అన్ని పార్టీల నాయకులు మద్దతు తెలిపారు.

News May 21, 2024

నెల్లూరు: తెరుచుకోనున్న కళాశాలల హాస్టళ్లు

image

నెల్లూరు జిల్లాలోని బీసీ కళాశాల వసతి గృహాలను జూన్ 1 నుంచి ప్రారంభించాలని బీసీ వెల్ఫేర్ అధికారి వెంకటయ్య ఆదేశించారు. 1వ తేదీ నుంచి కళాశాలలు పున:ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో హాస్టళ్లను తెరిచి విద్యార్థులకు అందుబాటులో ఉంచాలన్నారు. విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు.

News May 21, 2024

కొండాపురం: బంగారు పథకానికి ఎంపికైన శ్రావణి

image

మండలంలోని రేణమాల గ్రామానికి చెందిన కండే శ్రావణి కామర్స్ లో స్వర్ణ పథకానికి ఎంపికయ్యారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా ఇంటర్ పూర్తయ్యాక ఈమె కొన్నేళ్లపాటు చదువును నిలిపివేశారు. అనంతరం చదువుపై మక్కువతో వింజమూరులోని డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు, ప్రథమ స్థానంలో నిలిచారు. వివాహమయ్యాక భర్త ప్రోత్సాహంతో పీజీ చదువుకున్నారు. నేడు గవర్నర్ చేతుల మీదుగా స్వర్ణ పథకం అందుకోనున్నారు.